Elon Musk: ట్విట్టర్ ఖాతా తొలగించమంటూ యువకుడికి ఎలన్ మస్క్ బంపర్ ఆఫర్
ట్విట్టర్ ఖాతా తొలగించమంటూ ఓ యువకుడికి ఆసాధారణ విజ్ఞప్తి చేశాడు మస్క్. అమెరికాకు చెందిన స్వీనీ అనే 19 ఏళ్ల యువకుడు మస్క్ విమాన ప్రయాణ వివరాలను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తున్నాడు

Elon Musk: టెక్ పండితుడు, ప్రపంచ అపరకుభేరుడు ఎలన్ మస్క్ ఏం చేసినా సంచలనమే. మస్క్ చేసే ఒక్క ట్వీట్.. ఎవరి జీవితాన్నైనా మార్చేయగలదు. అటువంటిది ట్విట్టర్ ఖాతా తొలగించమంటూ ఓ యువకుడికి ఆసాధారణ విజ్ఞప్తి చేశాడు మస్క్. వివరాల్లోకివెళితే.. ప్రపంచంలోనే అత్యంత ధనవంతులలో ఒకరైన ఎలన్ మస్క్.. తన వ్యాపార పనుల నిమిత్తం వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు సొంత విమానాలు ఉపయోగిస్తుంటాడు. అయితే తన సెక్యూరిటీ దృష్ట్యా ఆ విమాన ప్రయాణ తాలూకు వివరాలు గోప్యంగా ఉంచుతాడు. ఈనేపధ్యంలో మస్క్ తన విమానంలో ఏరోజు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఏ సమయానికి చేరుకుంటున్నారు వంటి సంగతులన్నీ మీడియా వారికి చేరిపోతున్నాయి. దీంతో వారు ముందుగానే అక్కడికి చేరుకుని ఆయన్ను ఇబ్బంది పెడుతున్నారు.
Also read: Arunachal Youth: తల్లిదండ్రుల చెంతకు చేరిన అరుణాచల్ యువకుడు “మిరమ్ తరోన్”
ఇక విషయమై మస్క్ కార్యాలయం ఆరా తీయగా.. అమెరికాకు చెందిన స్వీనీ అనే 19 ఏళ్ల యువకుడు మస్క్ విమాన ప్రయాణ వివరాలను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తున్నట్టు గుర్తించారు. మస్క్ ప్రయాణ వివరాల కోసమే ఆ ట్విట్టర్ ఖాతా తెరిచాడు ఆ యువకుడు. దీంతో ఆ ట్విట్టర్ ఖాతాను తొలగించాలంటూ మస్క్ స్వయంగా స్వీనీకి విజ్ఞప్తి చేశాడట. దీనిపై యువకుడు స్వీనీ స్పందిస్తూ.. “తొలగిస్తాను, కానీ అందుకు కొంత ఖర్చు అవుతుంది. కనీసం ఒక టెస్లా మోడల్ 3 కారు ఇవ్వాలి” అంటూ సరదాగా కోరాడు. దీనిపై మస్క్ స్పందిస్తూ.. “ఒక తుంటరి చేతిలో బలైపోవడం నాకు నచ్చలేదు, కానీ మీ ప్రతిభకు ఒక 5 వేల డాలర్లు (రూ.3,76,087) ఇవ్వగలను అంటూ సమాధానం ఇచ్చాడట. దీనిపై స్వీనీ స్పందిస్తూ.. 5 వేలు కాదుగానీ.. ఒక 50 వేల డాలర్లు ఇవ్వగలరా? నాకు చాలా అవసరం ఉంది. మంచి కాలజీకి వెళ్లి చదువుకోవాలి, అలాగే కారు కూడా కొనుక్కోవాలని ఉంది” అంటూ సమాధానం పంపాడట. దీనిపై మస్క్ స్పందిస్తూ.. “ఆలోచిస్తానని” సమాధానం ఇచ్చాడట.
Also read: TATA Air India : నేటి నుంచి టాటా ఎయిరిండియా సర్వీసులు
కొన్ని రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన తాలూకు వివరాలను మస్క్ కార్యాలయ ప్రతినిధి ఒకరు ఇటీవల బయటకు వెల్లడించారు. అయితే మస్క్ ఇంకా స్వీనీకి ఆ డబ్బు ఇచ్చాడా? లేదా? అనే విషయం తెలియరాలేదు గానీ.. విమాన వివరాలు తాలూకు ట్విట్టర్ ఖాతా అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది.
