Kannappa : న్యూజిలాండ్‌లో మంచు విష్ణు ‘కన్నప్ప’ షూటింగ్ పూర్తి.. అప్డేట్స్ ఇవే..
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'కన్నప్ప' న్యూజిలాండ్ షెడ్యూల్ పూర్తి అయ్యింది.

Mohan Babu gave update on Manchu Vishnu Kannappa Movie
Kannappa : బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘కన్నప్ప’. విష్ణు డ్రీం ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో.. మధుబాల, ప్రభాస్, నయనతార, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, శరత్ కుమార్.. ఇలా స్టార్ క్యాస్ట్ నటించబోతుంది. ఇక ఈ మూవీ షూటింగ్ ని న్యూజిలాండ్ అడవుల్లో మొదలు పెట్టిన చిత్ర యూనిట్.. దాదాపు మూడు నెలలు పాటు చిత్రీకరణ చేసి అక్కడ షూటింగ్ ని పూర్తి చేసింది. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న మోహన్ బాబు ఈ విషయాన్ని ఆడియన్స్ కి తెలియజేశారు.
“విష్ణు మంచు కథానాయకుడిగా నిర్మిస్తున్న ‘కన్నప్ప’ చిత్రం.. 600 మంది హాలీవుడ్ మరియు భారతదేశంలోని అతిరధ మహారధులైన నటీనటులతో, థాయిలాండ్ మరియు న్యూజిలాండ్ సాంకేతిక నిపుణులతో 90 రోజుల మొదటి షెడ్యూల్ ని న్యూజిలాండ్ లో పూర్తీ చేసుకుంది. అద్భుతమైన లొకేషన్స్ లో ఆ పరమేశ్వరుడు, షిర్డీ సాయినాథుని ఆశీస్సులతో అనుకున్నది అనుకున్నట్టుగా దిగ్విజయంగా షూటింగ్ పూర్తి చేసుకుని భారతదేశానికి తిరిగి వస్తున్నాము” అంటూ మోహన్ బాబు ట్వీట్ చేశారు.
Also read : Mahesh Babu : మహేష్ బాబు అల్లుడు అలా.. కొడుకు ఇలా.. వీడియోస్ వైరల్..
న్యూజిలాండ్ లో 600 మంది హాలీవుడ్, మరియు భారతదేశంలోని అతిరధ మహారధులైన నటీనటులతో, థాయిలాండ్ మరియు న్యూజిలాండ్ సాంకేతిక నిపుణులతో, విష్ణు మంచు కథానాయకుడిగా నిర్మిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. 90 రోజుల మొదటి షెడ్యూల్ న్యూజిలాండ్ లోని అద్భుతమైన లొకేషన్స్ లో ఆ పరమేశ్వరుడు, షిర్డీ… pic.twitter.com/llUmLqV4xK
— Mohan Babu M (@themohanbabu) December 23, 2023
న్యూజిలాండ్ షెడ్యూల్ లో శరత్ కుమార్, మోహన్ లాల్ పాల్గొన్నారు. వారిద్దరికీ సంబంధించిన షూటింగ్ పూర్తి అయ్యినట్లు తెలుస్తుంది. ఇక మిగిలిన స్టార్ క్యాస్ట్ పై సన్నివేశాలను ఇండియా షెడ్యూల్ తెరకెక్కించనున్నారని తెలుస్తుంది. అయితే టాలీవుడ్ ఆడియన్స్ అంతా ప్రభాస్ ఈ మూవీ సెట్స్ లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తారా అని ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ శివుడిగా కనిపించబోతున్నారట. పార్వతీ దేవిగా నయనతార నటించబోతున్నారని తెలుస్తుంది. ప్రభాస్ ని ఇప్పటికే రాముడిగా చూసిన అభిమానులు.. శివుడిగా కూడా చూసేందుకు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.