Ola Electric Scooter : ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ పై సందేహాలు, సమస్య వస్తే ఏం చెయ్యాలి.. కంపెనీ ఏం చెబుతోంది?

దేశంలో ఓలా స్కూటర్ల హావ మాములుగా లేదు. ఫ్రీ బుకింగ్స్ రోజే రికార్డు సృష్టించింది. రెండు రోజుల్లోనే రూ.1100 కోట్ల విలువైన స్కూటర్లను అలా విక్రయించింది.

Ola Electric Scooter : దేశంలో ఓలా స్కూటర్ల హావ మాములుగా లేదు. ఫ్రీ బుకింగ్స్ రోజే రికార్డు సృష్టించింది. రెండు రోజుల్లోనే రూ.1100 కోట్ల విలువైన స్కూటర్లను అలా విక్రయించింది. ఇక బుకింగ్ చేసుకున్న వారికి వచ్చే నెలలో డెలివరీ ప్రారంభించనుంది కంపెనీ. ఇక ఈ సమయంలోనే ఓ ప్రశ్న కొనుగోలు దారుల మదిని తొలుస్తోంది. ఒకవేళ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కి ఏదైనా సమస్య వస్తే ఎక్కడికి వెళ్లాలని చాలామంది ప్రశ్న లేవనెత్తుతున్నారు. అయితే ఈ ప్రశ్నపై కంపెనీ వర్గాలు ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.

Read More : Modi’s net worth : మోదీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలుసా ? వ్యక్తిగత వాహనం లేదు

ఓలా స్కూటర్లకి డిమాండ్ ఉంది.. డెలివరీ తర్వాత వినియోగదారుడికి ఏదైనా సమస్య తలెత్తితే దానిని సాల్వ్ చేసేందుకు సర్వీస్ సెంటర్లు లేవు. డీలర్లు, సేవా కేంద్రాల రూపంలో కంపెనీకి భౌతికంగా ఎక్కువ ఉనికి లేదు. కొనుగోలుదారులు స్కూటర్లను కొన్న తర్వాత వారిని తొలిచే అతి పెద్ద ప్రశ్నగా నిలుస్తోంది. అయితే ఓలా బైక్‌లో ఏదైనా సమస్య తలెత్తితే…ఓలా ఎలక్ట్రిక్ యాప్‌ను ఉపయోగించి..సర్వీస్‌పై రిక్వెస్ట్‌ చేయడంతో ఓలా బైక్‌ టెక్నీషియన్‌ ఇంటి వద్దకే వచ్చి రిపేర్‌ చేస్తాడని తెలుస్తోంది.

Read More : Visakha Steel : ఏపీలో బస్సులు బంద్, భారత్ బంద్‌‌కు ఏపీ ప్రభుత్వం మద్దతు

దీనికి సంబందించిన ప్రకటన ఓలా త్వరలో చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా దేశ వ్యాప్తంగా పలు ఎలక్ట్రిక్‌ సర్వీస్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలని కంపెనీ భావిస్తోంది. ఓలా స్కూటర్లకు డిమాండ్ భారీగా ఉంది. స్కూటర్ల డెలివరీ తర్వాత ఏదైనా సమస్యలు తలెత్తితే ఇది అమ్మకాలపైనే ప్రభావం చూపుతోంది. ఓలా స్కూటర్ లో ఏవైనా సమస్యలు తలెత్తితే కస్టమర్లు వాటిని లేవనెత్తక మానరు. వాటిని హైలెట్ చెయ్యకుండా ఊరుకోరు. ఇలా జరగకముందే ఓలా సర్వీస్ సెంటర్లపై ఓ నిర్ణయం తీసుకోవాలని నిపుణులు కూడా సూచిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు