Airtel Xstream AirFiber Plans : ఎయిర్‌టెల్ కస్టమర్లకు పండగే.. ఎక్స్‌ట్రీమ్ ఎయిర్‌ఫైబర్ ప్లాన్లు.. ధర ఎంత? ఫీచర్లు, డేటా, ఓటీటీ బెనిఫిట్స్..!

Airtel Xstream AirFiber Plans : ఈ ఎయిర్ టెల్ ఎక్స్‌ట్రీమ్ ఎయిర్ ఫైబర్ సర్వీసును ఎలా పొందాలి? ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఎయిర్‌ఫైబర్ ధర, బెనిఫిట్స్, ఫీచర్‌లు, ప్లాన్‌లు, ఇన్‌స్టాలేషన్ వంటి పూర్తి వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Airtel Xstream AirFiber Plans : ఎయిర్‌టెల్ కస్టమర్లకు పండగే.. ఎక్స్‌ట్రీమ్ ఎయిర్‌ఫైబర్ ప్లాన్లు.. ధర ఎంత? ఫీచర్లు, డేటా, ఓటీటీ బెనిఫిట్స్..!

Airtel Xstream AirFiber Plans 2024_ Price in India

Updated On : September 25, 2024 / 9:43 PM IST

Airtel Xstream AirFiber Plans : భారత టెలికాం ఆపరేటర్‌లలో ఎయిర్‌టెల్ ఒకటి.. భారతీయ వినియోగదారులకు అనేక సేవలను అందిస్తుంది. ప్రస్తుతం కంపెనీ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్, బ్రాడ్‌బ్యాండ్, డిజిటల్ టీవీ కస్టమర్ల కోసం అనేక రకాల ప్లాన్‌లను అందిస్తోంది. అయితే, మీరు వైర్డు కనెక్షన్ లేని బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ కోసం చూస్తున్నారా? అయితే, ఇదే సరైన సమయం..

Read Also : Nothing Ear Open Launch : నథింగ్ ఇయర్ ఓపెన్ చూశారా? ఈ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

ఆసక్తి గల కస్టమర్ల కోసం ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ఎయిర్‌ఫైబర్ సర్వీసును కూడా అందిస్తుంది. మీ ఇల్లు లేదా ఆఫీసులో స్టేబులిటీతో 5జీ కనెక్షన్‌ ఈ వైర్‌లెస్ టెక్నాలజీతో పొందవచ్చు. ఇంతకీ ఈ ఎయిర్ టెల్ ఎక్స్‌ట్రీమ్ ఎయిర్ ఫైబర్ సర్వీసును ఎలా పొందాలి? భారత మార్కెట్లో ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఎయిర్‌ఫైబర్ ధర, బెనిఫిట్స్, ఫీచర్‌లు, ప్లాన్‌లు, ఇన్‌స్టాలేషన్ వంటి పూర్తి వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఎయిర్‌ఫైబర్ టెక్నాలజీ ఏంటి? :
ఎక్స్‌స్ట్రీమ్ ఎయిర్‌ఫైబర్ ప్రామాణిక ఎయిర్‌ఫైబర్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. కేబుల్‌లను ఉపయోగించకుండా వైర్‌లెస్‌గా డేటాను ప్రసారం చేస్తుంది. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ISP), సబ్‌స్క్రైబర్ లొకేషన్ మధ్య కనెక్షన్‌ని పొందడానికి టెక్నికల్ రేడియో సిగ్నల్‌లను ఉపయోగిస్తుంది. తద్వారా ఫైబర్ ఆప్టిక్స్ కేబుల్స్ లేదా కాపర్ లైన్ల అవసరాన్ని తగ్గిస్తుంది.

మీరు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఎయిర్‌ఫైబర్ కనెక్షన్‌ని కొనుగోలు చేసిన తర్వాత యాంటెన్నా ఇన్‌స్టాల్ చేయడానికి ఎయిర్‌టెల్ ప్రతినిధి మీ ఇంటికి లేదా ఆఫీసుకు వస్తారు. ఈ యాంటెన్నా సమీపంలోని స్టేషన్ లేదా టవర్‌తో కమ్యూనికేట్ చేస్తుంది. డేటాను బేస్ స్టేషన్‌కు ప్రసారం చేస్తుంది. బేస్ స్టేషన్ మీ ఇల్లు లేదా ఆఫీసు అంతటా వైర్‌లెస్ 5జీ కనెక్టివిటీని ప్రసారం చేస్తుంది. ఎయిర్‌టెల్ ప్రకారం.. వినియోగదారులు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఎయిర్‌ఫైబర్‌తో 1,000 చదరపు అడుగుల వై-ఫై కవరేజీని పొందవచ్చు.

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఎయిర్‌ఫైబర్ ప్లాన్లు ఇవే :
ఎయిర్‌టెల్ అందించే ఎక్స్‌స్ట్రీమ్ ఎయిర్‌ఫైబర్ ప్లాన్‌ల గురించి వివరంగా పరిశీలిద్దాం..

ఎయిర్‌ఫైబర్ రూ. 699 ప్లాన్ :
ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఎయిర్‌ఫైబర్ ప్లాన్ కంపెనీ అత్యంత సరసమైన ఎయిర్‌ఫైబర్ ప్లాన్. ఈ ప్యాక్ 40ఎంబీపీఎస్ వై-ఫై స్పీడ్‌తో వస్తుంది. ఈ ప్లాన్‌తో ఫ్రీ 4కె ఆండ్రాయిడ్ బాక్స్, 350+ హెచ్‌డీ, ఎస్‌డీ టీవీ ఛానెల్‌లను పొందుతారు. ఈ ప్లాన్ డిస్నీ+ హాట్ స్టార్, సోనీలైవ్, లయన్ గేట్ ప్లే, సన్ ఎన్ఎక్స్‌టీ, ఆహా, ఎరోస్ నౌ, షేమారో మరిన్నింటితో సహా 22+ ఓటీటీ యాప్‌లకు ఉచిత యాక్సెస్‌ను కూడా అందిస్తుంది. అంతేకాకుండా, మీరు ఈ ప్లాన్‌తో ఫ్రీ వై-ఫై రూటర్, ఉచిత ఇన్‌స్టాలేషన్‌ను కూడా పొందవచ్చు.

ఎయిర్‌ఫైబర్ రూ. 799 ప్లాన్ :
ఈ జాబితాలో మరో ఎయిర్‌ఫైబర్ ప్లాన్. డేటా స్పీడ్ కోరుకునే యూజర్ల కోసం అందిస్తోంది. ఎయిర్‌ఫైబర్ ప్లాన్ 1టీబీ ఎఫ్‌యూపీ పరిమితితో 100ఎమ్‌బీపీఎస్ వై-ఫై స్పీడ్‌తో వస్తుంది. లిమిట్ ముగిసిన తర్వాత 2ఎమ్‌బీపీఎస్ లో స్పీడ్ ఇంటర్నెట్‌ని పొందవచ్చు.

ఎక్స్‌స్ట్రీమ్ ఎయిర్‌ఫైబర్ రూ. 899 ప్లాన్ :
ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఎయిర్‌ఫైబర్ ప్లాన్ ద్వారా 100ఎంబీపీఎస్ వై-ఫై స్పీడ్‌తో వస్తుంది. రూ. 699 ప్లాన్ మాదిరిగానే డిస్నీ+ హాట్ స్టార్, సోనీలైవ్, లయన్ గేట్ ప్లే, సన్ ఎన్ఎక్స్‌టీ, ఆహా, ఎరోస్ నౌ, షేమారో మరిన్ని వంటి 22+ ఓటీటీ సభ్యత్వాలను పొందవచ్చు. ఈ ప్లాన్‌లో 350+ హెచ్‌డీ, ఎస్‌‌డీ ఛానెల్‌లతో పాటు వ్యూస్ ఎక్స్‌పీరియన్స్ ఫ్రీగా 4కె ఆండ్రాయిడ్ బాక్స్‌ను కూడా కలిగి ఉంది. అంతేకాకుండా, ఈ ప్లాన్‌తో ఫ్రీ వై-ఫై రూటర్, ఫ్రీ ఇన్‌స్టాలేషన్‌ను కూడా పొందవచ్చు.

ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ఎయిర్‌ఫైబర్ ఫీచర్లు :
ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ఎయిర్‌ఫైబర్ అనేక బెనిఫిట్స్, ఫీచర్లను అందిస్తుంది. ఎయిర్‌ఫైబర్ అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ స్పీడ్ 5జీ నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తుంది. కంపెనీ నిపుణులచే ఫ్రీ ఇన్‌స్టాలేషన్‌తో పాటు వై-ఫై 6 ఆధారిత రూటర్‌ను కూడా ఉచితంగా పొందవచ్చు. రూ. 699, రూ. 899 ప్లాన్‌లతో మాత్రమే అందుబాటులో ఉన్నప్పటికీ, 4కె-సపోర్ట్ ఉన్న ఆండ్రాయిడ్ సెట్-టాప్ బాక్స్‌ను కూడా ఫ్రీగా పొందవచ్చు. ప్లాన్‌లతో 350+ హెచ్‌డీ, ఎస్‌డీ టీవీ ఛానెల్‌లతో పాటు 22+ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌లను కూడా పొందవచ్చు.

Read Also : Airtel AI Spam Detection : స్పామ్ కాల్స్, ఫేక్ SMSలకు ఇక చెక్ పడినట్టే.. ఎయిర్‌టెల్ ఏఐ స్పామ్ డిటెక్షన్ సొల్యూషన్‌.. ఇండియా ఫస్ట్ నెట్‌వర్క్..!