Fact Check-Bill Gates : కాశీ విశ్వనాథుని సన్నిధిలో ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్..? ఫేక్ అంటున్న నెటిజన్లు..!

Fact Check - Bill Gates : బిల్ గేట్స్ విశ్వనాథుని కాశీ నగరానికి వచ్చారా? ఘాట్‌లను వీక్షిస్తున్నట్టుగా వీడియో వైరల్ అవుతుంది.

Bill Gates comes under the divine

Fact Check-Bill Gates : ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రపంచ సంపన్నుల జాబితాలో ఒకరైన మైక్రోసాఫ్ట్ హానర్ బిల్ గేట్స్ భారత పర్యటనకు వచ్చారా? ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న మహాకుంభమేళాకు అనేక దేశ, విదేశాల నుంచి ప్రముఖులు వస్తున్నారు. ఈ కుంభమేళా సమయంలో బిల్ గేట్స్ కూడా కాశీ విశ్వనాథ్ సందర్శనార్థం చేరుకున్నట్టుగా ఒక వీడియో వైరల్ అవుతుంది.

Read Also : Maha Kumbh mela: మహా కుంభమేళా.. పవిత్ర త్రివేణి సంగమంలో నాగసాధువులు ‘అమృత స్నానం’.. పోటెత్తిన భక్తజనం

ప్రస్తుతం ఆయన కాశీ విశ్వనాథ్ సన్నిధిలో ఉన్నట్టుగా ఆ వీడియోలో కనిపిస్తోంది. ఇందులో బాల్కనీ నుంచి గంగామాత ఘాట్‌లను బిల్ గేట్స్ వీక్షిస్తున్నట్టుగా ఉంది. ప్రస్తుతం దేశంలో ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభ్ (మహా కుంభ్ 2025) జరుగుతున్న సంగతి తెలిసిందే.

భారత్, విదేశాల నుంచి అనేక మంది ప్రముఖ వ్యక్తులు ఇక్కడకు విచ్చేశారు. మహాకుంభ్ 2025లో ఆపిల్ సహ వ్యవస్థాపకుడి భార్య లారెన్ పావెల్ జాబ్స్ నుంచి ఐఐటీయన్ బాబా వరకు లక్షలాది మంది భక్తులు ఈ కుంభమేళాకు హాజరయ్యారు.

అయితే, బిల్ గేట్స్ కూడా నిజంగానే ఈ మహోత్సవానికి చేరుకున్నారంటూ వైరల్ వీడియోలు ఇంటర్నెట్‌ను గందరగోళానికి గురిచేశాయి. దాంతో బిల్ గేట్స్ మహాకుంభ్ 2025లో ఉన్నారా అనేది పెద్దచర్చనీయాంశమైంది. అయితే, ఆ వీడియోలోని వ్యక్తి బిల్ గేట్స్‌ను పోలి ఉండే వ్యక్తి అని పలువురు నెటిజన్లు పేర్కొన్నారు.

బిల్ గేట్స్ వైరల్ వీడియోలు రియల్ లేదా ఫేక్? :
సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వైరల్ వీడియో నిజానికి పాతదేనని తేలింది. ఫుటేజ్ డిసెంబర్ 2024 నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది బిల్ గేట్స్ పవిత్ర నగరమైన కాశీలో ఉన్నట్టుగా చూపుతున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.

అంతేకాకుండా, బిల్ గేట్స్ భారత పర్యటనలో ఉన్నారని సోషల్ మీడియాలో ఇప్పటివరకూ ఎలాంటి పోస్టులు కనిపించలేదు. ఆయన నిజంగా మహాకుంభ్‌ను సందర్శిస్తే అసాధారణంగా ఉంటుంది. ఎందుకంటే.. బిలియనీర్ తన విదేశీ పర్యటనలను డాక్యుమెంట్ చేయడంలో ఎప్పుడు ముందుంటారు. గత సంవత్సరం భారత్‌కు వచ్చినప్పుడు ఆయన పర్యటనకు సంబంధించి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అది బిల్ గేట్స్ కాదు :
వైరల్ వీడియోలపై నెటిజన్లు కూడా స్పందిస్తూ.. ఆ క్లిప్‌లు ఫేక్ అని ఆ వీడియోలో ఉన్నది బిల్ గేట్స్ కాదని పేర్కొన్నారు. అయితే, మహాకుంభమేళా ప్రారంభం కాకముందే డిసెంబరు నుంచి ఈ వీడియో ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తున్నట్టు లోతుగా సెర్చ్ చేస్తే తేలింది.

ఇప్పటికే, మరో ఐటీ దిగ్గజం దివంగత ఆపిల్ సంస్థ సహ-వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ స్టీవ్ జాబ్స్ భార్య లారెన్ జాబ్స్ కూడా మహాకుంభామేళా 2025లో పాల్గొనున్నారు. లారెన్ పావెల్ నిరంజని అఖారాకు చెందిన మహామనదళేశ్వర్ స్వామి కలియశానంద శిబిరంలో ఉంటున్నారు. జనవరి 29, 2025 వరకు ఆమె ఈ మహాకుంభమేళాలో పాల్గొనే అవకాశం ఉంది.

ఈ జాతర సమయంలో ఆమె పవిత్ర స్నానం చేసే అవకాశం ఉంది. కల్పవాస్ అనేది కల్పవాసి అనే పురాతన సంప్రదాయంగా పిలుస్తారు. పుష్య పూర్ణిమ నుంచి మాఘి పూర్ణిమ వరకు నెలలో జరుపుకుంటారు. ఈ కాలంలో, కల్పవాసులు ప్రతిరోజూ గంగా స్నానం చేస్తారు. ఉపన్యాసాలు వినడానికి వివిధ ఋషులు, సాధువుల శిబిరాలను సందర్శిస్తారు.

Read Also : Mahakumbh Mela 2025: రికార్డులు క్రియేట్ చేస్తోన్న మహా కుంభమేళా.. రెండోరోజు ఎంతమంది ‘అమృత స్నాన్’ చేశారంటే..