Andhra Pradesh Corona : ఏపీలో కొత్తగా 1,167 కరోనా కేసులు, ఏడుగురు మృతి

ఏపీలో కరోనా కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,167 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక కరోనాతో ఏడుగురు మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 1,487 మంది కోలుకున్నారు.

Andhra Pradesh Corona : ఏపీలో కొత్తగా 1,167 కరోనా కేసులు, ఏడుగురు మృతి

Andhra pradesh

Updated On : September 25, 2021 / 5:18 PM IST

Andhra Pradesh Corona : ఏపీలో కరోనా కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,167 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక కరోనాతో ఏడుగురు మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 1,487 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 13,208 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది. కొవిడ్‌ వల్ల కృష్ణా జిల్లాలో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, తర్పుగోదావరి, గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరుచొప్పున మృతి చెందారు. కాగా గడించిన 24 గంటల్లో 55,307 కరోనా టెస్టులు నిర్వహించారు.

Viral Video : ఇలాంటి గణేశ్ నిమజ్జనం చూసి ఉండరు!

జిల్లాల వారీగా కరోనా కేసులు
అనంతపురం జిల్లాలో 11, చిత్తూరు జిల్లాలో 167, తూర్పుగోదావరి జిల్లాలో 224, గుంటూరు జిల్లాలో 110, కడప జిల్లాలో 91, కృష్ణా జిల్లాలో 113, కర్నూలు జిల్లాలో 09, నెల్లూరు జిల్లాలో 141, ప్రకాశం జిల్లాలో 130, శ్రీకాకుళం జిల్లాలో 12, విశాఖపట్నం జిల్లాలో 37, విజయనగరం జిల్లాలో 01, పశ్చిమగోదావరి జిల్లాలో 121 పాజిటివ్ కేసులు మోదయ్యాయి.