Social Media App
Social Media App : చేతిలో సెల్ ఫోన్ లేకపోతే క్షణం ఉండలేని పరిస్థితి. రాత్రి నిద్రపోయే ఆ కొన్ని గంటలు మాత్రమే దానిని నుండి విరామం తీసుకుంటున్నారు. ప్రపంచం మొత్తం సోషల్ మీడియా చుట్టూ తిరిగేస్తోంది. రకరకాల యాప్స్‌తో మనుష్యులంతా బిజీ అయిపోయారు. విషయం ఏంటంటే.. 2023 లో ఓ సోషల్ మీడియా యాప్‌ను చాలామంది డిలీట్ చేసారట. ఆ యాప్ ఏంటి? కారణం ఏంటి?
సోషల్ మీడియాలో అనేక యాప్స్ ఉన్నాయి. జనం తమకు నచ్చిన ప్లాట్ ఫారమ్‌లో యాక్టివ్‌గా ఉంటారు. నచ్చిన యాప్ డౌన్ లోడ్ చేయడం.. నచ్చకపోతే అన్‌ఇన్‌స్టాల్ చేయడం.. ఈ విషయంలో జనం చాలా ఫాష్ట్‌గా ఉంటారు. ఇటీవల కాలంలో కొన్నిTRG డేటా సెంటర్లు దీనిపై ఒక సర్వే చేపట్టాయి. అందులో ఊహించని ఫలితాలు వెలుగు చూసాయి. ఈ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 4.8 బిలియన్ సోషల్ మీడియా వినియోగదారులు ఉన్నారు. ప్రపంచ జనాభాలో వీరు 59.9%.. మొత్తం ఇంటర్నెట్ వినియోగదారులలో 92.7% ఉన్నారు. వీరిలో 6.7% మంది వేర్వేరు నెట్ వర్క్‌లను ఉపయోగిస్తూ రోజుకు సగటున 2 గంటల 24 నిముషాలు వీటిపైనే గడుపుతున్నారట.
Also Read: యువతను చెడగొడుతున్నాయి.. ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థపై 40 రాష్ట్రాలు దావా
సోషల్ మీడియాలో చాలామంది మక్కువ చూపే యాప్ ‘ఇన్‌స్టాగ్రామ్’. అయితే చాలామంది వినియోగదారులు ఈ యాప్‌ను తొలగించడానికి మొగ్గుచూపుతున్నారట. 2023 లో ప్రపంచ వ్యాప్తంగా 1 మిలియన్‌కు పైగా జనం ప్రతి నెల ‘ నా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఎలా డిలీట్ చేయాలి’ అని సెర్చ్ చేస్తున్నారట. అందుకు కారణం ఏంటనేది మాత్రం నివేదికలో చెప్పలేదు. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఈ యాప్ ప్రపంచ వ్యాప్తంగా 2.4 బిలియన్ యాక్టివ్ యూజర్లను కలిగి ఉందని నివేదిక చెబుతోంది. ప్రతి నెల 1 మిలియన్ మంది ప్రజలు తమ ఖాతాలు తొలగించాలని చూస్తే ఒక సంవత్సరం లోపు ఈ యాప్ పరిస్థితి మారిపోయే అవకాశం ఉంది.
Also Read : ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న ‘జమాల్ కుడు’ పాట.. ఈ పాటకు అర్ధం తెలుసా?
2011 లో ప్రారంభమైన Snapchat యాప్‌ను కూడా నెలకు 1,30,000 మంది తొలగించాలని చూస్తున్నారట. ఈ సంఖ్య ఇన్‌స్టాగ్రామ్ కంటే తక్కువైనప్పటికీ 750 మిలియన్ల వినియోగదారులున్న ఈ యాప్‌కి ఇది పెద్ద నంబర్ అని చెప్పాలి.