Nothing Ear Open Launch : నథింగ్ ఇయర్ ఓపెన్ చూశారా? ఈ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?
Nothing Ear Open Launch : కొత్తగా లాంచ్ అయిన నథింగ్ ఇయర్ ఓపెన్ ఇతర ఆడియో ప్రొడక్టులతో పోల్చినప్పుడు ప్రత్యేకమైన డిజైన్ కలిగి ఉంది. భారత మార్కెట్లో నథింగ్ ఇయర్ ఓపెన్ ఒకే వైట్ కలర్ వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది.

Nothing Ear Open launched in India, price is set at Rs 17,999
Nothing Ear Open Launch : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం నథింగ్ కంపెనీ నుంచి ఇయర్ ఓపెన్ అనే సరికొత్త రియల్ వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లను భారత మార్కెట్లోకి అధికారికంగా ప్రవేశపెట్టింది. ఈ కొత్త టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్‌లు ఓపెన్-ఇయర్ డిజైన్‌తో ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. నథింగ్ బ్రాండ్‌కు ఇది మొదటిదిగా చెప్పవచ్చు. దేశ మార్కెట్లో ఈ నథింగ్ ఇయర్ ఓపెన్ రూ. 17,999 ధరకు విక్రయించనుంది. మునుపటి నథింగ్ ఇయర్, ఇయర్ (1) సాంప్రదాయిక ఇన్-ఇయర్ స్టైల్‌లకు ఈ మోడల్ భిన్నంగా ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Also : Vivo V40e Launch : కొత్త ఫోన్ కావాలా? వివో V40e ఫోన్ చూశారా? ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు..!
కొత్తగా లాంచ్ అయిన నథింగ్ ఇయర్ ఓపెన్ ఇతర ఆడియో ప్రొడక్టులతో పోల్చినప్పుడు ప్రత్యేకమైన డిజైన్ కలిగి ఉంది. భారత మార్కెట్లో నథింగ్ ఇయర్ ఓపెన్ ఒకే వైట్ కలర్ వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది. అయితే, భవిష్యత్తులో బ్రాండ్ అదనపు కలర్ ఆప్షన్లను కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
ఇయర్‌బడ్‌ల ప్రీ-ఆర్డర్‌లు నథింగ్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇతర రిటైలర్‌లలో నథింగ్ ఇయర్ ఓపెన్ డివైజ్ లభ్యతపై కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు. గ్లోబల్ మార్కెట్లలో ఈ నథింగ్ ఇయర్ ఓపెన్ బడ్స్ కంపెనీ ఉత్పత్తిని కొంచెం ఆలస్యంగా అందుబాటులోకి తీసుకురానుంది.
నథింగ్ ఇయర్ ఓపెన్ : ఫీచర్‌లు, స్పెషిఫికేషన్లు :
నథింగ్ ఇయర్ ఓపెన్‌లో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) లేనప్పటికీ, సౌండ్ సీల్ సిస్టమ్, డైరెక్షనల్ స్పీకర్‌లతో వస్తుంది. యూజర్లు ఈజీగా మ్యూజిక్ ఎంజాయ్ చేయగలరని కంపెనీ చెబుతోంది. టైటానియం-కోటెడ్ పాలిథిలిన్ టెరెఫ్తాలేట్ డయాఫ్రాగమ్‌తో 14.2ఎమ్ఎమ్ డైనమిక్ డ్రైవర్ ఆధారితంగా పనిచేస్తుంది.
కొత్త ఇయర్‌బడ్‌లు హైక్వాలిటీ సౌండ్‌తో పాటు పించ్ కంట్రోల్స్, గూగుల్ ఫాస్ట్ పెయిర్, మైక్రోసాఫ్ట్ స్విఫ్ట్ పెయిర్, డ్యూయల్ కనెక్షన్, మెరుగైన కాల్ క్వాలిటీకి ఏఐ క్లియర్ వాయిస్ టెక్నాలజీ వంటి ఇతర ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి. నథింగ్ ఇయర్ ఓపెన్ వాటర్, ధూళి నిరోధకతకు ఐపీ54 రేటింగ్‌తో వస్తుంది. ఇయర్‌బడ్‌లు, ఛార్జింగ్ కేస్ రెండింటినీ కవర్ చేస్తుంది.
బ్యాటరీ లైఫ్ విషయానికి వస్తే..
నథింగ్ ఇయర్ ఓపెన్ డివైజ్ ప్రతి బడ్ 64mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. అయితే, కేస్ 635mAh బ్యాటరీతో వస్తుంది. ఇయర్‌బడ్‌లు సింగిల్ ఛార్జ్‌పై గరిష్టంగా 8 గంటల వినియోగాన్ని అందిస్తాయి. ఛార్జింగ్ కేస్‌తో ఉపయోగించినప్పుడు గరిష్టంగా 30 గంటల వరకు బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. నాన్ నథింగ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల కోసం నథింగ్ ఎక్స్ యాప్ ఫుల్ యాక్టివిటీ, కస్టమైజడ్ ఆప్షన్లతో గూగుల్ ప్లే స్టోర్, ఐఓఎస్ యాప్ స్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది. ఏఏసీ, ఎస్‌బీసీ వంటి బ్లూటూత్ కోడెక్‌లకు కూడా సపోర్టు అందిస్తుంది.