Instagram Edits App : ఆండ్రాయిడ్ యూజర్లకు పండగే.. ఇన్‌స్టాగ్రామ్‌ ‘ఎడిట్స్’ స్పెషల్ యాప్.. హైక్వాలిటీ వీడియోలు ఇలా క్రియేట్ చేయొచ్చు..!

Instagram Edit Feature : ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ఇన్‌స్టాగ్రామ్ ఎడిట్ అనే స్పెషల్ యాప్ తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా హైక్వాలిటీ వీడియోలను ఈజీగా క్రియేట్ చేయొచ్చు.

Instagram Edits Feature

Instagram Edit App: ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్.. మెటా సొంత యాప్ ఇన్‌స్టాగ్రామ్ ఎట్టకేలకు వీడియో ఎడిటింగ్ యాప్, ఎడిట్స్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఏడాది ప్రారంభంలో iOS యూజర్ల కోసం అందుబాటులోకి వచ్చింది.

ఈ యాప్ ఇప్పుడు యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ రెండింటిలోనూ ఫ్రీగా డౌన్‌లోడ్ చేసేందుకు అందుబాటులో ఉంది. ఎడిట్స్ యాప్ వీడియో క్రియేషన్ చాలా ఈజీగా ఉంటుంది. ముఖ్యంగా ఇన్‌స్టా యూజర్లు తమ ఆలోచనలకు తగినట్టుగా వీడియోలను క్రియేట్ చేసుకోవచ్చు.

Read Also : Realme P3 Series : అతి చౌకైన ధరకే రియల్‌మి P3 సిరీస్.. ఈ కొత్త 5G ఫోన్లపై కళ్లుచెదిరే డిస్కౌంట్.. కొంటే ఇప్పుడే కొనేసుకోండి!

కంటెంట్ క్రియేటర్లు ఇతర యాప్స్ పై ఆధారపడాల్సిన అవసరం లేకుండా అన్ని ఒకేచోట అందించేలా ఇన్‌స్టాగ్రామ్ ఈ ఎడిటింగ్ యాప్ తీసుకొచ్చింది. ” ప్రస్తుత రోజుల్లో వీడియోలను క్రియేట్ చేయడం చాలా క్లిష్టమైన ప్రక్రియ.

అనేక యాప్‌లు, వర్క్‌ఫ్లో అవసరం అవుతాయి. ఎడిట్‌లతో మీరు ఇప్పుడు వీడియో క్రియేషన్ కోసం పవర్‌ఫుల్ టూల్స్ అందుబాటులో ఉన్నాయి” అని ఇన్‌స్టాగ్రామ్ బ్లాగ్‌పోస్ట్‌లో తెలిపింది. ఎడిట్స్ యాప్ ఫీచర్ గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఇన్‌స్టాగ్రామ్ ఎడిట్ యాప్ ఏంటి? :
ఎడిట్స్ అనేది మీ ఫోన్ నుంచి నేరుగా హై క్వాలిటీ వీడియోలను క్రియేట్ చేసేందుకు సాయపడే ఒక స్పెషల్ యాప్. యాప్ నుంచి నిష్క్రమించాల్సిన అవసరం లేకుండా మొత్తం వీడియో క్రియేషన్ ప్రక్రియను పూర్తి చేయొచ్చు.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఎడిట్ చేయడం ఎలా? :
వీడియోల కోసం అవసరమైనవన్నీ ఒకే యాప్‌లో ఉంటాయి. మీ ఐడియాస్ కూడా సేవ్ చేయవచ్చు. మీ ప్రాజెక్ట్‌లను మేనేజ్ చేయొచ్చు. వీడియోలను ఎడిట్ చేయొచ్చు. అన్నీ యాప్‌లను మారకుండానే వాటర్‌మార్క్‌లు లేకుండా వాటిని ఈజీగా ఎక్స్‌పోర్ట్ చేయవచ్చు.

క్వాలిటీ గల కెమెరా, ఫ్రేమ్-కచ్చితమైన టైమ్‌లైన్, కటౌట్‌, ఏఐ యానిమేషన్ల వంటి టూల్స్ ఉపయోగించి మెరుగైన వీడియోలను క్రియేట్ చేయొచ్చు. ట్రెండింగ్ సౌండ్‌తో కూడిన పాపుల్ రీల్స్ ఫీడ్ నుంచి ఐడియాస్ పొందండి. మీ కంటెంట్‌ను ఎలా అప్‌గ్రేడ్ చేయాలో తెలుసుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్లలో చాలా మందికి ముందస్తుగా ఎడిట్‌ ఫీచర్ యాక్సెస్ ఉంది. ఈ యాప్‌ను అప్‌గ్రేడ్ చేయడంలో ఫీడ్ బ్యాక్ కూడా అందించారు.

రాబోయే ఎడిటింగ్ ఫీచర్లు ఇవే :

  • ఇన్‌స్టాగ్రామ్ ఇప్పటికే ఎడిట్స్‌కు కొత్త ఫీచర్లను టెస్టింగ్ చేస్తోంది.
  • మీ క్లిప్‌ లొకేషన్, రొటేషన్, స్కేల్‌ను యానిమేట్ చేసేందుకు కచ్చితమైన మూవెంట్స్ కోసం కీఫ్రేమ్‌లు.
  • మోడిఫై, వీడియోలను త్వరగా మార్చే ఏఐ ఆధారిత టూల్
  • క్రియేటర్లు, స్నేహితులు లేదా బ్రాండ్‌లతో డ్రాఫ్ట్‌లను షేర్ చేసే కొలబరేషన్ టూల్స్
  • అదనపు ఫాంట్స్, ట్రాన్సిసన్స్, వాయిస్ ఎఫెక్ట్స్, రాయల్టీ ఫ్రీ మ్యూజిక్ వంటి మరిన్ని క్రియేటివిటీ ఆప్షన్లు

Read Also : Jio Fiber Plans : జియోఫైబర్ చీపెస్ట్ ప్లాన్లు భలే ఉన్నాయి.. 3 నెలలు 100Mbps హై-స్పీడ్ డేటా, OTT, టీవీ ఛానల్స్ అన్నీ ఫ్రీ..!

ఎడిట్ డౌన్‌లోడ్ చేసి ఎలా వాడాలంటే? :
ఈ ఫీచర్ చాలా సులభం. గూగుల్ పే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి (Edits by Instagram)ని డౌన్‌లోడ్ చేసుకోండి. ఆపై మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉపయోగించి సైన్ ఇన్ చేయండి. అంతే..