Fake Websites Scam : ఆన్‌లైన్ స్కామర్లతో జాగ్రత్త.. డిమార్ట్, బిగ్ బాస్కెట్, బిగ్ బజార్ పేర్లతో ఫేక్ వెబ్‌సైట్లు.. ఈ లింకులను క్లిక్ చేస్తే ఖతమే..!

Fake Websites Scam : ఆన్‌లైన్‌లో ఏదైనా కొనుగోలు చేస్తున్నారా? ఫేక్ వెబ్‌సైట్ల (Fake Websites)తో తస్మాత్ జాగ్రత్త.. స్కామర్లు క్రియేట్ చేసిన ఈ సైట్లలో కొనుగోలు చేస్తే మీ అకౌంట్లు ఖాళీ చేసేస్తారు.

Fake Websites Scam (Photo : Google)

Fake Websites Scam : ఆన్‌లైన్ మోసాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. స్కామర్లు వినియోగదారులను మోసగించేందుకు అనేక మార్గాల్లో ప్రయత్నిస్తున్నారు. రియల్ వెబ్‌సైట్ల పేరుతో ఫేక్ వెబ్‌సైట్ల (Fake Websites)ను క్రియేట్ చేసి కొత్త స్కామ్‌కు తెరలేపారు. షాపింగ్ వెబ్‌సైట్ల (Shopping Websites) మాదిరిగానే కనిపించే ఆయా లింకులను తొందరపడి క్లిక్ చేసి.. ఏదైనా వస్తువు కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తే.. అంతే సంగతులు.. మీ బ్యాంకు అకౌంట్లలో నగదును ఖాళీ చేసేస్తారు స్కామర్లు.. ఇటీవల నోయిడా పోలీసులు (Noida Police) డి-మార్ట్ (D-Mart), బిగ్ బాస్కెట్ (Big Basket), బిగ్ బజార్ (Big Bazar) పేర్లతో స్కామర్లు ఫేక్ వెబ్‌సైట్‌లను క్రియేట్ చేసినట్టు గుర్తించారు. దీనికి సంబంధించి మోసానికి పాల్పడిన సైబర్ గ్యాంగ్‌లోని ఆరుగురు సభ్యులను పట్టుకున్నారు.

ఈ సైబర్ స్కామర్లు ఫేక్ వెబ్‌సైట్‌లను క్రియేట్ చేసి.. అమాయకపు వినియోగదారులను మోసగిస్తున్నారని పోలీసులు దర్యాప్తులో తేల్చేశారు. ఈ లింకుల ద్వారా ఫేక్ డిస్కౌంట్‌లు, డీల్‌లను అందిస్తున్నట్టుగా వినియోగదారులను నమ్మిస్తున్నారు. ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు, చెల్లింపులు చేసేలా ఆకర్షిస్తున్నారని పోలీసులు తెలిపారు. నివేదిక ప్రకారం.. ఈ సైబర్ ముఠా కొనుగోలుదారులను ఆకర్షించడానికి ప్రొడక్టులపై డిస్కౌంట్ లేదా చౌకైన ధరలకు ఫేక్ వెబ్‌సైట్‌లలో అనుమానాస్పదంగా అందిస్తున్నట్టు నోయిడా పోలీసులు గుర్తించారు. ఎవరైనా ఈ వెబ్‌సైట్‌ల ద్వారా ఆర్డర్ చేసి ఆన్‌లైన్‌లో చెల్లించడానికి ప్రయత్నిస్తే.. స్కామర్‌లు కొనుగోలుదారుల క్రెడిట్/డెబిట్ కార్డ్ సమాచారాన్ని తస్కరించి.. ఆపై వారి బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బును కాజేస్తున్నారు.

Read Also : Electricity Bill Scam : ఎలక్ట్రిసిటీ బిల్ స్కామ్‌తో జాగ్రత్త.. ఆన్‌లైన్‌లో కరెంట్ బిల్లు చెల్లించబోయి.. రూ. 7లక్షలు కోల్పోయిన ముంబై మహిళ.. అసలేం జరిగిందంటే?

బిగ్ బజార్, డి-మార్ట్, బిగ్ బాస్కెట్ వంటి కంపెనీల పేరుతో మోసపూరిత వెబ్‌సైట్‌లు క్రియేట్ చేసి.. కోట్లాది రూపాయలు కాజేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ ముఠాలోని ఆరుగురిని గౌతమ్‌బుద్ధ్ నగర్ పోలీసులకు చెందిన సైబర్ హెల్ప్‌లైన్ బృందం ఏప్రిల్ 3న అరెస్టు చేసింది. ఈ సైబర్ ముఠా సభ్యులు ఘజియాబాద్, గౌతమ్ బుద్ధ్ నగర్‌కు చెందిన వారిగా నివేదిక వెల్లడించింది. ఢిల్లీ NCR ప్రాంతంలోనే కాకుండా దేశంలోని అనేక ఇతర ప్రాంతాల్లో ఈ తరహా మోసాలకు పాల్పడినట్టు గుర్తించారు. అరెస్ట్ అయిన ముఠా సభ్యుల్లో వినీత్ కుమార్, ధృవ్ సోలంకి, గౌరవ్ తలన్, సల్మాన్ ఖాన్, సంతోష్ మౌర్య, మనోజ్ మౌర్యగా గుర్తించారు. ఈ ముఠా నుంచి 3 ల్యాప్‌టాప్‌లు, 4 మొబైల్ ఫోన్లు, 2 డెబిట్ కార్డులు, రూ. 11,700 నగదు, హ్యుందాయ్ i10 కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Fake Websites Scam (Photo : Google)

