DigiYatra in 3 Airports _ How to register, create face ID to take flights without paper boarding pass
DigiYatra in 3 Airports : దేశంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఎంపిక చేసిన మూడు విమానాశ్రయాలలో కొత్త ఫేస్ ID బోర్డింగ్ సౌకర్యం అందుబాటులోకి వచ్చేసింది. అదే.. డిజియాత్ర (DigiYatra). ఈ కొత్త సౌకర్యం పేపర్ లెస్, అవాంతరాలు లేని ప్రయాణాన్ని కొనసాగించేందుకు విమాన ప్రయాణికులకు అనుమతినిస్తుంది.
విమాన ప్రయాణికులు డిజియాత్ర (DigiYatra) యాప్‌లో తమ వివరాలను రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే తమ అకౌంట్ Face IDని కూడా క్రియేట్ చేసకోవాలి. బయోమెట్రిక్ డేటాను కూడా సేవ్ చేయాలి. చెక్ ఇన్, సెక్యూరిటీ చెక్, ఎయిర్‌క్రాఫ్ట్ బోర్డింగ్ సమయంలో ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణీకుల సమాచారాన్ని ఆటోమేటిక్‌గా ప్రాసెస్ చేసేందుకు DigiYatra యాప్‌లో సేవ్ డేటా ద్వారా యాక్సస్ పొందవచ్చు.
ముఖ్యంగా, Face ID చెక్-ఇన్ సౌకర్యం దేశీయ విమానాల కోసం దశలవారీగా అందుబాటులోకి వస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ, బెంగళూరు, వారణాసిలో విమానాశ్రయాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఆ తరువాత మార్చి 2023 నాటికి హైదరాబాద్, కోల్‌కతా, పూణే, విజయవాడలలో కూడా DigiYatra సౌకర్యం అందుబాటులోకి రానుంది.
కేంద్ర ప్రభుత్వం తదుపరి నెలల్లో మరిన్ని విమానాశ్రయాల్లో డిజియాత్ర సౌకర్యాన్ని ప్రారంభించనుంది. మీరు డిజియాత్ర అర్హత గల విమానాశ్రయాల ద్వారా విమాన ప్రయాణాన్ని ప్లాన్ చేస్తుంటే.. మీ ఫేస్ ఐడి (Face ID)ని ఉపయోగించి కొత్త e-Service, బోర్డ్ ఫ్లైట్ కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు.
How to register, create face ID to take flights without paper boarding pass
డిజియాత్ర యాప్‌లో మీ ఫేస్ ఐడిని ఎలా క్రియేట్ చేసుకోవాలి :
* మీ Android లేదా iOS స్మార్ట్‌ఫోన్‌లో Digi Yatra Foundation ద్వారా DigiYatra యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి.
* ఇప్పుడు మీ ఆధార్ లింక్ చేసిన మొబైల్ నంబర్‌ని ఉపయోగించి యాప్‌లో రిజిస్టర్ చేసుకోండి.
* వెరిఫై చేసేందుకు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని ఎంటర్ చేయండి.
* ఆ తర్వాత డిజిలాకర్ లేదా ఆఫ్‌లైన్ ఆధార్ ఆప్షన్ ఉపయోగించి మీ ID ఆధారాలను లింక్ చేయండి.
* DigiYatra యాప్ మిమ్మల్ని సెల్ఫీ ఫోటో తీసుకోవాలని సూచిస్తుంది.
* ఆధార్‌తో లింక్ చేసిన మీ Face IDని వెరిఫై చేసేందుకు స్పష్టమైన సెల్ఫీని తీసుకోని DigiYatra యాప్‌లో అప్‌లోడ్ చేయండి.
* ఆ ప్రక్రియను అనుసరించి, మీరు ప్రయాణించబోయే మీ విమాన వివరాలను ఎంటర్ చేయాలి.
* విమానాశ్రయంలో బయలుదేరే ప్రక్రియలో మీరు షేర్ చేయాల్సిన యాప్‌లో మీ బోర్డింగ్ పాస్ డేటాను అప్‌డేట్ చేయండి.
* DigiYatra IDని క్రియేట్ చేసిన తర్వాత, IDని వెరిఫై చేసేందుకు మీరు విమానాశ్రయంలోని రిజిస్ట్రేషన్ కియోస్క్‌కి వెళ్లవలసి ఉంటుంది.
* మీరు ఆధార్ వివరాలను సమర్పించినట్లయితే.. ఆధార్ కార్డులలో ఇప్పటికే బయోమెట్రిక్ డేటా ఉన్నందున వెరిఫికేషన్ ఆన్‌లైన్‌లో అవుతుంది.
* అయితే, మీరు మరొక IDని షేర్ చేసినట్లయితే.. CISF దానిని మాన్యువల్‌గా ధృవీకరిస్తుంది.
* ప్రయాణికుడి వివరాలు వెరిఫై అయిన తర్వాత, మీ వివరాలు ఫ్యూచర్ జెర్నీ కోసం డిజియాత్ర యాప్‌కి లో స్టోర్ అవుతాయి.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..