Donald Trump : నా హత్యకు ఇరాన్‌ కుట్ర చేస్తోంది.. యూఎస్ ఇంటెలిజెన్స్ హెచ్చరికలపై ట్రంప్ కామెంట్స్..!

Donald Trump : డొనాల్డ్‌ ట్రంప్‌‌పై గతంలోనూ అనేకసార్లు దాడులు జరిగాయి. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ట్రంప్‌కు ఇరాన్‌ నుంచి ముప్పు పొంచి ఉందని అమెరికా ఇంటెలిజెన్స్‌ అధికారులు హెచ్చరించారు.

Donald Trump : నా హత్యకు ఇరాన్‌ కుట్ర చేస్తోంది.. యూఎస్ ఇంటెలిజెన్స్ హెచ్చరికలపై ట్రంప్ కామెంట్స్..!

US intelligence warns him of assassination threat

Updated On : September 25, 2024 / 7:47 PM IST

Donald Trump : అగ్రరాజ్యం అమెరికాలో వచ్చే నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. షెడ్యూల్ ప్రకారం.. నవంబర్ 5న జరుగనున్న ఈ అధ్యక్ష ఎన్నికల బరిలో డెమోక్రటిక్ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలాహారిస్‌, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తలపడుతున్నారు. ఈ నేపథ్యంలో అధ్యక్ష రేసులోని అభ్యర్థులపై వరుస దాడులు ఆందోళనను రేకిత్తిస్తున్నాయి.

ముఖ్యంగా డొనాల్డ్‌ ట్రంప్‌‌పై పలుమార్లు దాడులు జరిగాయి. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ట్రంప్‌కు ఇరాన్‌ నుంచి ముప్పు పొంచి ఉందని అమెరికా ఇంటెలిజెన్స్‌ అధికారులు హెచ్చరించారు. ఈ మేరకు ట్రంప్‌ ప్రచార బృందం ఒక ప్రకటనలో పేర్కొంది.

Read Also : Airtel AI Spam Detection : స్పామ్ కాల్స్, ఫేక్ SMSలకు ఇక చెక్ పడినట్టే.. ఎయిర్‌టెల్ ఏఐ స్పామ్ డిటెక్షన్ సొల్యూషన్‌.. ఇండియా ఫస్ట్ నెట్‌వర్క్..!

మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హతమార్చడానికి ఇరాన్ కుట్ర పన్నుతోందని వివరించినట్లు ఆయన అధ్యక్ష ఎన్నికల ప్రచారం తెలిపింది. అమెరికాలో అస్థిరత “గందరగోళాన్ని సృష్టించడానికి ఇరాన్ ప్రయత్నిస్తోంది. మాజీ అధ్యక్షుడికి ఇరాన్‌తో ముప్పు పొంచి ఉందని నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ కార్యాలయం ముందుగానే హెచ్చరించిందని ట్రంప్ ప్రచార కమ్యూనికేషన్ డైరెక్టర్ స్టీవెన్ చియుంగ్ తెలిపారు. గత కొన్నాళ్లుగా ట్రంప్‌ను హతమార్చడమే లక్ష్యంగా ఇరాన్ బెదిరింపులకు పాల్పడుతోందని పేర్కొన్నారు.

ట్రంప్‌నకు రక్షణ కల్పించడంతో పాటు త్వరలో జరుగబోయే అధ్యక్ష ఎన్నికలపై ఎలాంటి ప్రభావం పడకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారని చియుంగ్ వెల్లడించారు. అమెరికాలో దాడులు ఇటీవలి నెలల్లో భారీగా పెరిగినట్లు గుర్తించారని చియుంగ్ తెలిపారు. అన్ని ఏజెన్సీలలోని అధికారులు ట్రంప్‌కు రక్షణ కల్పించడానికి రాబోయే ఎన్నికలలో జోక్యం లేకుండా ఉండేలా కృషి చేస్తున్నారన్నారు.

నా హత్యకు ఇరాన్ కుట్ర : ట్రంప్
అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీల హెచ్చరికలపై ట్రంప్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘నా హత్యకు ఇరాన్ కుట్ర పన్నుతోంది. ఇప్పటికే అనేక సార్లు హతమార్చేందుకు ప్రయత్నించింది. అయినా అవి ఫలించలేదు. ఎన్నికల వేళ మళ్లీ నాపై హత్య చేసేందుకు పన్నాగాలను పన్నుతోంది. నాకు రక్షణ కల్పించేందుకు సీక్రెట్ సర్వీస్‌కు ఏకగ్రీవంగా నిధులను కేటాయించినందుకు కాంగ్రెస్‌కు ధన్యవాదాలు. రిపబ్లికన్‌లు, డెమొక్రాట్‌లు ఏకతాటిపైకి రావడం చాలా ఆనందంగా ఉంది. ఒక మాజీ అధ్యక్షుడిపై హత్యాయత్నం అంటే.. దాడి చేసిన నిందితుడికి మరణమే” అని ట్రంప్ పేర్కొన్నారు.

గతంలోనూ ట్రంప్‌పై హత్యాయత్నాలు :
గతంలో రిపబ్లికన్‌ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్‌పై రెండు సార్లు హత్యాయత్నాలు జరిగాయి. జులై 12న, పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో జరిగిన ర్యాలీలో ట్రంప్‌పై మొదటి హత్యాయత్నం జరిగింది. ఆ సమయంలో ట్రంప్ చెవిపైభాగం నుంచి బుల్లెట్ దూసుకుపోయింది.

రెండో హత్యాయత్నం సెప్టెంబర్ 15న ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లోని ట్రంప్ ఇంటర్నేషనల్ గోల్ఫ్ క్లబ్‌లో జరిగింది. అమెరికా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నట్లు అమెరికా చేసిన ఆరోపణలను ఇరాన్ గతంలోనే ఖండించింది. అయితే, ట్రంప్‌పై హత్యాయత్నం నివేదికలపై న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితికి ఇరాన్ శాశ్వత మిషన్, ఓడీఎన్ఐ అభ్యర్థనలకు స్పందించలేదు.

Read Also : Donald Trump: అమెరికాలో ఎన్నికల వేళ.. డొనాల్డ్ ట్రంప్ పై మరోసారి కాల్పుల కలకలం.. ఎలాన్ మస్క్ ఏమన్నాడంటే..?