Viral Video : ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న ‘జమాల్ కుడు’ పాట.. ఈ పాటకు అర్ధం తెలుసా?
యానిమల్ సినిమాలోని 'జమాల్ కుడు' సాంగ్ బాగా పాపులర్ అయ్యింది. ఈ పాటకు తెగ వీడియోలు చేస్తున్నారు. అయితే ఈ పాటకు అర్ధమేంటో తెలుసా?

Viral Video
Viral Video : రణ్ బీర్ కపూర్-సందీప్ వంగ కాంబోలో వచ్చిన ‘యానిమల్’ కలెక్షన్ల వర్షం కురిపించింది. రణ్ బీర్ కపూర్ కెరియర్ లోనే యానిమల్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. డిసెంబర్ 1 న రిలీజైన ఈ సినిమాలో హింస, బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉందంటూ విమర్శలు వచ్చాయి. అయినా జనం సినిమాను బాగానే ఆదరించారు. అయితే ఈ సినిమాలో ‘జమాల్ కుడు’ అనే పాట ఓ రేంజ్ లో పాపులర్ అయ్యింది. యూట్యూబ్ లో దుమ్ము రేపింది. అసలు ఈ పాటకు అర్ధమేంటో తెలుసా?
Kannappa : న్యూజిలాండ్‌లో మంచు విష్ణు ‘కన్నప్ప’ షూటింగ్ పూర్తి.. అప్డేట్స్ ఇవే..
యానిమల్ సినిమాలో విలన్ గా నటించిన బాబీ డియోల్ ఎంట్రీలో ‘జమాల్ కుడు’ అంటూ ఓ పాట వస్తుంది. ఈ పాట సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసింది. ఈ పాటకు ఎంతోమంది స్టెప్పులు వేస్తూ వీడియోలు చేసారు. సంగీతం, క్యాచీగా ఉన్న లైన్స్ జనాల్ని బాగా ఎట్రాక్ట్ చేసాయి. అయితే ఈ పాటలో ‘జమాల్ జమలేక్ జమాలు జమల్ కుడు’ అనే పదాలు వినిపిస్తాయి. ఈ పాట నిజానికి 1950 లలోని ఇరానియన్ సాంగ్ అట. ఈ పదాలకు ‘ఓ నా ప్రేమ.. ప్రియమైన.. నా మధురమైన ప్రేమ’ అని అర్ధమట. ఓల్డ్ ఇరానియన్ పాటను సందీప్ వంగ ఫ్రెష్ మ్యూజిక్ తో రీక్రియేట్ చేయించారట. అది కాస్త జనాల్లోకి దూసుకుపోయింది.
Mahesh Babu : మహేష్ బాబు అల్లుడు అలా.. కొడుకు ఇలా.. వీడియోస్ వైరల్..
ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన యానిమల్ రూ.882.21 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. మూడోవారంలో కాస్త కలెక్షన్స్ తగ్గుముఖం పట్టాయి. తాజాగా ప్రభాస్ సలార్, షారుఖ్ ఖాన్ డంకీ సినిమాలు రిలీజ్ కావడం కూడా ప్రధాన కారణం కావచ్చు. ఈ నేపథ్యంలో యానిమల్ నుండి పూర్తి వీడియో సాంగ్స్ రిలీజ్ చేస్తోంది చిత్ర యూనిట్.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram