Maha Kumbh mela: మహా కుంభమేళా.. పవిత్ర త్రివేణి సంగమంలో నాగసాధువులు ‘అమృత స్నానం’.. పోటెత్తిన భక్తజనం

Maha Kumbh mela: ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో ప్రపంచంలోనే అతిపెద్ద అధ్యాత్మిక వేడుక మహాకుంభ మేళా రెండో రోజు కొనసాగుతుంది. మకర సంక్రాంతి సందర్భంగా భక్తులు, నాగసాధువులు అమృత స్నానాలు ఆచరిస్తున్నారు.

Maha Kumbh mela: మహా కుంభమేళా.. పవిత్ర త్రివేణి సంగమంలో నాగసాధువులు ‘అమృత స్నానం’.. పోటెత్తిన భక్తజనం

Maha Kumbh Mela 2025

Updated On : January 14, 2025 / 9:18 AM IST

Maha Kumbh mela: ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో ప్రపంచంలోనే అతిపెద్ద అధ్యాత్మిక వేడుక మహాకుంభ మేళా సోమవారం ఉదయం పుష్య పూర్ణిమ స్నానంతో మొదలైంది. పన్నెండేళ్లకు ఒకసారి జరిగే ఈ కుంభమేళా 45 రోజులు పాటు కొనసాగనుంది. తొలిరోజు సాయంత్రం 6గంటల వరకు 1.65కోట్ల మంది భక్తులు త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించినట్లు యూపీ ప్రభుత్వం పేర్కొంది. అయితే, కుంభమేళాలో రెండోరోజు అమృత స్నానం కోసం భక్తులు పోటెత్తారు.

Also Read: Maha Kumbh Mela 2025 : మహా కుంభమేళాలో స్టీవ్ జాబ్స్ సతీమణి లారెన్ పావెల్.. హిందూ పేరు ‘కమల’గా నామకరణం..!

కుంభమేళాలో మొదటి అమృత స్నానం మకర సంక్రాంతి శుభసందర్భంగా జరగనుంది. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. దీంతో తెల్లవారు జామునుంచే గంగా, యమున, అంతర్వాహినిగా భావించే సరస్వతి నదుల త్రివేణి సంగమంలో సనాతన ధర్మంలోని 13 అఖాడాలకు చెందిన సాధువులు, రుషులు ఇవాళ పవిత్ర స్నానం ఆచరిస్తున్నారు. సనాతన ధర్మంలోని 13 అఖాడాల క్రమాన్ని మహా కుంభమేళా పరిపాలన విభాగం ఖరారు చేసింది. ప్రతి అఖాడాకు పవిత్ర స్నానాలు ఆచరించేందుకు సమయాన్ని షెడ్యూల్ చేశారు.


శ్రీ పంచాయతీ అఖరా మహానిర్వాణి, శ్రీ శంభు పంచాయతీ అటల్ అఖారా తొలుత అమృత స్నానం చేశారు. రెండు అఖరాలు ఉదయం 5.15 గంటలకు శిబిరం నుంచి బయలుదేరి 6.15గంటలకు ఘాట్ వద్దకు చేరుకున్నారు. 40 నిమిషాల పాటు వీరు పవిత్ర స్నానాలు చేశారు. అనంతరం 6.55 గంటలకు ఘాట్ నుంచి బయలుదేరి వెళ్లిపోయారు. ఆ తరువాత శ్రీ తపోనిధి పంచాయతీ, శ్రీ నిరంజని అఖారా మరియు శ్రీ పంచాయతీ అఖారా ఆనంద్ ఉదయం 7.05 గంటలకు ఘాట్ వద్దకు చేరుకున్నారు. రెండు అఖారాలకు చెందిన నాగ సాధువులు 40 నిమిషాల పాటు పవిత్ర సంగమంలో అమృత స్నానం చేశారు. ఇలా.. వారికి కేటాయించిన సమయం ప్రకారం అఖారాలు ఘాట్ వద్దకు చేరుకొని పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు.


యూపీ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ ట్విటర్ ఖాతాలో మహాకుంభ మేళాలో మంగళవారం తెల్లవారు జామున తీసిన కొన్ని ఫొటోలను షేర్ చేశారు. ఇది మన సనాతన సంస్కృతి మరియు విశ్వాసానికి సజీవ రూపం అని రాశారు. మకర సంక్రాంతి సందర్భంగా మహాకుంభ మేళాలో ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమం వద్ద మొదటి అమృత స్నానం ఆచరించి పుణ్యం పొందిన భక్తులందరికీ అభినందనలు తెలిపారు.