ఇక కంట్రోల్ మీ చేతుల్లో : ఫేస్‌బుక్.. News Feed మార్చేస్తోంది

ఫేస్ బుక్.. పరిచయం అక్కర్లేదు. రోజుకో ఎన్నో పోస్టులు.. వీడియోలు.. న్యూస్ ఫీడ్ నిండిపోతోంది. ఫేస్ బుక్ అకౌంట్ లాగిన్ అయితే చాలు.. అనవసరమైన పోస్టులే ఎక్కువగా దర్శనమిస్తాయి.

  • Publish Date - April 1, 2019 / 11:17 AM IST

ఫేస్ బుక్.. పరిచయం అక్కర్లేదు. రోజుకో ఎన్నో పోస్టులు.. వీడియోలు.. న్యూస్ ఫీడ్ నిండిపోతోంది. ఫేస్ బుక్ అకౌంట్ లాగిన్ అయితే చాలు.. అనవసరమైన పోస్టులే ఎక్కువగా దర్శనమిస్తాయి.

ఫేస్ బుక్.. పరిచయం అక్కర్లేదు. రోజుకో ఎన్నో పోస్టులు.. వీడియోలు.. న్యూస్ ఫీడ్ నిండిపోతోంది. ఫేస్ బుక్ అకౌంట్ లాగిన్ అయితే చాలు.. అనవసరమైన పోస్టులే ఎక్కువగా దర్శనమిస్తాయి. ఫ్రెండ్స్, గ్రూపులు, పేజీల నుంచి వేలాది పోస్టులు న్యూస్ ఫీడ్ లో వచ్చి చేరుతుంటాయి. న్యూస్ ఫీడ్ పై నిండిపోయిన అవసరం లేని పోస్టులను కంట్రోల్ చేయడం ఎలా అని ఆలోచిస్తున్నారా? ప్రముఖ సోషల్ మీడియా నెట్ వర్కింగ్ దిగ్గజం ఫేస్ బుక్ మళ్లీ న్యూస్ ఫీడ్ మార్చేస్తోంది. తమ యూజర్ల ప్రైవసీ కోసం కొత్త అప్ డేట్స్, కొత్త ఫీచర్లను అందుబాటులోకి తేస్తోంది.
Read Also : పవన్ హామీలు : స్టూడెంట్స్‌కి ల్యాప్ టాప్.. ఆడపిల్లలకు మహాలక్ష్మి పథకం

న్యూస్ ఫీడ్ కంట్రోల్ చేసేందుకు ఫేస్ బుక్ కొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టింది. అదే.. వై యామ్ ఐ సీయింగ్ దిస్ (పోస్ట్) యాడ్ ?. ఈ ఫీచర్ సాయంతో మీ FB అకౌంట్ లోని ప్రత్యేకమైన పోస్టులను గుర్తించి కంట్రోల్ చేయొచ్చు. ‘వై యాప్ ఐ సీయింగ్ దిస్ పోస్ట్?.. మీ ఫ్రెండ్స్ అకౌంట్, పేజీలు, గ్రూపుల నుంచి షేర్ అయిన పోస్టులు మీ అకౌంట్ న్యూస్ ఫీడ్ లో ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. యాప్ లో నేరుగా ఎలా వర్క్ చేస్తుందనేదానిపై తొలిసారి ఈ టెక్నాలజీని తీసుకొచ్చాం’ అని ఫేస్ బుక్ ప్రొడక్ట్ మేనేజర్ రమ్య సేతురామన్ బ్లాగ్ పోస్టులో తెలిపారు.  

ఈ కొత్త ఫీచర్ ఎలా వర్క్ చేస్తుందంటే? : 
* మీ FB అకౌంట్ న్యూస్ ఫీడ్ పై కనిపించే పోస్టులకు పక్కన కుడిభాగంలో మూడు డాట్లు కనిపిస్తాయి. 
ఇక్కడ డ్రాప్ డౌన్ మెనూ ఉంటుంది. గతంలో పేజీల పోస్టులు మీ న్యూస్ ఫీడ్ పై ఎంత ప్రభావం చూపాయో తెలుసుకోవచ్చు. 
ఫ్రెండ్స్, పేజీలు, గ్రూపులు, ఫాలోయింగ్ నుంచి వచ్చిన పోస్టులపై షార్ట్ కట్ లతో కంట్రోల్ చేయొచ్చు.
న్యూస్ ఫీడ్ పై.. see first, unfollow సైతం కంట్రోల్ చేయొచ్చు.
న్యూస్ ఫీడ్ ప్రీపరెన్సెస్, ప్రైవసీ షార్ట్ కట్స్ సహాయంతో యూజర్లు తమ న్యూస్ ఫీడ్ పై పర్సనల్ గా మార్చుకోవచ్చు.
Read Also : కోహ్లీని ట్విట్టర్‌లో ఆడుకుంటున్న నెటిజన్లు

2014లోనే ఫేస్ బుక్.. వై యామ్ ఐ సీయింగ్ దిస్ యాడ్? అనే ఫీచర్ ను ప్రవేశపెట్టింది. ఆ తర్వాత ఈ ఫీచర్ లో మరిన్ని మార్పులు చేసి అదనంగా యాడ్స్ వివరాలను తెలుసుకునే అవకాశం కల్పించింది. ఫేస్ బుక్ అడ్వటైజర్ జాబితాకు ఫేస్ బుక్ ప్రొఫైల్ కు మ్యాచ్ అయ్యేలా కనిపిస్తాయి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అప్ లోడ్ చేయడం వల్ల కస్టమర్లకు త్వరగా బిజినెస్ రీచ్ అయ్యేందుకు వీలు ఉంటుంది. ఈమెయిల్, ఫోన్ నెంబర్ల ఆధారంగా ఈ యాడ్స్ డిసిప్లే అవుతాయి. అంతేకాదు.. అడ్వటైజర్లు తమ కస్టమర్ల ఇన్ఫర్మేషన్ ను మరో మార్కెటింగ్ పార్టనర్ తో యాడ్ రన్ చేస్తున్నాడా? ఎంత పారదర్శకంగా ఉందనే సమాచారమంతా ఈ కొత్త ఫీచర్ అప్ డేట్స్ తో తెలుసుకోవచ్చు. 
Read Also : విశాల హృదయం: ఆదివాసీలకు స్కూల్ కట్టిస్తున్న కాజల్