Fake Customer Care Scam : గూగుల్‌లో హోటల్స్ కోసం వెతుకుతున్నారా? ఫేక్ కస్టమర్ కేర్ నెంబర్లతో జాగ్రత్త.. యూజర్లు లక్ష్యంగా స్కామర్లు వాడే ట్రిక్ ఇదే..!

Fake Customer Care Scam : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Google)లో కనిపించే ప్రతి డేటా సురక్షితమైనది కాదు.. అందులో ఎక్కువగా ఫేక్ డేటానే పోస్టు చేస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో ఎవరికి ఏదైనా డేటా కావాలంటే గూగుల్‌లోనే సెర్చ్ చేస్తుంటారు.

Fake Customer Care Scam : గూగుల్‌లో హోటల్స్ కోసం వెతుకుతున్నారా? ఫేక్ కస్టమర్ కేర్ నెంబర్లతో జాగ్రత్త.. యూజర్లు లక్ష్యంగా స్కామర్లు వాడే ట్రిక్ ఇదే..!

Fake Customer Care Scam _ Scammers targeting users by posting fake customer care numbers on Google for Indian hotels

Updated On : March 25, 2023 / 7:54 PM IST

Fake Customer Care Scam : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Google)లో కనిపించే ప్రతి డేటా సురక్షితమైనది కాదు.. అందులో ఎక్కువగా ఫేక్ డేటానే పోస్టు చేస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో ఎవరికి ఏదైనా డేటా కావాలంటే గూగుల్‌లోనే సెర్చ్ చేస్తుంటారు. గూగుల్ చూపించే డేటాపైనే ఎక్కువగా ఆధారపడుతుంటారు. ఎక్కడైనా దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు సాధారణంగా చాలామంది గూగుల్ మ్యాప్స్‌లో హోటళ్లను సెర్చ్ చేస్తుంటారు.

ముందుగానే అక్కడి హోటళ్లలో రూమ్ బుకింగ్ చేసుకుంటుంటారు. ఇలాంటి సందర్భాల్లో చాలామంది స్కామర్ల చేతుల్లో మోసపోతున్నారు. వాస్తవానికి గూగుల్ హోటల్ కస్టమర్ కేర్ నెంబర్ల పేరుతో ఫేక్ నెంబర్లను పోస్టు చేస్తున్నారు స్కామర్లు. ఈ కొత్త స్కామ్ ద్వారా ఆన్‌లైన్ మోసగాళ్లు యూజర్లను తప్పుదోవ పట్టిస్తున్నారు. అందుకే ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు సైబర్ నిపుణులు.

స్కామర్లతో జాగ్రత్త.. ఆ నెంబర్లను నమ్మొద్దు :
మీరు ఆన్‌లైన్‌లో హోటళ్లను బుక్ చేసుకుంటే.. ఈ కొత్త స్కామ్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. స్కామర్లు ఇప్పుడు వినియోగదారులను తప్పుదారి పట్టించేందుకు గూగుల్‌లో ఫేక్ కస్టమర్ కేర్ నంబర్‌లను పోస్ట్ చేస్తున్నారు. సైబర్‌ సెక్యూరిటీ సంస్థ, క్లౌడ్‌సెక్ (CloudSEK), భారత్‌లోని హోటళ్లను లక్ష్యంగా చేసుకునే స్కామర్లు ఈ కొత్త స్కామ్‌కు పాల్పడుతున్నారని గుర్తించింది. ఈ స్కామ్‌లో గూగుల్‌లోని హోటల్ లిస్టింగ్‌లలో పోస్ట్ చేసిన ఫేక్ కస్టమర్ కేర్ నంబర్‌లు ఉంటాయి.

Read Also : Scammers Fraud Messages : ఈ బ్యాంకు కస్టమర్లకు హెచ్చరిక.. స్కామర్లతో జాగ్రత్త.. మీ ఫోన్‌కు ఇలా మెసేజ్ వచ్చిందా? క్లిక్ చేస్తే ఖతమే..!

