Check EPF Balance
EPFO : EPFO ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (EPF) చాలా మంది సబ్‌స్క్రైబర్‌లకు వారి EPF బ్యాలెన్స్, చివరి కాంట్రిబ్యూషన్ వివరాలను చెక్ చేయడం ఇప్పటికీ తెలియదు. ఇంటర్నెట్ లేకుండా కాల్స్, SMS ద్వారా PF బ్యాలెన్స్‌ను ఎలా చెక్ చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
మిస్డ్ కాల్ ద్వారా EPF బ్యాలెన్స్ ఎలా చెక్ చేయాలి? :
మీ UAN లింక్ చేసిన మొబైల్ నంబర్ నుంచి 9966044425కు మిస్డ్ కాల్ ఇవ్వండి.
రెండు రింగ్స్ తర్వాత కాల్ ఆటోమాటిక్‌గా డిస్‌కనెక్ట్ అవుతుంది. మీకు ఎలాంటి ఛార్జీ పడదు.
మీ మునుపటి EPF కాంట్రిబ్యూషన్లు, మీ ప్రస్తుత ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్ వివరాలతో కూడిన SMS అందుతుంది.
ఈ సర్వీసు ఫ్రీ.. 24×7 పూర్తిగా అందుబాటులో ఉంటుంది.
SMS ద్వారా EPF బ్యాలెన్స్ ఎలా చెక్ చేయాలి :
ఈపీఎఫ్ఓ SMS ఆధారిత సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. కొన్ని సెకన్లలో మీ అకౌంట్ వివరాలను చెక్ చేసేందుకు మిమ్మల్ని అనుమతిస్తుంది.
మీ ఫోన్‌లో SMS యాప్‌ను ఓపెన్ చేయండి.
ఈ ఫార్మాట్‌లో మెసేజ్ ‘EPFOHO UAN’టైప్ చేయండి.
మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 7738299899కు ఈ మెసేజ్ పంపండి.
డిఫాల్ట్‌గా మీకు ఇంగ్లీషులో రిప్లయ్ వస్తుంది. అయితే, ఈపీఎఫ్ఓ అనేక భారతీయ భాషలకు సపోర్టు ఇస్తుంది. మీకు ఇష్టమైన భాషలో మెసేజ్‌లను పొందడానికి మెసేజ్ చివరిలో ఆ భాష పేరులోని మొదటి 3 అక్షరాలను యాడ్ చేయాలి.
ఉదాహరణకు.. హిందీలో మెసేజ్‌ల కోసం ‘EPFOHO UAN HIN’టైప్ చేయండి. తమిళం కోసం, ‘EPFOHO UAN TAM’ టైప్ చేయండి.