Electric Scooter : రూ. 40 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్లు

పెట్రోల్ ధరలు పెరుగుతుండటంతో చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. వినియోగదారుల ఆసక్తికి తగినట్లుగా కంపెనీలు మార్కెట్లోకి తమ వాహనాలను విడుదల చేస్తున్నాయి.

Electric Scooter : పెట్రోల్ ధరలు ఆకాశమే హద్దుగా పరుగులు పెడుతున్నాయి. దేశంలోని 14 రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర సెంచరీ దాటింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ రూ.115 పైనే ఉంది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరుగుతుండటంతో దేశీయంగా ఇంధన ధరల్లో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

ఇక ఓ వైపు ఇంధన ధరల పెరుగుదల మరోవైపు పొల్యూయేషన్‌తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టిపెట్టారు. ఆగస్టు నెల ప్రారంభం నుంచి దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. నానాటికి ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ పెరుగుతుండటంతో ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేసేందుకు కొత్త కంపెనీలు ముందుకు వస్తున్నాయి.

చదవండి : Electric Car : ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 750 కి.మీ ప్రయాణం

తాజాగా ఓకాయా పవర్‌ గ్రూప్‌ ఎలక్ట్రిక్‌ టూ వీలర్‌ కూడా వ్యాపార రంగంలోకి అడుగు పెట్టింది. తక్కువ ధరకే ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను అందిస్తోంది. కేవలం 39,999 రూపాలయ ధరతో ఓకాయ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ మార్కెట్లో విడుదలైంది. ఈ స్కూటర్‌కు ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే దాదాపు 80 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.

చదవండి : Electric Scooter : బాబోయ్.. ఎలక్ట్రిక్ స్కూటర్‌లో మంటలు.. చూస్తుండగానే తగలబడిపోయింది

ఓకాయా కంపెనీ దేశంలోని 18 రాష్ట్రాల్లో ఇప్పటికే 165 మంది డీలర్లను నియమించుకుంది. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌లో  వాహనాలు తయారు చేస్తున్నారు.. హర్యానాలోను, రాజస్థాన్‌లోని నీమ్రానాలో మరో మూడు ప్లాంట్లను 2023-25 నాటికి ప్రారంభించనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ స్కూటర్‌ను అత్యాధునిక టెక్నాలజీతో అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు పేర్కొంది.

చదవండి : Electric Cars: స్మూత్‌గా నడుస్తున్న ఎలక్ట్రిక్ కార్లు.. భారీగా పెరిగిన డిమాండ్.. రూ.15లక్షల్లోపు బడ్జెట్‌లో!

దసరా పండుగ రోజు ఈ స్కూటర్ ను లాంచ్ చేశారు. కస్టమర్ల నుంచి మంచి స్పందన వస్తున్నట్లుగా తెలిపారు కంపెనీ ప్రతినిధులు. భారతదేశంతో పాటు విదేశాల్లో కూడా ప్రత్యేకంగా రెండు అత్యాధునిక ఆర్ అండ్ డి సెంటర్లు నెలకొల్పనున్నట్లు సంస్థ తెలిపింది. కాగా ఈ కంపెనీ గత 40ఏళ్లుగా దేశంలో బ్యాటరీలను తయారు చేస్తుంది.

ట్రెండింగ్ వార్తలు