నిందితులపై బిస్రాఖ్ పోలీస్ స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. స్కామర్‌లు అసలైన వెబ్‌సైట్‌ల క్లోన్‌లను క్రియేట్ చేస్తున్నారు. ఈ-కామర్స్ సైట్‌లు మాత్రమే కాకుండా.. ఫేక్ ట్రావెల్ వెబ్‌సైట్‌లను కూడా క్రియేట్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. అంతేకాదు.. కమీషన్ ఆధారిత వర్క్ చేయమని అడిగే జాబ్ స్కామ్‌లు ఉన్నాయి. ఈ ఫేక్ వెబ్‌సైట్‌లను గుర్తించి.. స్కామ్‌కు గురికాకుండా ఎలా సురక్షితంగా ఉండాలో కొన్ని మార్గాలు ఉన్నాయి. మీరు ఫేక్ వెబ్‌సైట్‌లను ఎలా గుర్తించాలి? స్కామ్‌లను ఎలా నిరోధించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫేక్ వెబ్‌సైట్‌లను ఎలా గుర్తించాలంటే? :
మీరు కొనుగోలు చేసే వెబ్‌సైట్.. డొమైన్ పేరును ఒకటికి రెండుసార్లు చెక్ చేయండి. సైబర్ మోసగాళ్లు URL పేరును కొద్దిగా మార్చవచ్చు లేదా డొమైన్ (Extension) మార్చవచ్చు. ఉదాహరణకు.. స్కామర్లు (Amazon.com)కి బదులుగా (amaz0n.com)ని లేదా (Amazon.com)కి బదులుగా (Amazon.org)ని ఉపయోగించవచ్చు. మీరు వెబ్‌సైట్‌ను విజిట్ చేసినప్పుడు.. అడ్రస్ బార్‌లో (URL)కి ఎడమ వైపున ఉన్న ప్యాడ్‌లాక్ చూడండి. ఈ ప్యాడ్‌లాక్ TLS/SSL సర్టిఫికేట్‌తో సైట్ సేఫ్ అని సూచిస్తుంది. యూజర్, వెబ్‌సైట్ మధ్య పంపిన డేటాను సేఫ్టీగా ఉంచుతుంది. ఆయా వెబ్‌సైట్‌కి TLS/SSL సర్టిఫికేట్ ఇవ్వకపోతే.. అడ్రస్ బార్‌లో డొమైన్ పేరుకు ఎడమవైపు ఆశ్చర్యార్థకం గుర్తు (! ) ఇలా కనిపిస్తుంది. అంటే.. ఆ వెబ్‌సైట్ సేఫ్ కాదని గుర్తించాలి.

ఇలాంటి ఫేక్ వెబ్‌సైట్లలో ఆకట్టుకునేలా అనేక డీల్స్ ఉంటాయి. ఆఫర్ చూడగానే తొందరపడి కొనేయడం మంచిది కాదు. ఇలాంటి డీల్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంతకీ ఈ డీల్స్ నిజమా? ఫేక్ అని ఎలా గుర్తించాలంటే.. స్పెల్లింగ్ తప్పుగా ఉంటుంది.. వెబ్‌సైట్ డిజైన్ సరిగా ఉండదు. ఆన్‌లైన్ రివ్యూలను కూడా వెరిఫై చేయండి. కొనుగోలు చేసే ముందు వ్యక్తిగత డేటాను అందించే ముందు.. కొన్ని ఆన్‌లైన్ రివ్యూలను చదవండి. స్కామ్‌ల నివేదికల కోసం చెక్ చేయండి. వెబ్‌సైట్ నమ్మదగినదో కాదో గుర్తించడంలో మీకు సాయపడుతుంది. తద్వారా ఇలాంటి స్కామర్ల మోసాల నుంచి సురక్షితంగా ఉండవచ్చు.

Read Also : Fake Customer Care Scam : గూగుల్‌లో హోటల్స్ కోసం వెతుకుతున్నారా? ఫేక్ కస్టమర్ కేర్ నెంబర్లతో జాగ్రత్త.. యూజర్లు లక్ష్యంగా స్కామర్లు వాడే ట్రిక్ ఇదే..!