X Money Super App : ఇక కాస్కోండి.. మస్క్ ‘XMoney’ సూపర్ యాప్ వచ్చేస్తోంది.. G Pay, ఆపిల్ పే, అమెజాన్ పేలకు గట్టి పోటీ..!
X Money Super App : ఎలాన్ మస్క్ ఎక్స్ ప్లాట్‌ఫామ్‌పై ఎక్స్ మనీ అనే సూపర్ యాప్ తీసుకువచ్చేందుకు రెడీ అవుతోంది. ఇక పేమెంట్, బ్యాంకింగ్ సర్వీసులను ఒకే చోట యాక్సస్ చేయొచ్చు.
X Money Super App
- ‘ఎక్స్ మనీ’కి పేమెంట్, బ్యాంకింగ్ ఫీచర్లు యాడ్ చేసే ఛాన్స్
- ఏఐ అసిస్టెంట్ యూజర్ల ఖర్చులు, లావాదేవీలను ట్రాక్ చేస్తుంది
- నియంత్రణ ఆమోదాల కారణంగా సూపర్ యాప్ జాప్యం జరగొచ్చు
X Money Super App : ఎక్స్ యూజర్లకు బిగ్ న్యూస్.. ఎక్స్ మనీ సూపర్ యాప్ రాబోతుంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ ఒక “సూపర్ యాప్”గా మారేందుకు రెడీ అవుతోంది. నివేదికల ప్రకారం.. ఈ సంస్థ త్వరలో ‘ఎక్స్ మనీ’ అనే కొత్త పేమెంట్, బ్యాంకింగ్ సర్వీసును ప్రవేశపెట్టనుంది.
అన్ని సర్వీసులు ఒకేచోట నేరుగా ప్లాట్ఫామ్లోనే అందుబాటులో ఉండనున్నాయి. ఎలన్ మస్క్ కంపెనీ ప్రకారం.. వినియోగదారులు ఒకే యాప్‌లో అన్ని సర్వీసులను యాక్సస్ చేసేలా ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది.
అన్ని సర్వీసులు ఒకేచోట :
బ్లూమ్‌బెర్గ్ రిపోర్టు ప్రకారం.. ఎక్స్ మనీలో పీర్-టు-పీర్ పేమెంట్లు, కస్టమ్ వీసా డెబిట్ కార్డ్, ఏఐ ఆధారిత అసిస్టెంట్ వంటి ఫీచర్లు ఉండవచ్చు. ఈ ఏఐ అసిస్టెంట్‌ను xAI అభివృద్ధి చేస్తోంది. వినియోగదారులకు ఖర్చులను ట్రాక్ చేయడం, లావాదేవీలను నిర్వహించుకోవచ్చు.
తొలి వినియోగదారుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఇందులో క్యాష్‌బ్యాక్, సేవింగ్స్ వడ్డీ రేట్ల వంటి కొన్ని ప్రమోషనల్ బెనిఫిట్స్ కూడా ఉండవచ్చు. అయితే ఈ ఫీచర్లు పర్మినెంట్ ఉంటాయో లేదో స్పష్టంగా తెలియదు.
ఎక్స్ దీర్ఘకాలిక వ్యూహంలో పేమెంంట్ సర్వీసు ఒక కీలక భాగమని ఎలన్ మస్క్ గతంలో సూచించారు. వీచాట్‌ను పోలిన ఒక సూపర్ యాప్ గురించి నివేదికలు ప్రస్తావించాయి.
ఇందులో చాటింగ్, పేమెంట్లు, కమర్షియల్ సింగిల్ ప్లాట్‌ఫామ్‌పై ఉంటాయి. అదేవిధంగా, వినియోగదారులు తమ రోజువారీ కార్యకలాపాలలో చాలావాటిని ఒకే చోట యాక్సస్ చేసేలా ఎక్స్ ఒక మల్టీ బెనిఫిట్ యాప్‌గా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
నివేదికలను పరిశీలిస్తే.. :
అయితే, ఈ సర్వీసుకు సంబంధించిన అనేక అంశాలు ఇంకా అస్పష్టంగానే ఉన్నాయి. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. ఎక్స్ సంస్థ అమెరికాలోని అన్ని రాష్ట్రాలలో పేమెంట్ లైసెన్సులను పొందాల్సి ఉంది.
నియంత్రణ ఆమోదం విషయంలో సవాళ్లను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా, కొన్ని ప్రాంతాలలో వినియోగదారుల రక్షణ, భద్రతాపరమైన ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
పీర్-టు-పీర్ పేమెంట్ వ్యాపారాలలో సాధారణంగా లాభాల మార్జిన్లు తక్కువగా ఉంటాయని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు. ఎక్స్ మనీ యాప్ అనేది ప్రైమరీ బ్యాంకింగ్ ప్లాట్‌ఫారమ్‌గా ఎంతవరకు నిలదొక్కుకుంటుంది అనేదానిపై ఆధారపడి ఉంటుంది. ఈ ప్లాట్‌ఫారమ్‌లో యాప్‌లోనే కమర్షియల్ టూల్స్ లేకపోవడం కూడా ఒక సవాలుగా మారనుంది.
