Earth's second moon will be visible from next week
Earth Second Moon : వచ్చేవారమే మన భూగ్రహానికి మినీ మూన్ రాబోతుంది. ఇప్పటికే భూమిపై కనిపించే చంద్రుడు ఉన్నాడు. మరో చిట్టి చంద్రుడు కూడా రానున్నాడు. మన చంద్రుడిలా పర్మినెంట్ కాదట.. కొద్దిరోజులు తాత్కాలికంగా మాత్రమే మన గ్రహంపై కనిపిస్తాడట. ఆ తర్వాత మాయమైపోతాడట.. అంటే.. దాదాపు 2 నెలల పాటు మన గ్రహం చుట్టూ తిరుగుతూ ఉంటాడట.. ఇంతకీ ఈ ఖగోళ అద్భుతం ఎప్పుడు జరుగనుందో తెలుసా? ఈ నెలాఖరులో ఒక గ్రహశకలం భూగురుత్వాకర్షణ పరిధిలోకి దూసుకురానుంది.
Read Also : Donald Trump : నా హత్యకు ఇరాన్ కుట్ర చేస్తోంది.. యూఎస్ ఇంటెలిజెన్స్ హెచ్చరికలపై ట్రంప్ కామెంట్స్..!
రెండో చంద్రుడు.. భూ కక్ష్యలో ఎంతకాలం ఉంటుందంటే? :
ఈ ఏడాదిలో సెప్టెంబర్ 29 నుంచి నవంబర్ 25 వరకు మన భూమి చుట్టూ తిరుగుతుంది. ఆ తర్వాత సూర్యుని వైపుగా వెళ్లిపోతుంది. వాస్తవానికి ఆగష్టు 7న 2024PT5 అనే ఈ గ్రహశకలాన్ని సైంటిస్టులు గుర్తించారు. స్పేస్.కామ్ ప్రకారం.. ఇది చంద్రుడు కాదు.. ఒక చిన్నపాటి గ్రహశకలం. దీన్ని సైంటిస్టులు మాత్రం మినీ మూన్ అని పిలుస్తున్నారు. దాదాపు 10 మీటర్ల పొడవు, 3,474 కిలోమీటర్ల వ్యాసం కలిగిన భూమి శాశ్వత చంద్రుడి కన్నా చాలా చిన్నదిగా ఉంటుంది.
నివేదికల ప్రకారం. ఈ మినీ మూన్ అనే గ్రహశకలం అర్జున గ్రహశకలం నుంచి వచ్చిందని పరిశోధకులు భావిస్తున్నారు. చాలా డైనమిక్‌గా చల్లగా, భూమి వంటి కక్ష్యలను అనుసరించే చిన్నపాటి గ్రహశకలాల సమూహంగా చెప్పవచ్చు.
చిట్టి చంద్రుడిని చూడగలమా? :
దురదృష్టవశాత్తు, ఈ గ్రహశకలం చూడటానికి చాలా ఎత్తుగా ఉంటుందని చాలా నివేదికలు చెబుతున్నాయి. ఇది చిన్నది. మందంగా ఉంది. కాబట్టి ఇది కంటికి లేదా చిన్న టెలిస్కోప్‌లతో కనిపించదు. కానీ, పెద్ద టెలిస్కోప్‌లకు మాత్రం కనిపిస్తుంది” అని ఓ నివేదిక పేర్కొంది.
“సాధారణ ఔత్సాహిక టెలిస్కోప్‌లు, బైనాక్యులర్‌లకు ఇది చాలా చిన్నదిగా మసకబారినట్టుగా కనిపిస్తుంది ఖగోళ శాస్త్రవేత్తలు ఉపయోగించే సాధారణ టెలిస్కోప్‌ల పరిధిలో బాగానే కనిపిస్తుంది. ఈ గ్రహశకలాన్ని పరిశీలించడానికి కనీసం 30 అంగుళాల వ్యాసం కలిగిన టెలిస్కోప్, సీసీడీ లేదా సీఎమ్ఓఎస్ డిటెక్టర్, 30 అంగుళాల టెలిస్కోప్ వంటి వాటితో ఖగోళ అద్భుతాన్ని వీక్షించవచ్చు.
2024 PT5 ఎంత పెద్దది? :
ఆస్టరాయిడ్ టెరెస్ట్రియల్-ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టమ్ (ATLAS)ని ఉపయోగించి సైంటిస్టులు ఈ మినీ పీటీ5 మూన్ గుర్తించారు. యూఎస్ఏ టుడే నివేదిక ప్రకారం.. 33-అడుగుల వెడల్పు, సిటీ బస్సు అంత వెడల్పు ఉంటుంది.
2055లో మళ్లీ భూమికి తిరిగి వస్తుందా? :
ఈ చిట్టి చంద్రుడు 20255లో భూమి కక్ష్యలోకి తిరిగి వస్తాడని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. ఆ తర్వాత మళ్లీ 2084లో భూమికి మినీ మూన్ రానుందని అంచనా. ఇది అరుదైన సంఘటన కాదు. భూమికి ఇంతకుముందు అనేక చిన్న చంద్రులు వచ్చి వెళ్లాయి. 1981లో, 2022లో కూడా ఈ తరహా సంఘటనలు చోటుచేసుకున్నాయి.