Elon Musk : ట్విట్టర్‌లో ఎడిట్ బటన్ పోల్.. ఎలన్‌ మస్క్‌‌పై ట్విట్టర్‌​​​ సీఈవో కామెంట్..!

Elon Musk : ప్రపంచ కుబేరుడు ఎలన్‌ మస్క్‌ వ్యాఖ్యలపై ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్ కామెంట్ చేశారు. మస్క్‌ అడిగిన పోల్ వేసేటప్పుడు జాగ్రత్తగా వేయాలన్నారు.

Elon Musk : ప్రపంచ కుబేరుడు ఎలన్‌ మస్క్‌ వ్యాఖ్యలపై ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్ కామెంట్ చేశారు. మస్క్‌ అడిగిన పోల్ వేసేటప్పుడు జాగ్రత్తగా వేయాలన్నారు. ఎలన్ మస్క్ ట్విట్టర్ యూజర్ల కోసం ఒక పోల్ పెట్టారు. అందులో ట్విట్టర్ ఎడిట్ బటన్ ఎంతమందికి కావాలో తెలియజేయాలని కోరారు. అయితే ఆ పోల్ పై స్పందించిన ట్విట్టర్ యూజర్లు చాలామంది ట్విట్టర్ ఎడిట్ బటన్ ఉండాలని అన్నారు. మరికొందరు ఎడిట్ బటన్ వస్తే ట్వీట్‌పై ఆసక్తి పోతుందన్నారు.

తాజాగా ఎలన్ మస్క్ ట్విట్టర్ పోల్‌పై సీఈఓ అగర్వాల్ స్పందించారు. మస్క్‌తో వ్యవహరించేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు పరాగ్‌ అగర్వాల్. మస్క్‌ నిర్వహించే పోల్‌.. వచ్చే పరిణామాలు ఎంతో ప్రధానమైనవి అన్నారు. ట్విట్టర్ యూజర్లు చాలా జాగ్రత్తగా పోల్‌ ఓటు వేయాలని పరాగ్‌ అగ్రావాల్‌ తెలిపారు. ఎలన్‌ మస్క్‌ పోల్‌ ట్వీట్‌ని రీట్వీట్‌ చేస్తూ సీఈఓ అగర్వాల్ కామెంట్‌ చేశారు. మరో విషయం ఏమిటంటే.. ఎలన్‌ మస్క్‌.. ట్విట్టర్‌లో మేజర్‌ షేర్‌ హోల్డర్‌.. మస్క్ ట్విట్టర్‌లో 9.2 శాతం వాటాలు దక్కించుకున్నారు. 2022 మార్చి 24న నిర్వహించిన పోల్‌లో ఫ్రీ స్పీచ్‌ స్ఫూర్తికి ట్విట్టర్‌ కట్టుబడి ఉందా అని ఎలన్‌ మస్క్‌ ప్రశ్నించారు.

ట్విట్టర్‌ లాంటి మరో ప్లాట్‌ఫామ్‌ అవసరమా అని నెటిజన్లను ప్రశ్నించాడు. కొన్ని వారాల వ్యవధిలోనే మస్క్ నిర్వహించిన ఈ రెండు పోల్స్ నిర్వహించాడు. ఆ తర్వాత ఉన్నట్టుండి ట్విట్టర్‌లో మేజర్‌ షేర్‌ హోల్డర్‌గా మారిపోయాడు మస్క్.. ఎలన్‌ మస్క్‌ సరదా కామెంట్స్‌ ఏదో ఒకటి వ్యూహాత్మక ఆలోచన ఉండే ఉంటుందని అంటుంటారు. అందుకే ట్విట్టర్‌లో ఎడిట్‌ ఫీచర్‌పై ఎలన్‌ మస్క్‌ పోల్‌ పెట్టారు. దీనిపై స్పందించిన ట్విట్టర్ సీఈఓ.. ఆ ఓటు వేసే ముందు జాగ్రత్తగా ఆలోచించి వేయాలని యూజర్లను కోరారు. ప్రస్తుతం ట్విట్టర్ ఎడిట్‌ బటన్‌పై వర్క్‌ నడుస్తోందని తెలిపింది.

Read Also : Elon Musk: ట్విట్టర్ ఖాతా తొలగించమంటూ యువకుడికి ఎలన్ మస్క్ బంపర్ ఆఫర్

ట్రెండింగ్ వార్తలు