Visakha Steel : ఏపీలో బస్సులు బంద్, భారత్ బంద్‌‌కు ఏపీ ప్రభుత్వం మద్దతు

విశాఖ ఉక్కు ప్రజల ఆస్తిగా ఉంచాలని, కార్పొరేట్లకు అమ్మవద్దంటూ..ఈనెల 27వ తేదీన భారత్ బంద్ జరుగనుంది. దీనికి పలు ప్రజా సంఘాలు, పార్టీలు మద్దతు ప్రకటించాయి.

Visakha Steel : ఏపీలో బస్సులు బంద్, భారత్ బంద్‌‌కు ఏపీ ప్రభుత్వం మద్దతు

Perninani

AP Minister Perni Nani : ఏపీ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు నిలిచిపోనున్నాయి. అయితే పూర్తిగా మాత్రం కాదు. కేవలం కొద్ది గంటలు మాత్రమే. దీనికి ఓ కారణం ఉంది. విశాఖ ఉక్కు విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ఏపీ ప్రభుత్వం వ్యతిరేకిస్తూ వస్తోంది. ఇదే విషయంలోనే కాక…రైతుకు ఇష్టం లేని చట్టాలు ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం కోరుతోంది.

Read More : Anushka Shetty : అనుష్క పెళ్లి ఎప్పుడో చెప్పేసిన జ్యోతిష్యుడు!

విశాఖ ఉక్కు ప్రజల ఆస్తిగా ఉంచాలని, కార్పొరేట్లకు అమ్మవద్దంటూ..ఈనెల 27వ తేదీన భారత్ బంద్ జరుగనుంది. దీనికి పలు ప్రజా సంఘాలు, పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఈ క్రమంలో..ఏపీ ప్రభుత్వం కూడా స్పందించింది. బంద్ కు సూత్రప్రాయంగా సంపూర్ణ మద్దతు తెలిపింది. శాంతియుతంగా నిరసన తెలపాలని ఏపీ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. అందులో భాగంగా…26వ తేదీ అర్ధరాత్ర నుంచి ఆర్టీసీ బస్సులను నిలిపివేస్తున్నట్లు, 27వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట వరకు బస్సులను నిలిపివేయడం జరుగుతుందన్నారు. విశాఖ ఉక్కు అమ్మవద్దని, రైతుకు ఇష్టం లేని చట్టాలు ఉపసంహరించాలని కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం కోరుతోందన్నారు.

Read More : Andhra Pradesh Corona : ఏపీలో కొత్తగా 1,167 కరోనా కేసులు, ఏడుగురు మృతి

విశాఖ ఉక్కు ఆంధ్రుల హ‌క్కు అని ఉద్య‌మించి సాధించుకున్న రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (RINL) ప్రైవేటీకరణకు కేంద్రం వెనక్కు తగ్గడం లేదు. విశాఖ ఉక్కు ఫ్యాక్ట‌రీ (RINL)లో 100 శాతం వాటాలను ఉప‌సంహ‌రించాల‌ని ఈ ఏడాది జ‌న‌వ‌రి 27న జ‌రిగిన కేంద్ర ఆర్థిక వ్య‌వ‌హారాల క్యాబినెట్ క‌మిటీ ఆమోదం తెలిపిన దగ్గర నుండి దీనిపై దేశవ్యాప్తంగా వివాదం చెలరేగుతున్నా కేంద్రం మాత్రం తాము అమలు చేయాలనుకున్న సంస్కరణలలో భాగం అడుగు ముందుకేసేందుకే సిద్దమవుతుంది.

Read More : AP : తెనాలిలో సినిమా టైటిల్స్ రిజిస్ట్రేషన్

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ విషయంలో తగ్గేదేలేదని కేంద్రం ప్రకటించగా.. ప్రైవేటీకరణ అంశంలో కీలకంగా ముందడుగులు వేస్తోంది. ఇప్పటికే ప్రైవేటీకరణకు సంబంధించి ప్రక్రియ ప్రారంభం అవ్వగా.. మరోవైపు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వద్దని ఉద్యోగ సంఘాలన్నీ పోరుబాట పట్టాయి.