Landed near Lanai City, Hawaii, US. Apx. flt. time 7 Hours : 4 Mins. pic.twitter.com/2aTVxgOci3
— Elon Musk’s Jet (@ElonJet) January 23, 2022
- Viral News: వరుడు కావాలంటూ ప్లకార్డుతో రోడ్డెక్కిన యువతి
- Twitter Deal : ట్విట్టర్ డీల్ తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన ఎలాన్ మస్క్
- Twitter: ఎలాన్ మస్క్ టేకోవర్‌కు ముందు.. ట్విటర్ నుంచి ఇద్దరు ఔట్..
- Elon Musk: తాజ్‌మహల్‌ను గుర్తుచేసుకున్న ఎలాన్ మస్క్.. ఇండియా టూర్ ఖరారైందా?
- Dead Snake in Parotta: పరోఠాలో పాము చర్మం: కేరళలో హోటల్ సీజ్ చేసిన అధికారులు
1Viral video: నా స్టైలే వేరు.. వెరైటీగా పెళ్లి మండపానికి పెళ్లి కూతురు.. వరుడు బంధువులు ఏం చేశారంటే..
2Minister Arvind Raiyani : ఇనుప గొలుసులతో కొట్టుకున్న గుజరాత్ మంత్రి..కరెన్సీ నోట్లు చల్లిన అభిమానులు
3Fire Broke Out : గ్రీన్ బావర్చి హోటల్ లో అగ్నిప్రమాదం..బిల్డింగ్ లో చిక్కుకున్న 20 మంది!
4Balakrishna: ఒక్క తప్పిదం కారణంగా రాష్ట్రంలో అందరూ అనుభవిస్తున్నారు.. ఈసారి మాత్రం..
5Texas School Shooter : అందుకు కారణాలున్నాయి.. నా కుమారుడుని క్షమించండి.. టెక్సాస్ షూటర్ తల్లి ఆవేదన!
6Yasin Malik: ఉగ్రవాదాన్ని సమర్థిస్తున్నట్లు ఓఐసీ వ్యాఖ్యలు: భారత్
7US : ‘మీ భర్తను చంపడం ఎలా?’అనే..ఆర్టికల్ రాసి తన భర్తనే చంపేసిన రచయిత్రి..
8Union Home Ministry : డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్‌కు క్లీన్చిట్..సమీర్ వాంఖడేపై చర్యలకు కేంద్రం ఆదేశాలు
9Elon musk: ఇండియాలో టెస్లా కార్ల తయారీ కేంద్రం అసాధ్యమేనా? స్పష్టత ఇచ్చిన ఎలన్ మస్క్
10Southwest Monsoon : కేరళ వైపు పయనిస్తున్న నైరుతి రుతుపవనాలు
-
Cyber Criminals : లోన్ ఇప్పిస్తామని రూ.40,000 కాజేసిన సైబర్ నేరగాళ్లు
-
Jalli Keerthi : ఐఏఎస్ సేవకు అందరూ ఫిదా..వరదల్లో సర్వం కోల్పోయినవారికి అండగా తెలంగాణ ఆడబిడ్డ
-
TRS : ఎన్టీఆర్‌కు ఘనంగా టీఆర్ఎస్ నివాళి..!
-
Unscrupulous activities : ఆంధ్రాయూనివర్శిటీలో అసాంఘీక కార్యకలాపాలు
-
Terrorists Encounter : టీవీ నటిని హత్య చేసిన ఉగ్రవాదుల హతం..హత్య జరిగిన 24 గంటల్లోనే ఎన్కౌంటర్
-
Adilabad : వేరే మతస్తుడిని పెళ్లి చేసుకుందని కూతురు గొంతు కోసి చంపిన తండ్రి
-
IPL 2022: ఆర్సీబీ కల చెదిరే.. 15 ఏళ్లుగా టైటిల్ పోరాటం.. ఈ పెయిన్ కోహ్లీకి మాత్రమే తెలుసు!
-
Minister KTR : మంత్రి కేటీఆర్ యూకే, దావోస్ పర్యటన..తెలగాంణకు రూ.4,200 కోట్ల పెట్టుబడులు