Facebook Down : ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్ డౌన్.. మళ్లీ ఏమైందంటూ యూజర్ల ఫిర్యాదులు!

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ (Meta) మరోసారి స్తంభించింది. ప్రపంచవ్యాప్తంగా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ డౌన్ అయిదంటూ వందలాది యూజర్లు ఫిర్యాదులు చేస్తున్నారు.

Facebook Down : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ (Meta) మళ్లీ స్తంభించింది. ప్రపంచవ్యాప్తంగా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ డౌన్ అయిదంటూ వందలాది యూజర్లు ఫిర్యాదులు చేస్తున్నారు. డౌన్ డిటెక్టర్ ప్రకారం.. ఫేస్‌బుక్ అంతరాయానికి సంబంధించి గత 24 గంటల్లో 346 ఫిర్యాదులు వచ్చాయి. చాలా మంది ఫేస్‌బుక్ యూజర్లు తమ ఫిర్యాదులను ట్విట్టర్‌ వేదికగా వెల్లడిస్తున్నారు. ఫేస్‌బుక్ వెబ్‌సైట్ ఎర్రర్ పేజీలను షేర్ చేస్తున్నారు. ఏదో తప్పు జరిగింది.. (Sorry Something Went Wrong) అనే ఎర్రర్ మెసేజ్ కనిపిస్తోంది.

దీనిపై ఫేస్‌బుక్ స్పందించింది. వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరిస్తామని ఒక ప్రకటనలో వెల్లడించింది. గత కొన్ని వారాల్లో ఫేస్‌బుక్ సైట్ డౌన్ కావడం ఇది రెండోసారి. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సర్వీసులు నిలిచిపోవడంతో నవంబర్ 19న యూజర్లు నివేదించారు.

డౌన్‌డిటెక్టర్ ప్రకారం.. వేలాది మంది యూజర్లు సమస్యలను ఎదుర్కొన్నారు. మెసేజింగ్ యాప్ వాట్సాప్‌పై కూడా దీనిప్రభావం పడినట్లు సమాచారం. కాగా, సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ కార్పొరేట్ పేరును ప్రధాన రీబ్రాండ్‌లో మెటాగా మార్చిన సంగతి తెలిసిందే.

Read Also : iPhone 12 Pro : అమెజాన్‌ బిగ్ డీల్.. ఐఫోన్ 12ప్రోపై రూ.25వేలు డిస్కౌంట్.. డోంట్ మిస్!

ట్రెండింగ్ వార్తలు