Mahesh Babu : మహేష్ బాబు అల్లుడు అలా.. కొడుకు ఇలా.. వీడియోస్ వైరల్..
మహేష్ బాబు కొడుకు గౌతమ్, కూతురు సితారకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక మహేష్ అల్లుడు, హీరో సుధీర్ బాబు కొడుకు అయిన చరిత్ మానస్..

Mahesh Babu son Gautam Ghattamaneni son in law Charith Maanas instagram videos
Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ స్టార్ గా కొనసాగుతున్నారు. సినిమాలు తీసుకు రావడంలో కొంచెం ఆలస్యం చేసినా.. సోషల్ మీడియా పోస్టులతో మాత్రం అభిమానులను అలరిస్తూ ఉంటారు మహేష్. ఇక ఆయన వారసులు కూడా వారి మాదిరే నెట్టింట మంచి క్రేజ్ ని సంపాదించుకుంటున్నారు. మహేష్ బాబు కొడుకు గౌతమ్, కూతురు సితారకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక మహేష్ అల్లుడు, హీరో సుధీర్ బాబు కొడుకు ‘చరిత్ మానస్’ కూడా ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాడు.
మేనమామ మహేష్ బాబు పోలికలు, చార్మ్ ని అందుకున్న చరిత్.. తన తండ్రిలా జిమ్నాస్టిక్స్, డాన్స్ లతో ఆకట్టుకుంటాడు. చరిత్ జిమ్నాస్టిక్స్ చేసే వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. ఇక ఈ వీడియోలు చూసిన కొంతమంది.. “మేనమామ పాపులారిటీని ఈ మేనల్లుడు సొంతం చేసుకునేలా ఉన్నాడు” అంటూ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఇక మేనల్లుడు ఇలా ఫిట్‌నెస్ ఫ్రీక్‌గా కనిపిస్తుంటే గౌతమ్ స్టడీస్ పై దృష్టి పెడుతున్నాడు.
Also read : Chiranjeevi : సలార్ టీంకి చిరంజీవి అభినందనలు.. మై డియర్ ప్రభాస్..
View this post on Instagram
లండన్ లో ప్లస్ 2 పూర్తి చేసిన గౌతమ్.. ఇటీవలే న్యూయార్క్ యూనివర్సిటీలో(NYU) చదువుకోవడానికి అమెరికా వెళ్ళాడు. గౌతమ్ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి మరో పదేళ్లు పడుతుందంటూ నమ్రతా ఇటీవల తెలియజేసిన సంగతి తెలిసిందే. ఇక ఎప్పుడు అమ్మ నమ్రతాతో కనిపించే గౌతమ్ కి సంబంధించిన ఓ పాత వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. గతంలో ఒక ఫంక్షన్ కి గౌతమ్, నమ్రతాతో కలిసి వెళ్ళాడు.
ఆ ఫంక్షన్ లో ఉన్న ఓ టీనేజ్ అమ్మాయి గౌతమ్ ని సెల్ఫీ అడిగి దిగుతుంటుంది. ఇంతలో నమ్రతా వచ్చి గౌతమ్ ని అక్కడి నుంచి తీసుకు వెళ్తుంటారు. ఈ వీడియోని ప్రభాస్ ‘మిర్చి’ సినిమాలోని సీన్ తో మ్యాచ్ చేసి వైరల్ చేస్తున్నారు. మిర్చి సినిమాలో ఒక పెళ్లి ఫంక్షన్ సీన్ అమ్మాయిలు అందరూ ప్రభాస్ ని చుట్టుముట్టి కబుర్లు చెబుతుంటే.. నదియా వచ్చి అక్కడి నుంచి తీసుకు వెళ్లే సీన్ గుర్తుకు ఉండే ఉంటుంది. ‘ఆడపిల్లని కాపాడుకున్నట్లు కాపాడుకోవాల్సి వస్తుందిరా నిన్ను’ అనే డైలాగ్ ని నమ్రతా, గౌతమ్ కి సెట్ చేసి పెట్టగా అందర్నీ ఆకట్టుకుంటుంది.
View this post on Instagram