Trump Truth Social App : ట్రంప్ ‘ట్రూత్ సోషల్’ యాప్ వచ్చేస్తోంది.. ఆపిల్ App Storeలో రేపే లాంచ్..!

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘ట్రూత్​ సోషల్​’ (Truth Social) యాప్ వస్తోంది. సోమవారం (ఫిబ్రవరి 21)న Apple App Storeలో Truth Social యాప్ అందుబాటులోకి రానుంది

Trump Truth Social App : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘ట్రూత్​ సోషల్​’ (Truth Social) యాప్ వస్తోంది. సోమవారం (ఫిబ్రవరి 21)న Apple App Storeలో Truth Social యాప్ అందుబాటులోకి రానుంది. గతేడాది జనవరిలో అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో జరిగిన క్యాపిటల్ భవనం హింసాత్మక ఘటన తర్వాత ట్రంప్‌ కామెంట్లను ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ప్లాంలు బ్యాన్‌ విధించిన సంగతి విదితమే. అప్పుడే ట్రంప్ సొంతంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను తీసుకువస్తానని ప్రకటించారు. ఆయన అన్నట్టుగానే గతేడాది అక్టోబర్‌లో సొంత సోషల్ ప్లాట్ ఫాం లాంచ్ చేయనున్నట్టు ప్రకటించారు.

‘ట్రూత్​ సోషల్​’ పేరుతో సోషల్ మీడియా యా‌ప్‌ తీసుకొస్తున్నట్టు ఆయన వెల్లడించారు. 2022 ఫిబ్రవరి 21న ఈ కొత్త ట్రంప్ యాప్‌ను ఆపిల్ స్టోర్ లోకి అందుబాటులోకి రానుంది. ది ట్రంప్‌ మీడియా అండ్‌ టెక్నాలజీ గ్రూప్‌ (TMTG) ఆధ్వర్యంలో ఈ ‘ట్రూత్‌ సోషల్‌ యాప్’ లాంచ్ కానుంది. ఈ ట్రంప్ యాప్ అచ్చం ట్విట్టర్ మాదిరిగానే ఉంటుంది. ఈ యాప్‌లోనూ ట్విట్టర్ లానే ఒకరినొకరు ఫాలో చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడూ ట్రెండింగ్‌లో ఉన్న అంశాలను తెలుసుకోవచ్చు.

ట్రంప్ యాప్ లో ఫస్ట్ మెసేజ్ ఇదే.. 
ట్రంప్ కొత్త యాప్ ‘ట్రూత్ సోషల్’ యాప్‌లో ఫస్ట్ మెసేజ్ ఇదేనంటూ ఆయన కుమారుడు జూనియర్ ట్రంప్ ట్విట్టర్ వేదికగా ఓ పోస్టు పెట్టాడు. ఆ పోస్టులో ‘గెట్ రెడీ, మీకెంతో ఇష్టమైన అధ్యక్షుడు మిమ్మల్ని త్వరలో కలవబోతున్నారు’ అని పోస్టులో
రాసుకొచ్చాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ స్క్రీన్ షాట్ ఇదే.. ఇప్పటికే ఈ ట్రంప్ సోషల్ యాప్ కు సంబంధించిన ఫొటోలు వైరల్ అయ్యాయి. ట్విట్టర్ మాదిరిగా ఉండే ఈ ట్రూత్ సోషల్ యాప్.. ట్వీట్ (Tweet) కాకుండా ట్రూత్ (Truth)
అని పిలుస్తారు… యూజర్ చేసే ప్రతి పోస్టుకు Truth అని కనిపిస్తుంది.

ఈ యాప్ ప్రముఖ సోషల్ దిగ్గజాలైన ట్విటర్, ఫేస్‌బుక్‌‌కు గట్టి పోటీ ఇస్తుందని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ రిలీజ్ చేసిన ప్రకటన ప్రకారం.. ఈ యాప్ ద్వారా ప్రతిఒక్కరికి గొంతునివ్వడం కోసమేనని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఈ ట్రూత్ సోషల్‌ యాప్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు ట్రంప్ తెలిపారు.

Read Also : Truth App : ఇక కాస్కోండి.. ఫేస్‌బుక్, ట్విట్టర్‌‌కు పోటీగా ట్రంప్ ‘ట్రూత్’ యాప్!

ట్రెండింగ్ వార్తలు