ట్రంప్‌కు షాకిచ్చిన ట్విట్టర్, ఫేస్‌బుక్.. ట్వీట్లు తొలగింపు.. 12 గంటలు అకౌంట్ సస్పెండ్!

Donald Trump Facebook-Twitter account suspend: ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు సోషల్ మీడియా దిగ్గజాలు ఫేస్ బుక్, ట్విట్టర్ షాక్ ఇచ్చాయి. ట్రంప్ అకౌంట్లను 12 గంటల పాటు సస్పెండ్ చేశాయి. తమ ప్లాట్ ఫాంపై నిబంధనలను ఉల్లంఘించినందుకు ట్రంప్ పోస్టులను ఫేస్ బుక్ తొలగించింది. ట్రంప్ అకౌంట్‌ను 12 గంటల పాటు ట్విట్టర్ నిలిపివేసింది. తమ నియమాలకు విరుద్ధంగా ఉన్న ట్వీట్లను తొలగించాలని ట్విట్టర్ ట్రంప్‌ను కోరింది. ట్వీట్లు తొలగించకపోతే ఖాతాను లాక్ చేస్తామని ట్విట్టర్ పేర్కొంది.
ట్రంప్ స్పందించకపోవడంతో ట్విట్టర్ ఆయన ట్వీట్లను తమ ప్లాట్ ఫాం నుంచి తొలగించింది. అమెరికాలో 2020లో నవంబర్ 3న జరిగిన ఎన్నికలకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా ట్రంప్ చేస్తున్న ట్వీట్లు, పోస్టులను ట్విట్టర్, ఫేస్‌బుక్ తప్పుబట్టాయి.
ట్రంప్ ట్వీట్ల నేపథ్యంలో ఆయన మద్దతుదారులంతా యూఎస్ క్యాపిటల్ భవనంలోకి చొచ్చుకెళ్లి నిరసనలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ ట్రంప్ అకౌంట్ ను 12 గంటల పాటు నిలిపివేసింది. అలాగే ఆయన తన మద్దతుదారులతో ప్రసంగిస్తున్న వీడియో సహా మూడు ట్వీట్లను ట్విట్టర్ బ్లాక్ చేసింది.