Vivo V40e Launch : కొత్త ఫోన్ కావాలా? వివో V40e ఫోన్ చూశారా? ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు..!

Vivo V40e Launch : వివో V40e ఫోన్ మొత్తం 2 వేరియంట్లలో వస్తుంది. 8జీబీ+128జీబీ మోడల్ ధర రూ.28,999 కాగా, 8జీబీ+256జీబీ వెర్షన్ ధర రూ.30,999కు అందిస్తోంది.

Vivo V40e Launch : కొత్త ఫోన్ కావాలా? వివో V40e ఫోన్ చూశారా? ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు..!

Vivo V40e with MediaTek Dimensity 7300 chipset launched

Updated On : September 25, 2024 / 3:22 PM IST

Vivo V40e Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లోకి చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో నుంచి సరికొత్త V40e సిరీస్‌ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ వివో V40e సిరీస్ మొత్తం రెండు వేరియంట్లలో తీసుకొచ్చింది. 5500mAh బ్యాటరీతో దేశంలోనే అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్‌గా వి40e పవర్‌ఫుల్ కెమెరా సెటప్ కలిగి ఉంది. అద్భుతమైన డిజైన్, అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో వివో అందుబాటులో ఉంది.

ధర, లభ్యత ఎప్పుడంటే? :
వివో V40e ఫోన్ మొత్తం 2 వేరియంట్లలో వస్తుంది. 8జీబీ+128జీబీ మోడల్ ధర రూ.28,999 కాగా, 8జీబీ+256జీబీ వెర్షన్ ధర రూ.30,999కు అందిస్తోంది. ఈ 2 వేరియంట్లు రాయల్ బ్రాంజ్, మింట్ గ్రీన్ అనే 2 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులు ఈరోజు నుంచి ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు.

Read Also : iPhone 16 Discount Offer : ఐఫోన్ 16 సేల్ మొదలైందోచ్.. మీ దగ్గర ఐఫోన్ 13 ఉంటే.. రూ. 26వేలు తగ్గింపు.. డోంట్ మిస్!

అక్టోబర్ 2, 2024 నుంచి వివో అధికారిక ఇ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్ పార్టనర్ రిటైల్ స్టోర్‌లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వినియోగదారులకు 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, ఎక్స్‌టెండెడ్ వారెంటీలతో సహా అనేక ఆఫర్‌ల నుంచి కొనుగోలుదారులు బెనిఫిట్స్ పొందవచ్చు.

వివో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
వివో వి40ఇ ఫోన్ కేవలం 0.749 సెం.మీ మందం కలిగిన బ్యాటరీతో భారత అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్‌గా చెప్పవచ్చు. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.77-అంగుళాల కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ వివో ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 7300 ప్రాసెసర్‌తో వస్తుంది. సున్నితమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. 5500mAh బ్యాటరీ రీఛార్జ్ కోసం 80డబ్ల్యూ ఫ్లాష్‌ఛార్జ్‌కు సపోర్టు ఇస్తుంది. కెమెరా ఫ్రంట్ సైడ్ వి40ఇ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), సోనీ ఐఎమ్ఎక్స్882 సెన్సార్‌తో 50ఎంపీ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది.

తక్కువ కాంతిలో కూడా అద్భుతమైన ఫొటోలను అందిస్తుంది. 116° ఫీల్డ్ వ్యూతో 8ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరా ల్యాండ్‌స్కేప్, గ్రూప్ షాట్‌లను అప్‌గ్రేడ్ అందిస్తుంది. సెల్ఫీ ప్రియుల కోసం ఫోన్ 50ఎంపీ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. వైడ్ యాంగిల్ సామర్థ్యాలతో అద్భుతమైన ఫొటో క్వాలిటీని అందిస్తుంది.

అల్ట్రా-స్టేబుల్ వీడియో, డెడికేటెడ్ వ్లాగ్ మూవీ క్రియేటర్ మోడ్ వంటి అదనపు ఫీచర్లతో ఫోన్ ఫ్రంట్, బ్యాక్ కెమెరాలలో 4కె వీడియో రికార్డింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. వివో ఫొటో క్వాలిటీని మెరుగుపరచడానికి ఏఐ పోర్ట్రెయిట్ సూట్, ఏఐ ఫొటో ఎన్‌హాన్సర్ వంటి వివిధ ఏఐ ఫీచర్లను చేర్చింది.

ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఫన్‌టచ్ ఓఎస్ 14పై రన్ అవుతుంది. వి40ఇ సున్నితమైన యూజర్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. దుమ్ము, నీటి నిరోధకతకు ఐపీ64 రేటింగ్‌తో వస్తుంది. వివో దీర్ఘకాలిక సపోర్టుకు 3ఏళ్ల ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, 4 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లను కూడా అందిస్తుంది.

Read Also : iPhone 15 Pro Sale : కొత్త ఐఫోన్ కొంటున్నారా? ఐఫోన్ 15ప్రోపై ఏకంగా రూ.20వేలు డిస్కౌంట్.. ఈ డీల్ ఎలా పొందాలంటే?