Diwali 2025 Gift Guide
Diwali 2025 Gift Guide : కొత్త వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ కొంటున్నారా? దీపావళి పండగ సందర్భంగా మీ ప్రియమైనవారికి వైర్‌లెస్ ఇయర్ బడ్స్ గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు. వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లు చాలా స్టైలిష్‌గా ఉంటాయి. మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు మ్యూజిక్ లవర్స్ అయితే వారికి వైర్‌లెస్ ఇయర్ బడ్స్ బహుమతిగా ఇచ్చి చూడండి.
చాలా సంతోషపడతారు. ప్రస్తుతం మార్కెట్లో పండగ సీజన్ (Diwali 2025 Gift Guide) సందర్భంగా అనేక బ్రాండ్‌ల నుంచి రూ.2వేల కన్నా తక్కువ ధరలో లభ్యమవుతున్నాయి. ఇందులో మీకు నచ్చిన బ్రాండ్ నుంచి ఏదైనా వైర్‌లెస్ ఇయర్ బడ్స్ కొనేసుకోవచ్చు. సౌండ్ క్వాలిటీ, బ్యాటరీ లైఫ్, ఫీచర్ల పరంగా అద్భుతంగా ఉంటాయి.
బోట్ ఎయిర్‌డోప్స్ 131 :
ప్రస్తుతం బోట్ ఎయిర్‌డోప్స్ 131 ఇయర్‌ఫోన్ బడ్జెట్ ఇయర్‌ఫోన్‌లలో బెస్ట్. లుక్స్, గ్లామర్ పరంగా బాగుంటుంది. అన్నింటికి చాలా ఫిట్‌గా ఉంటుంది. మ్యూజిక్ వినొచ్చు. ఇన్‌కమింగ్ కాల్స్ చేసేందుకు 17 గంటల బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. మ్యూజిక్, వాయిస్ కాల్స్ కోసం బాస్, క్రిస్టల్ సౌండ్ ఫీచర్లతో వస్తుంది.
రియల్‌మి బడ్స్ Q2 :
రియల్‌మి బడ్స్ క్యూ2 ఇయర్‌బడ్ 2వేల కన్నా తక్కువ ధరలో లభిస్తోంది. ఫాస్ట్ ఛార్జింగ్ 20 గంటలకు పైగా ప్లేటైమ్ అందిస్తుంది. ఎంతసేపు అయినా మ్యూజిక్ విన్నా కొంచెం కూడా ఇబ్బందిగా ఉండదు. ఇయర్‌పీస్‌లు స్మూత్ బాస్, హోమ్ పార్టీలకు సౌండ్ క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. రోజువారీ వినియోగానికి రియల్‌మి బడ్స్ Q2 సరిగ్గా ఫిట్ అవుతాయి.
Read Also : iPhone 15 Price : అమెజాన్‌లో బిగ్గెస్ట్ డిస్కౌంట్.. భారీగా తగ్గిన ఆపిల్ ఐఫోన్ 15.. పండక్కీ కొనాలా? వద్దా?
నాయిస్ షాట్స్ నియో 2 అదిరిపోయే ఫీచర్లు కలిగి ఉంది. సౌండ్ క్వాలిటీ విషయంలో అద్భుతంగా ఉంటుంది. 10 గంటల బ్యాటరీ లైఫ్ బాగుంది. ఫుల్ వాటర్‌ప్రూఫ్ కూడా. మీరు జిమ్‌కు వెళ్లే స్నేహితులకు లేదా ఇంట్లో వారికి ఫ్యామిలీ ఫ్రెండ్లీ గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు.
రెడి (Reddi) ఇయర్‌బడ్స్ 3A :
ఈ రెడి ఇయర్ బడ్స్ 3ఎ అత్యంత తేలికైనది. ట్రావెలర్లకు బాగుంటుంది. ఈజీగా మీ జేబులో పెట్టుకోవచ్చు. ఫుల్ ఛార్జ్ చేస్తే.. దాదాపు 12 గంటలు బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. సౌండ్ క్వాలిటీతో అద్భుతంగా ఉంటుంది.
pTron బాస్‌బడ్స్ ఫ్లో :
పీట్రాన్ బాస్‌బడ్స్ ఫ్లోలో లిజనింగ్-లెన్సింగ్‌లో అద్భుతమైన హెవీ బాస్, సౌండ్ క్వాలిటీ కలిగి ఉంది. రోజువారీ వినియోగానికి బాగుంటుంది. ఈ ఇయర్‌ఫోన్ ఒకసారిగా ఛార్జింగ్ పెడితే 15 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది.
ఈ దీపావళికి మీ స్నేహితులందరికీ, సన్నిహిత కుటుంబ సభ్యులందరికీ అద్భుతమైన ఇయర్‌ఫోన్‌లను బహుమతిగా ఇవ్వొచ్చు. boAt Airdopes 131, Realme Buds Q2, Noise Shots NEO 2 వంటి సరసమైన ఇయర్‌ఫోన్‌లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఇయర్ ఫోన్స్ మీ ప్రియమైనవారికి బహుమతిగా ఇవ్వొచ్చు.