EPFO Withdrawal Process: మీ పీఎఫ్ అకౌంట్లో డబ్బులు విత్‌డ్రా చేసుకోండిలా..!

మీ పీఎఫ్ అకౌంట్లో డబ్బులు విత్ డ్రా చేసుకోవాలా? పీఎఫ్ ఖాతాదారులు ఆన్‌లైన్ లోనే నాన్ రిఫండబుల్ అడ్వాన్స్‌గా డబ్బులు విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పించింది EPFO సంస్థ. కొవిడ్-19 రీజన్ చూపిస్తూ డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు...

How To Withdraw Money From Pf Account Online

EPFO Withdrawal Process : మీ పీఎఫ్ అకౌంట్లో డబ్బులు విత్ డ్రా చేసుకోవాలా? పీఎఫ్ ఖాతాదారులు ఆన్‌లైన్ లోనే నాన్ రిఫండబుల్ అడ్వాన్స్‌గా డబ్బులు విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పించింది ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సంస్థ. ఇటీవలే ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

కొవిడ్-19 సెకండ్ వేవ్ ప్రభావం, అత్యవసర చికిత్సకు డబ్బు అవసరమైన పీఎఫ్ ఖాతాదారులకు రిలీఫ్ అందించేందుకు ఈ సదుపాయం అందిస్తోంది. కొవిడ్-19 రీజన్ చూపిస్తూ పీఎఫ్ అకౌంట్ల నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు…

గత ఏడాదిలోనే కేంద్ర ప్రభుత్వం ప్రావిడెంట్ ఫండ్స్ స్కీమ్ 1952ను సవరించింది. పీఎఫ్ అకౌంట్లో నుంచి ఖాతాదారులు మూడు నెలల బేసిక్ పే, డీఏల నుంచి 75శాతం మేర విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తోంది.

గత ఏడాదిలో పీఎఫ్ అకౌంట్లో అడ్వాన్స్ తీసుకున్నవాళ్లు కూడా మరోసారి కూడా విత్ డ్రా చేసుకునే అవకాశం అందిస్తోంది. కొవిడ్-19కు సంబంధించి అత్యవసరంగా ఎవరైనా పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే ఈ మూడు విషయాల్లో పీఎఫ్ ఖాతాదారులు తప్పనిసరిగా పూర్తి చేసి ఉండాలి.

1. UAN నెంబర్ తప్పనిసరిగా యాక్టివేట్ అయి ఉండాలి.
2. మీ ఆధార్, పాన్ నెంబర్లతో పాటు బ్యాంకు అకౌంట్ నెంబర్లకు UAN నెంబర్ లింక్ అయి ఉండాలి.
3. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర కూడా UAN అకౌంట్లో యాడ్ చేసి ఉండాలి. అప్పుడే OTP వస్తుంది.

ఆన్‌లైన్‌లో పీఎఫ్ మనీ విత్ డ్రా చేసుకోండిలా..
1. EPFO అకౌంట్లో లాగిన్ అవ్వండి. మీ UAN నెంబర్, పాస్ వర్డ్ ఎంటర్ చేయండి.
2. Online Services అనే ట్యాబ్ సెలక్ట్ చేయండి.
3. Claim (Form-31, 19 & 10C) డ్రాప్-డౌన్ ఆప్షన్ ఎంచుకోండి.
4. మీ అకౌంట్లో PAN కార్డ్, ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్ నెంబర్ వివరాలు కనిపిస్తాయి.
5. మీ బ్యాంక్ అకౌంట్లో చివరి నాలుగు నెంబర్లను ఎంటర్ చేసి Verify పై క్లిక్ చేయండి.
6. Terms and Conditions ఆప్షన్ పై క్లిక్ చేసి.. Proceed Claim బటన్ పై Click చేయండి.
7. మనీ విత్ డ్రా కోసం PF Advance (Form 31) ఆప్షన్ సెలక్ట్ చేయండి.
8. ఏ అవసరం కోసం డబ్బులు డ్రా చేస్తున్నారో ఆ ఆప్షన్ ఎంచుకోండి.
9. రీజన్ సెలక్ట్ చేశాక.. ఎంతవరకు అమౌంట్ కావాలో నెంబర్ ఎంటర్ చేయండి.
10. మీ అడ్రస్ వివరాలు అడిగితే.. పూర్తిగా ఎంటర్ చేయండి.
11. మీ పీఎఫ్ అకౌంట్ కు లింకైన బ్యాంకు అకౌంట్ వివరాలు లేదా బ్యాంక్ చెక్ అప్ లోడ్ చేయండి.
12. చివరిగా అప్లికేషన్ Submit ఆప్షన్ ఎంచుకోండి.
13. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు OTP వస్తుంది..
14. OTP ఎంటర్ చేస్తే చాలు.. మీ క్లయిమ్ ప్రాసెస్ పూర్తియినట్టే..
15. మీ అప్లికేషన్ ముందుగా మీ కంపెనీ అప్రూవ్ చేయాల్సి ఉంటుంది.
16. ఆ తర్వాతే మీ బ్యాంకు అకౌంట్లో అమౌంట్ క్రెడిట్ అవుతుంది.