ఈ నంబర్‌లు కస్టమర్‌లను ఆకర్షించేలా క్రియేట్ చేస్తారు. ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ (OCR) టెక్నాలజీతో యూజర్లు చదవలేని విధంగా ఉంటాయి. కానీ, యూజర్లు సులభంగా చదవగలిగేలా ఉంటాయి. ఇలాంటి డేటాపై CloudSEK లోతుగా విశ్లేషించింది. స్కామర్‌లు ఒకే రకమైన హోటల్ రూమ్ ఫొటోలను వివిధ ఫోన్ నంబర్‌లతో పోస్టు చేస్తున్నారు. కస్టమర్‌లను మోసం చేసేందుకు ఈ ఫొటోలను హోటల్ లిస్టు రివ్యూ సెక్షన్‌లోనూ అప్‌లోడ్ చేస్తారు సైబర్ నేరగాళ్లు.

Fake Customer Care Scam _ Scammers targeting users by posting fake customer care numbers on Google for Indian hotels

Fake Customer Care Scam :  Scammers targeting users by posting fake customer care numbers

ఈ నగరాలే స్కామర్ల టార్గెట్..
దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని హోటళ్లను లక్ష్యంగా చేసుకుని స్కామర్లు ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారని తేలింది. ఇందులో జగన్నాథ్ పూరి, ఉజ్జయిని, వారణాసి వంటి పవిత్రమైన నగరాలు కూడా ఉన్నాయి. అన్ని ధరల కేటగిరీల హోటళ్లు, హోమ్‌ స్టేలు లక్ష్యంగా కనిపిస్తున్నాయి. స్కామర్‌లు ఎప్పటికప్పుడు కొత్త Google అకౌంట్లను క్రియేట్ చేస్తున్నారని, స్కామ్‌ను కొనసాగించడానికి కొత్త ఫోన్ నంబర్‌లను కూడా ఉపయోగిస్తారని నివేదిక పేర్కొంది. ఈ స్కామ్‌ల వెనుక ఎవరిదైనా హస్తం ఉందా? లేదా కొంత మంది వ్యక్తుల ప్రమేయం ఉందా అనేది తెలియాల్సి ఉంది. అయినప్పటికీ, వివిధ నంబర్‌లను పోస్టు చేసే మల్టీ గూగుల్ అకౌంట్లను క్రియేట్ చేసినట్టుగా గుర్తించినట్టు సైబర్‌ సెక్యూరిటీ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

అంతేకాదు.. ఈ స్కామ్ కారణంగా బాధితులకు నష్టం కలిగించడమే కాకుండా హోటళ్ల బ్రాండ్ ఇమేజ్‌ను కూడా ప్రభావితం చేస్తుందని క్లౌడ్‌సెక్ తెలిపింది. ఫేక్ డేటా ఆధారంగా పరిశీలిస్తే.. 19 ఫేక్ నంబర్ల నుంచి వచ్చిన కాల్‌లలో 71 శాతం బాధితులుగా మారే వ్యక్తుల ద్వారా సమాధానమిచ్చినట్లు ట్రూకాలర్ రికార్డులు సూచిస్తున్నాయి. ఒక్కో నంబర్ నుంచి సగటున 126 కాల్స్ వచ్చాయి. హోటల్‌ను బుక్ చేసుకునే ముందు.. వినియోగదారులు అధికారిక వెబ్‌సైట్‌లో లిస్టు అయిన ఫోన్ నంబర్‌తో పాటు Googleలో అందించిన నంబర్‌ను క్రాస్ చెక్ చేసుకోవాలి.

ముఖ్యంగా, ట్రూకాలర్ ప్రొఫైల్‌లలోని స్కాన్ చేసిన నంబర్‌లతో లింక్ చేసిన పేర్లు, Google అకౌంట్లకు లింక్ చేసిన పేర్లతో సరిపోలడం లేదని గుర్తించింది. మల్టీ గూగుల్ అకౌంట్లు ఒకే హోటల్ లిస్టులో వేర్వేరు ఫోన్ నంబర్‌లను కలిగి ఉన్నాయని నివేదిక పేర్కొంది. ఈ స్కామ్ గురించి పోలీసు డిపార్ట్‌మెంట్ సైబర్ క్రైమ్ సెల్‌కు సమాచారం అందించింది. ఈ స్కామ్ బారిన పడకుండా తమ కస్టమర్‌లను రక్షించుకునేందుకు హోటల్‌లు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని క్లౌడ్‌సెక్ సూచించింది.

Read Also : IPL 2023 Season : రిలయన్స్ జియో కొత్త ఐపీఎల్ క్రికెట్ ప్లాన్లు ఇవే.. రోజుకు డేటా ఎంతంటే? ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి..!