OnePlus Nord : వన్‌ప్లస్ నార్డ్ 5, నార్డ్ CE 5 ఫోన్లు వచ్చేస్తున్నాయి.. లాంచ్‌కు ముందే కీలక స్పెషిఫికేషన్లు, ధర వివరాలు లీక్..!
OnePlus Nord : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? వన్‌ప్లస్ నార్డ్ 5, నార్డ్ CE 5 ఫోన్లు లాంచ్ కానున్నాయి.

OnePlus Nord : కొత్త వన్‌ప్లస్ ఫోన్ కొంటున్నారా? భారత మార్కెట్లోకి వన్‌ప్లస్ 13s లాంచ్ ధృవీకరించిన తర్వాత కంపెనీ Nord 5, Nord CE 5తో సహా నెక్స్ట్ జనరేషన్ నార్డ్ సిరీస్ ఫోన్‌లను లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది.
Read Also : Samsung Galaxy S25 : అదిరిపోయే ఆఫర్.. శాంసంగ్ గెలాక్సీ S25పై భారీ తగ్గింపు.. తక్కువ ధరకే ఇలా కొనేసుకోండి..!
ఈ స్మార్ట్‌ఫోన్‌లు వచ్చే నెలలో భారత మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. గతంలో, TUV రైన్‌ల్యాండ్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS)తో సహా కొన్ని సర్టిఫికేషన్ సైట్‌లలో కూడా ఈ వన్‌ప్లస్ ఫోన్లు కనిపించాయి.
అతి త్వరలో లాంచ్ అవుతాయని లీకులు సూచిస్తున్నాయి. ఈ జాబితాలో రాబోయే ఫోన్ల కొన్ని కీలక స్పెసిఫికేషన్‌లు కూడా లీక్ అయ్యాయి. అయితే, దీనిపై అధికారిక వివరాలు ఇలా ఉన్నాయి.
దేశంలో వన్‌ప్లస్ నార్డ్ 4, వన్‌ప్లస్ నార్డ్ CE 4 తర్వాత వన్‌ప్లస్ నార్డ్ 5, వన్‌ప్లస్ నార్డ్ CE 5 లాంచ్ అవుతాయని పుకార్లు వినిపిస్తున్నాయి. రాబోయే ఫోన్ లాంచ్ టైమ్‌లైన్, స్పెసిఫికేషన్లు వంటి పూర్తి వివరాలను ఓసారి లుక్కేయండి.
వన్‌ప్లస్ నార్డ్ 5, నార్డ్ CE 5 లాంచ్ టైమ్‌లైన్ (అంచనా) :
టిప్‌స్టర్ అభిషేక్ శర్మ ప్రకారం.. వన్‌ప్లస్ నార్డ్ 5, వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5 జూన్ చివరి నాటికి లేదా జూలై ప్రారంభంలో భారత మార్కెట్లోకి రావచ్చు. అయితే, కంపెనీ ఇంకా అధికారిక వన్‌ప్లస్ నార్డ్ 5, నార్డ్ సీఈ 5 లాంచ్ తేదీని రివీల్ చేయలేదు.
వన్‌ప్లస్ 13s, వన్‌ప్లస్ నార్డ్ 5 కన్నా ముందుగానే రిటైల్ స్టోర్లలోకి వచ్చే అవకాశం ఉంది. నివేదికల ప్రకారం.. వన్‌ప్లస్ 13s మే చివరి నాటికి లేదా జూన్ ప్రారంభంలో లాంచ్ కావచ్చు.
వన్‌ప్లస్ నార్డ్ 5, నార్డ్ సీఈ 5 స్పెసిఫికేషన్లు (అంచనా) :
నివేదికల ప్రకారం.. వన్‌ప్లస్ నార్డ్ 5 ఇటీవలే టీఈయూ రెయిన్ ల్యాండ్ సర్టిఫికేషన్ సైట్‌లో మోడల్ నంబర్ CPH2079తో లిస్టు అయింది. ఈ లిస్టింగ్ ప్రకారం.. వన్‌ప్లస్ ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,650mAh బ్యాటరీతో రావచ్చు.
వన్‌ప్లస్ నార్డ్ CE 5 మోడల్ నంబర్ CPH217తో BISలో కనిపించింది. కానీ, లిస్టులో ఎలాంటి స్పెసిఫికేషన్లను వెల్లడించలేదు.
Read Also : OnePlus 13R : ఆఫర్ అదిరింది బాస్.. వన్‌ప్లస్ 13R ధర తగ్గిందోచ్.. ఇలాంటి డీల్ అసలు వదులుకోవద్దు..
అయితే, పుకార్ల ఆధారంగా స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 8350 చిప్‌సెట్, 6.7-అంగుళాల FHD+ OLED ఫ్లాట్ డిస్‌ప్లే, 50MP సోనీ LYT600/IMX882 LED డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించవచ్చు.