X Subscription : యూజర్లకు పండగే.. భారత్‌లో భారీగా తగ్గిన ‘ఎక్స్’ ప్రీమియం, బేసిక్, ప్లస్ సబ్‌స్క్రిప్షన్ ధరలు.. బేసిక్ ప్లాన్ నెలకు ఎంతంటే?

X Subscription : ఎక్స్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ నెలకు రూ.900 నుంచి రూ.470కి తగ్గింది. బేసిక్ ప్లాన్ ఇప్పుడు నెలకు రూ.170 మాత్రమే..

X Subscription

X Subscription : ఎక్స్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఎలస్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ ప్లాట్‌ఫారం భారతీయ యూజర్ల కోసం మరోసారి ధరలను భారీగా తగ్గించింది. అన్ని లెవల్స్‌లో సబ్‌స్క్రిప్షన్ ధరలను తగ్గించింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ అప్‌డేట్‌ను ప్రకటించింది. ఎక్స్ ప్రీమియం ధరలు 48 శాతం వరకు తగ్గాయి.

మొబైల్ యాప్ యూజర్ల కోసం ప్రీమియం టైర్ ఇప్పుడు నెలకు రూ. 900 నుంచి రూ. 470 తగ్గింది. యానివల్ సబ్‌స్క్రిప్షన్ ధర 16శాతం తగ్గింది. దాంతో ఏడాదికి రూ. 4,272కి చెల్లించాల్సి ఉంటుంది. నెలకు రూ. 356 చెల్లించాలి. ఎక్స్ సబ్‌స్క్రిప్షన్ కొత్త ధరలు, ఇతర బెనిఫిట్స్ ఓసారి తెలుసుకుందాం..

బేసిక్ ప్లాన్ :
బేసిక్ ప్లాన్ ధర నెలకు రూ.243.75 నుంచి రూ.170కి తగ్గింది. వార్షిక ప్లాన్ ధర ఇప్పుడు రూ.2,590.48 నుంచి 34 శాతంతో రూ.1,700కి తగ్గింది. వెబ్, మొబైల్ ప్లాట్‌ఫారమ్‌లలో రాబోయే ధరలు కొత్త, పాత సబ్‌స్క్రైబర్‌లకు వర్తిస్తాయి.

ఎక్స్ సబ్‌స్క్రిప్షన్ ధర, బెనిఫిట్స్ ఇవే :
నెలకు రూ.427 ధరకే ఎక్స్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్, రిప్లై బూస్ట్, పోస్ట్‌కు పేమెంట్, చెక్‌మార్క్, గ్రోక్, ఎక్స్ ప్రోకి యాక్సెస్, అనలిటిక్స్, మీడియా స్టూడియో, క్రియేటర్ సబ్‌స్క్రిప్షన్ వంటి బెనిఫిట్స్ పొందవచ్చు.

Read Also : Motorola Razr 50 Ultra : మోటోరోలా లవర్స్ మీకోసమే.. ఈ ఫోల్డబుల్ రేజర్ 50 అల్ట్రాపై క్రేజీ డిస్కౌంట్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?

అంతేకాదు.. బేసిక్, ప్రీమియం ప్లస్ ధరలు కూడా తగ్గాయి. ఎక్స్ ప్రైమరీ సబ్‌స్క్రిప్షన్ ఇప్పుడు నెలకు రూ.170కి అందుబాటులో ఉంది. గతంలో నెలకు రూ.243.75గా ఉండేది. యానవల్ బిల్లింగ్‌ను ఎంచుకునే యూజర్లు ఇప్పుడు రూ.1,700 చెల్లించాలి. బేసిక్ సబ్‌స్క్రైబర్‌లకు వెరిఫికేషన్ బ్యాడ్జ్ లేనప్పటికీ, పోస్ట్ ఎడిటింగ్, లాంగ్-ఫామ్ కంటెంట్, బ్యాక్‌గ్రౌండ్ వీడియో ప్లే, మీడియా డౌన్‌లోడ్‌ వంటి ఫీచర్లను యాక్సెస్ చేయొచ్చు.

అడ్వాన్స్ ఫీచర్లతో ప్రీమియం ప్లస్ సబ్‌స్క్రిప్షన్ ధర నెలకు రూ.3,470 నుంచి రూ.2,570కి భారీగా తగ్గింది. అయితే, వార్షిక ప్లాన్‌ను ఎంచుకునే యూజర్లు రూ.26,400 నెలకు రూ.2,200 చెల్లించాల్సి ఉంటుంది. ప్రీమియం ప్లస్ యూజర్లు యాడ్స్ లేకుండా యాక్సస్ చేయొచ్చు.

ఫుల్ లెన్త్ స్టోరీలను పబ్లీష్ చేయొచ్చు. గ్రోక్ 4 ఆధారితమైన ప్లాట్‌ఫామ్ ఏఐ అసిస్టెంట్ సూపర్‌గ్రోక్‌కు యాక్సెస్ చేయొచ్చు. ప్రీమియం ఫీచర్లతో మరింత మంది యూజర్లను ఆకర్షించేందుకు ఎక్స్ సబ్‌స్క్రిప్షన్ ధరలను తగ్గించింది.