Lenovo Laptop : విద్యార్థులకు పండగే.. విండోస్ 11తో రూ.20వేలకే లెనోవో థింక్‌ప్యాడ్ ల్యాప్‌టాప్.. బెస్ట్ డీల్ డోంట్ మిస్..!
Lenovo Laptop : విద్యార్థుల కోసం విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రూ. 20వేలకే లెనోవో థింక్ ప్యాడ్ ల్యాప్ టాప్ అందుబాటులో ఉంది.

Lenovo Laptop
Lenovo Laptop Thinkpad : అద్భుతమైన ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? రీఫర్బిష్డ్ లెనోవా థింక్‌ప్యాడ్ మోడల్ ఇప్పుడు రూ. 20వేల కన్నా తక్కువ ధరకు అందుబాటులో ఉంది.
టాప్ రేంజ్ ల్యాప్‌టాప్‌లకు సరిపోయే అత్యాధునిక స్పెసిఫికేషన్‌లతో కొనుగోలు చేయొచ్చు. ఈ ఆఫర్ టెక్ ఎక్స్‌పర్ట్స్, స్టూడెంట్స్ కోసం అందుబాటులో ఉంది. ఎడ్యుకేషన్, బిజినెస్ లేదా ఎంటర్‌టైన్మెంట్ కోసం ఈ లెనోవా థింక్‌ప్యాడ్ ల్యాప్ టాప్ కొనుగోలు చేయొచ్చు.
Read Also : OnePlus 13R : ఆఫర్ అదిరింది బాస్.. వన్‌ప్లస్ 13R ధర తగ్గిందోచ్.. ఇలాంటి డీల్ అసలు వదులుకోవద్దు..
రీఫర్బిష్డ్ ల్యాప్‌టాప్‌లు ఎందుకు బెస్ట్ అంటే? :
రీఫర్బిష్డ్ కంప్యూటర్లు అనేవి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ లోపాల కారణంగా డీలర్లకు రిటర్న్ వస్తాయి. వాడిన కంప్యూటర్లు. కంప్యూటర్లను తిరిగి అమ్మే ముందు అవసరమైనప్పుడల్లా టెస్టింగ్ చేస్తారు.
చాలా సందర్భాలలో ఏదైనా పార్టులలో లోపం ఉంటే వాటిని రిప్లేస్ చేస్తారు. లిమిటెడ్ టైమ్ వరకు కొత్త ప్రొడక్టులపై సగం ధరలకే వారంటీ కింద అమ్ముడవుతాయి. తక్కువ ధరకు కొనుగోలు చేసేవారికి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.
లెనోవా థింక్‌ప్యాడ్ డీల్ ధర :
16GB ర్యామ్, 512GB SSD స్టోరేజీతో లెనోవో థింక్‌ప్యాడ్ 6వ జనరేషన్ ఇంటెల్ కోర్ i5 ల్యాప్‌టాప్ ధర ఇప్పుడు కేవలం రూ. 19,399కు అందుబాటులో ఉంది. అంతేకాకుండా, కొన్ని బ్యాంక్ కార్డులతో వినియోగదారులు అదనంగా రూ.2వేలు తగ్గింపు పొందవచ్చు. ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న బెస్ట్ ల్యాప్‌టాప్ ఆఫర్లలో ఇదొకటిగా చెప్పొచ్చు.
లెనోవా థింక్‌ప్యాడ్ స్పెసిఫికేషన్లు :
ఈ లెనోవా ల్యాప్‌టాప్ పవర్, మొబిలిటీని అందిస్తుంది. 2.3GHz బేస్ స్పీడ్, 2.8GHz వరకు టర్బో బూస్ట్‌తో ఇంటెల్ కోర్ i5 6200U ప్రాసెసర్ ద్వారా రన్ అవుతుంది. 16GB DDR3 ర్యామ్, 512GB SSD ద్వారా పవర్ అందిస్తుంది.
బూటింగ్ టైమ్, మల్టీ టాస్కింగ్ సిల్క్ మాదిరిగా స్మూత్‌గా లైటనింగ్ స్పీడ్ ఉంటుంది. 14-అంగుళాల HD (1366×768) డిస్‌ప్లే, వెబ్‌క్యామ్, ఇంటెల్ HD గ్రాఫిక్స్ 520తో ఈ ఫోన్ సాధారణ వినియోగం, వీడియో కాన్ఫరెన్సింగ్ కోసం వినియోగించుకోవచ్చు.
ప్రీ ఇన్‌స్టాల్ సాఫ్ట్‌వేర్, పోర్ట్‌లు :
ఈ ల్యాప్‌టాప్ విండోస్ 11, MS ఆఫీస్ ట్రయల్‌తో ప్రీ లోడ్ అయ్యాయి. USB పోర్ట్‌లు, HDMI, LAN పోర్ట్, బ్లూటూత్‌తో సహా అనేక కనెక్టివిటీ ఆప్షన్లను కలిగి ఉంది. 1.5 కిలోల లైట్ వెయిట్, కాంపాక్ట్ సైజు ల్యాప్‌టాప్‌ను ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు. నిపుణులు, విద్యార్థులకు మరింత ఉపయోగకరంగా ఉంటుంది.
లెనోవా ల్యాప్‌టాప్ ధర ఎంతంటే? :
ఈ లెనోవా థింక్‌ప్యాడ్ రూ. 20వేల లోపు ధరకే కొనేసుకోవచ్చు. 13వ జనరేషన్ కోర్ i5తో లెనోవా LOQ, రైజెన్ 7తో ఆసుస్ జెన్‌బుక్, కోర్ i9తో MSI మోడరన్ 15 గేమింగ్ ఆప్షన్లను పొందవచ్చు. ఈ ల్యాప్‌టాప్ ధర రూ.58వేల నుంచి ప్రారంభమవుతాయి. 16GB ర్యామ్, SSD స్టోరేజీతో కూడా వస్తాయి.