Arunachal Youth: తల్లిదండ్రుల చెంతకు చేరిన అరుణాచల్ యువకుడు “మిరమ్ తరోన్”

భారత్ లోని అరుణాచల్ నుంచి చైనా సరిహద్దు వద్ద దారి తప్పిన యువకుడు "మిరమ్ తరోన్" క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేరుకున్నాడు.

Arunachal Youth: తల్లిదండ్రుల చెంతకు చేరిన అరుణాచల్ యువకుడు “మిరమ్ తరోన్”

Taron

Arunachal Youth: భారత్ లోని అరుణాచల్ నుంచి చైనా సరిహద్దు వద్ద దారి తప్పిన యువకుడు “మిరమ్ తరోన్” క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేరుకున్నాడు. వారం కిందట భారత్ సరిహద్దు వద్ద.. యువకుడిని చైనా సైన్యం అపహరించినట్లు వచ్చిన వార్తలపై చైనా స్పందిస్తూ.. తాము ఎవరిని అపహరించలేదని స్పష్టం చేసింది. యువకుడు మిరమ్ తరోన్ ను గుర్తించిన చైనా బలగాలు అతను దారి తప్పివచ్చినట్లు నిర్ధారించారు. అనంతరం జనవరి 26న భారత్ చైనా అధికారుల మధ్య జరిగిన చర్చల మేరకు మిరమ్ తరోన్ ను అప్పగిస్తామని చైనా ప్రకటించింది.

Also read: Cyber Crime : కేవైసీ పేరుతో ఘరానా మోసం.. రూ.15లక్షలు మాయం

ఈమేరకు గురువారం ఉదయం ఇండో – చైనా సరిహద్దులోని కిబితు ప్రాంతంలో ఉన్న “వాచా-దమై ఇంటరాక్షన్ పాయింట్” వద్ద మిరమ్ తరోన్ ను చైనా ఆర్మీ అధికారులు.. భారత ఆర్మీకి అప్పగించారు. తల్లిదండ్రులను కలుసుకున్న క్షణంలో యువకుడు ఎంతో భావోద్వేగానికి గురైనట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. అంతకముందు యువకుడిని గుర్తించేందుకు అరుణాచల్ లోని ట్యూటింగ్‌లోని ఇండియన్ ఆర్మీ క్యాంపు వద్ద ఏర్పాటు చేసిన పరేడ్ కార్యక్రమంలో మిరమ్ తరోన్.. తండ్రి ఒపాంగ్ తరోన్, తల్లీ పాల్గొన్నారు. ఫోన్ వీడియో కాల్ ద్వారా మిరమ్ తో మాట్లాడించేందుకు ఇరు వైపులా అధికారులు ప్రయత్నించగా.. కుదరలేదు. అనంతరం టెలిఫోన్ ద్వారా మరోమారు ప్రయత్నించగా.. తల్లి మాటలు విన్న మిరమ్ తరోన్ ఉద్వేగాన్ని ఆపుకోలేక బావురమని ఏడ్చినట్లు తెలిసింది.

Also read: Bansilalpet Well : బన్సీలాల్‌పేటలో కళ్లుచెదిరే మెట్ల బావి.. ఔట్ స్టాండింగ్ అంటున్న సిటీ జనం

ఇక ఈవ్యవహారంపై కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు స్పందిస్తూ..యువకుడి అప్పగింతలో సహకరించిన భారత ఆర్మీ అధికారులకు, అరుణాచల్ లోని స్థానిక భద్రత సిబ్బందికి, చైనా ఆర్మీకి కృతజ్ఞతలు తెలిపారు. మిరమ్ తరోన్ కు పూర్తి వైద్య పరీక్షల అనంతరం ఈ అప్పగింతలు జరిగినట్లు కిరణ్ రిజుజు పేర్కొన్నారు. తప్పిపోయిన యువకుడు మిరమ్ తరోన్ ను గుర్తించేందుకు అతని తల్లిదండ్రులు సహా చిన్ననాటి స్నేహితుడిని సైతం భారత అధికారులు తీసుకువెళ్లడం గమనార్హం.