Don’t buy iPhone 13 right now, you can get it for less than Rs 50,000 on September 23
iPhone 13 Sale : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) ఐఫోన్ 13 ధరను ఇటీవలే తగ్గించింది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) తమ ప్లాట్ ఫారంపై ఐఫోన్ 13 డివైజ్‌ను మరింత తక్కువ ధరకు విక్రయిస్తోంది. ఈ డివైజ్ అమెజాన్‌లో రూ. 65,900 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. రూ. 69,900 నుంచి రూ. 65,900కు తగ్గింది. వాస్తవానికి భారత మార్కెట్లో ఐఫోన్ 13 ధర రూ. 79,900కి ప్రారంభమైంది. ఐఫోన్ 14 లాంచ్ ఈవెంట్ సందర్భంగా ఆపిల్ అధికారికంగా రూ. 10వేల వరకు డిస్కౌంట్ ప్రకటించింది. దాంతో ఐఫోన్ 13 ధర రూ. 69,900కి పడిపోయింది.
ఇప్పుడు.. అమెజాన్ 4వేల వరకు ఫ్లాట్ డిస్కౌంట్ ఇస్తోంది. అంటే.. దీని ధరను రూ. 65,900కు తగ్గించింది. కానీ, మీరు మరింత ఎక్కువ డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే iPhone 13 కొనుగోలు చేయకపోవడమే మంచిది. రాబోయే కొన్ని వారాల ముందు దీపావళి వేడుకల్లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ లేటెస్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billion Days Sale Event) ఈవెంట్‌ను ప్రకటించింది.
Don’t buy iPhone 13 right now, you can get it for less than Rs 50,000 on September 23
ఐఫోన్ 13 (iPhone 13 Sale)ని రూ. 69,900 నుంచి తగ్గించి రూ. 49,900లకు అందజేస్తామని Flipkart క్లారిటీ ఇచ్చింది. అందిన సమాచారం ప్రకారం.. ఐఫోన్ 13పై రూ. 20వేల డిస్కౌంట్ అందిస్తామని Flipkart స్పష్టం చేసింది. ఈ-కామర్స్ దిగ్గజం ఇంకా కచ్చితమైన ఆఫర్ వివరాలను వెల్లడించలేదు. ఈ ఐఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ రూ. 20,000 ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ చేయదని తెలుసు. ఆఫర్ ప్రీపెయిడ్ ఆర్డర్‌లు, బ్యాంక్ కార్డ్‌లపై ఆధారపడి ఉంటుంది.
Pixel 6a డీల్ మాదిరిగానే కొంత ఫ్లాట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఈ ప్లాట్‌ఫారమ్ రూ. 16,300 డిస్కౌంట్ అందిస్తోంది. Flipkart అధికారికంగా ఈ ఆఫర్‌ను వెల్లడించింది. మరోవైపు Pixel 6aని రూ. 27,699 ధరతో పొందవచ్చు. దీనిపై రూ. 9,800 ఫ్లాట్ తగ్గింపు అందిస్తోంది. ప్రీపెయిడ్ ఆర్డర్‌లపై రూ. 3,000 డిస్కౌంట్, ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్‌లపై రూ. 3,500 డిస్కౌంట్ ఉంటుందని ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో ధృవీకరించింది. దీంతో Pixel 6a ధర రూ.27,699కి తగ్గనుంది.
Don’t buy iPhone 13 right now, you can get it for less than Rs 50,000 on September 23
Flipkart ఇదే డీల్‌తో iPhone 13ని అందించవచ్చు. ఈ ఐఫోన్ రూ.69,900 నుంచి రూ.49,900కి సేల్ అవుతుందని నివేదికలు చూపించాయి. ధర కోసం, యూజర్లు 128GB స్టోరేజ్ మోడల్‌ను పొందుతారు. ఫ్లిప్‌కార్ట్ కొన్ని ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను కూడా ఆఫర్ చేయనుంది. తద్వారా ఐఫోన్ 13 డివైజ్ ధర మరింత తగ్గనుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సెప్టెంబర్ 23న ప్రారంభం కానుంది.
Don’t buy iPhone 13 right now, you can get it for less than Rs 50,000 on September 23
ఫ్లిప్‌కార్ట్ ప్లస్ (Flipkart Plus) మెంబర్‌ల కోసం ఒక రోజు ముందుగానే ఈ సేల్ ప్రారంభం కానుంది. ఐఫోన్ 13 కొనుగోలుపై మరింత డబ్బు ఆదా చేయాలనుకుంటే.. మరో రోజు వేచి ఉండండి. ప్రస్తుతం iPhone 13ని కొనుగోలు చేయకపోవడమే మంచిది. ఐఫోన్ 13, ఐఫోన్ 14 మాదిరిగానే ఉంటుంది. ఈ రెండు 5G ఫోన్‌ల మధ్య ఎలాంటి తేడా లేదనే చెప్పాలి.