EPFO Passbook : మీ ఫోన్‌లో ఈ యాప్ ఉంటే చాలు.. EPF పాస్‌బుక్ ఈజీగా డౌన్‌లోడ్ చేయొచ్చు.. పీఎఫ్ బ్యాలెన్స్ కూడా..!

EPFO Passbook : ఈపీఎఫ్ఓ పాస్‌బుక్ ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ సర్వీసు కోసం UMANG యాప్ ద్వారా వేగంగా సర్వీసులను యాక్సస్ చేయొచ్చు.

EPFO Passbook

EPFO Passbook : ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) EPF సభ్యులందరి కోసం యూజర్ ఫ్రెండ్లీ సర్వీసులను అందిస్తోంది. ఈపీఎఫ్ఓ పోర్టల్, ప్రత్యేక మొబైల్ (EPFO Passbook) అప్లికేషన్‌ (ఉమాంగ్ యాప్)తో సహా అనేక డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఇప్పుడు EPF సభ్యులు తమ పీఎం అకౌంట్లను సులభంగా యాక్సస్ చేయొచ్చు. ఈపీఎఫ్ సర్వీసు కూడా పూర్తిగా ఉచితం. చందాదారులందరూ ఈపీఎఫ్ఓ సేవలను వేగంగా పొందవచ్చు. ఉమాంగ్ యాప్ ద్వారా ఈపీఎఫ్ఓ పాస్ బుక్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? పీఎఫ్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేయాలి అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Read Also : Samsung Galaxy Z Fold 6 5G : కళ్లుచెదిరే డిస్కౌంట్.. శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ భారీగా తగ్గిందోచ్.. ఇదే బెస్ట్ టైమ్..!

ఈపీఎఫ్ఓ ​వెబ్‌సైట్ లేదా ఉమాంగ్ యాప్ :
భారత్‌లో మొబైల్ గవర్నెన్స్‌ కోసం ఉమాంగ్ (యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ-ఏజ్ గవర్నెన్స్)ను ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY), నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్ (NeGD) అభివృద్ధి చేశాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి స్థానిక ప్రభుత్వ సంస్థల వరకు పాన్ ఇండియా ఇ-గవర్నమెంట్ సేవలను యాక్సెస్ కోసం భారతీయ పౌరులందరికి ఉమాంగ్ సింగిల్ ప్లాట్‌ఫారం అందిస్తుంది.

EPFO కోసం UMANG యాప్‌లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి?  :

  • ఉమాంగ్ యాప్ EPFO ​​పాస్‌బుక్ డౌన్‌లోడ్ చేయండి.
  • మీ EPF ఇ-పాస్‌బుక్‌ డౌన్‌లోడ్ కోసం UMANG యాప్‌ని ఉపయోగించండి.

‘ఉమాంగ్’లో EPF పాస్‌బుక్‌ చెకింగ్ ఇలా.. (EPFO Passbook) :

  • EPFOలో సెర్చ్ చేయండి.
  • ‘View Passbook’పై క్లిక్ చేయండి.
  • UAN నెంబర్ ఎంటర్ చేయండి
  • ‘GET OTP’పై క్లిక్ చేసి OTP ఎంటర్ చేయండి.
  • మెంబర్ ఐడీని ఎంచుకుని ఈ-పాస్‌బుక్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

ఉమాంగ్ యాప్ రిజిస్ట్రేషన్ ఇలా :

  • ఇంటర్‌ఫేస్‌ ద్వారా UMANGలో రిజిస్టర్ చేసుకోవచ్చు.
  • వెబ్, మొబైల్ యాప్ ఉమాంగ్ వెబ్‌సైట్‌లో (www.umang.gov.in) విజిట్ చేయండి.
  • టాప్ రైట్ సైడ్ Login/Register ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
  • మీ మొబైల్ నంబర్‌ ఎంటర్ చేసి మొబైల్ స్క్రీన్‌పై OTP వెరిఫై చేయండి.
  • ఉమాంగ్‌ యాప్ రిజిస్ట్రేషన్ పూర్తి అయినట్టే..

ఉమాంగ్ మొబైల్ యాప్‌ :

Read Also : Credit Score Myths : ‘క్రెడిట్ స్కోర్’పై అపోహలొద్దు.. ఇలా చేస్తే ఎప్పుడూ తగ్గదు.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరి..!

  • గూగుల్ ప్లే/యాప్ స్టోర్‌లో ఉమాంగ్ యాప్ కోసం సెర్చ్ చేయండి.
  • యాప్‌ డౌన్‌లోడ్ కోసం ఇన్‌స్టాల్‌పై క్లిక్ చేయండి.
  • ‘Login/Sign Up’ బటన్‌పై క్లిక్ చేయండి
  • పాప్-అప్‌లో మీ లోకేషన్ షేరింగ్ ఆప్షన్ ఎంచుకోండి.
  • రిజస్టర్ కోసం మొబైల్ నంబర్‌ ఎంటర్ చేయండి. నిబంధనలు, షరతుల బాక్స్‌ టిక్ చేయండి.
  • మొబైల్ నంబర్‌కు వచ్చిన OTP ఎంటర్ చేసి Submit బటన్‌పై క్లిక్ చేయండి.