Jio Fiber Plans : జియోఫైబర్ చీపెస్ట్ ప్లాన్లు భలే ఉన్నాయి.. 3 నెలలు 100Mbps హై-స్పీడ్ డేటా, OTT, టీవీ ఛానల్స్ అన్నీ ఫ్రీ..!
Jio Fiber Plans : ఈ జియోఫైబర్ ప్లాన్లు 3 నెలలకు 100Mbps వరకు స్పీడ్ డేటాను పొందుతారు. అన్‌లిమిటెడ్ డేటా, OTT యాప్‌లకు యాక్సెస్ పొందవచ్చు.

Jio Fiber Plans
Jio Fiber Plans : జియోఫైబర్ యూజర్లకు గుడ్ న్యూస్.. జియోఫైబర్ అందించే ప్లాన్లతో 3 నెలల పాటు 100Mbps వరకు స్పీడ్ పొందవచ్చు. OTT, టీవీ ఛానెల్స్ ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు.. కాల్స్ కూడా ఫ్రీగా చేయొచ్చు. సరసమైన ధరలో లాంగ్ వ్యాలిడిటీతో హై-స్పీడ్ ఇంటర్నెట్ ప్లాన్ కోసం చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే..
జియో ఫైబర్ త్రైమాసిక పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను అందిస్తోంది. 3 నెలల పాటు కొనసాగే ఈ ప్లాన్‌లలో మీరు 100Mbps వరకు స్పీడ్ పొందవచ్చు. అన్‌లిమిటెడ్ డేటా, OTT యాప్‌లకు కూడా యాక్సెస్ పొందవచ్చు. ఇంతకీ జియోఫైబర్ అందించే ఈ ప్లాన్ల గురించి ఓసారి వివరంగా తెలుసుకుందాం.
రూ.599 ప్లాన్ :
ఈ ప్లాన్‌ను రూ. 1797 చెల్లించి 3 నెలల పాటు యాక్సస్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌లో కంపెనీ 30Mbps స్పీడ్‌తో పాటు అన్‌లిమిటెడ్ డేటాను అందిస్తోంది. టీవీ ఛానెల్స్, OTT కూడా ఈ ప్లాన్‌లో అందిస్తోంది. కంపెనీ ఫ్రీ వాయిస్ కాలింగ్‌తో పాటు 800కి పైగా టీవీ ఛానెల్‌లను యాక్సెస్ చేస్తోంది. దాంతో పాటు, మీరు 11 OTT యాప్‌లను కూడా యాక్సెస్ పొందవచ్చు.
రూ.888 ప్లాన్ :
మీరు ఈ జియో ఫైబర్ ప్లాన్‌ను 3 నెలల పాటు రూ.2664కి సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. మీకు అన్‌లిమిటెడ్ డేటా, 30Mbps స్పీడ్ పొందవచ్చు. టీవీ ఛానెల్స్, ఓటీటీ కూడా ఈ ప్లాన్ 800కి పైగా టీవీ ఛానెల్స్, జియో హాట్‌స్టార్‌తో సహా 14 OTT యాప్‌లకు ఫ్రీ యాక్సెస్‌తో వస్తుంది. ఈ ప్లాన్‌లో కంపెనీ ఫ్రీ కాలింగ్ కూడా అందిస్తోంది.
రూ.899 ప్లాన్ :
రూ. 2697కు ఈ ప్లాన్‌ను 3 నెలల పాటు సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ 100Mbps ఇంటర్నెట్ వేగంతో వస్తుంది. ఇందులో మీకు ఫ్రీ కాలింగ్ కూడా లభిస్తుంది.
టీవీ ఛానెల్స్, OTT ఫ్రీ :
జియో ఫైబర్ ఈ ప్లాన్‌లో 800కి పైగా టీవీ ఛానెళ్లను ఫ్రీగా యాక్సెస్ చేయొచ్చు. దాంతోపాటు, 11 OTT యాప్‌లను కూడా యాక్సెస్ చేయొచ్చు. ఈ ప్లాన్‌ల 3 నెలల సబ్‌స్క్రిప్షన్‌తో GST కూడా చెల్లించాల్సి ఉంటుంది.