X TV App : యూట్యూబ్ టీవీ యాప్‌కు పోటీగా మస్క్ ‘ఎక్స్’ టీవీ యాప్ వస్తోంది.. త్వరలో స్మార్ట్‌టీవీలలో నేరుగా లాంగ్ వీడియోలను చూడొచ్చు!

X TV App : యూట్యూబ్ టీవీ యాప్‌‌కు పోటీగా ఎక్స్ నుంచి సరికొత్త సూపర్ టీవీ యాప్ వస్తోంది. స్మార్ట్ టీవీలలో నేరుగా లాంగ్ వీడియోలను చూడవచ్చు.

X TV App : యూట్యూబ్ టీవీ యాప్‌కు పోటీగా మస్క్ ‘ఎక్స్’ టీవీ యాప్ వస్తోంది.. త్వరలో స్మార్ట్‌టీవీలలో నేరుగా లాంగ్ వీడియోలను చూడొచ్చు!

Elon Musk Says X's Long-Form Videos Will Soon Be Available on Smart TVs

Updated On : March 9, 2024 / 9:50 PM IST

X TV App : స్మార్ట్ టీవీలో కూడా లాంగ్-ఫారమ్ వీడియోలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ప్రపంచ బిలియనీర్ ఎలన్ మస్క్ సోషల్ నెట్‌వర్క్ (X) వచ్చే వారం కొత్త టీవీ సూపర్ యాప్ ప్రవేశపెట్టనుంది. ప్రత్యేకించి అమెజాన్, శాంసంగ్ వినియోగదారుల కోసం ఈ కొత్త టీవీ యాప్‌ను లాంచ్ చేయాలని యోచిస్తోంది. దీనికి సంబంధించి ఇటీవలే ఫార్చ్యూన్ మ్యాగజైన్ నివేదించింది. మెసేజింగ్ నుంచి పీర్-టు-పీర్ పేమెంట్ల వరకు సర్వీసులను అందించే సూపర్ యాప్‌గా మార్చాలని యోచిస్తున్నట్లు ఎలన్ మస్క్ కూడా పేర్కొన్నారు.

Read Also : Reliance Jio : జియో తెలంగాణలో ఘనంగా 53వ జాతీయ భద్రతా వారోత్సవాలు

కొద్ది రోజుల క్రితమే ఈ మైక్రోబ్లాగింగ్ దిగ్గజం ప్లాట్‌ఫారమ్ గత అక్టోబర్‌లో కొంతమంది యూజర్ల కోసం వీడియో, ఆడియో కాలింగ్ ప్రారంభ వెర్షన్‌ను విడుదల చేసింది. ఈ క్రమంలోనే ప్లాట్‌ఫారమ్ లాంగ్-ఫారమ్ వీడియోలను నేరుగా స్మార్ట్ టీవీలలో త్వరలో చూడవచ్చని మస్క్ పేర్కొన్నారు.


ఇంతకుముందు, ఈ యాప్ గూగుల్ యూట్యూబ్ అందించే టీవీ యాప్‌ను పోలి ఉంటుందని ఫార్చ్యూన్ తెలిపింది. మస్క్ యూట్యూబ్‌తో పోటీ పడేందుకు ఈ కొత్త యాప్ తీసుకొస్తున్నట్టు ఎక్స్ ప్లాట్ ఫారం వేదికగా ‘కమింగ్ సూన్’ అంటూ మస్క్ వెల్లడించారు. కొత్త టీవీ యాప్‌‌కు సంబంధించి మరిన్ని వివరాలను అందించడంపై ఎక్స్ స్పందించలేదు.

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ గత ఏడాది నుంచి స్మార్ట్ టీవీల కోసం స్పెషల్ యాప్‌పై పని చేస్తోంది. అప్పటికే, మస్క్ 97 నిమిషాల నిడివి గల వీడియోపై యూజర్లు చేసిన కామెంట్లకు రిప్లయ్ ఇచ్చారు. ఎవ్రీథింగ్ యాప్ పనిలో ఉందని ధృవీకరించారు. ఈ యాప్ అందుబాటులోకి రాగానే మస్క్ తన పోస్ట్‌కి రిప్లయ్ ఇచ్చాడు.

మీ ఫోన్ నుంచి మీ టీవీలో వీడియోలను ప్లే చేయడానికి ఆపిల్ ఎయిర్ ప్లేని ఉపయోగించవచ్చుని తెలిపారు. మీ (Xbox) లేదా (Android TV)లో ఎక్స్ వెబ్‌సైట్‌ను కూడా ఓపెన్ చేయొచ్చు. సపోర్టు పేజీ ప్రకారం.. పెద్ద స్క్రీన్‌పై లైవ్ షోలను కూడా వీక్షించవచ్చు.

సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ మాత్రమే కాకుండా, లైవ్-స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ ట్విచ్, ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్ సిగ్నల్, సోషల్ మీడియా ఫోరమ్ రెడిట్ వంటి అనేక ఇతర పాపులర్ యాప్‌లకు మస్క్ ప్రత్యక్ష పోటీని ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల, టెక్ బిలియనీర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఓపెన్ఏఐ, సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్‌పై కూడా దావా వేసిన సంగతి తెలిసిందే.

Read Also : iPhone 16 Pro Leak : కొత్త డిజైన్‌, క్యాప్చర్ బటన్‌‌తో ఆపిల్ ఐఫోన్ 16 ప్రో వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?