FASTag Annual Pass : ఆగస్టు 15 నుంచే ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్.. ఇకపై మీరు రూ. 15తో టోల్ ప్లాజా దాటొచ్చు.. వార్షిక పాస్ యాక్సస్ ఇలా?

FASTag Annual Pass : ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్ సౌకర్యం ఆగస్టు 15, 2025 నుంచి అమల్లోకి రానుంది. రూ. 3వేలతో ఈ వార్షిక పాస్ పొందొచ్చు.

FASTag Annual Pass

FASTag Annual Pass : వాహనదారులకు బిగ్ అప్‌డేట్.. ఈ స్వాతంత్య్ర  దినోత్సవం 2025 ఆగస్టు 15 నుంచి ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్ ప్రారంభం కానుంది. ఈ వార్షిక పాస్(FASTag Annual Pass) కోసం ఒకేసారి రూ. 3వేలు చెల్లించాలి. వ్యాలిడిటీ ఏడాది లేదా 200 ట్రిప్పులకు అనుమతి ఉంటుంది.

ఈ పరిమితుల్లో ఏది ముందుగా పూర్తి అయితే ఆ సమయం వరకు వార్షిక పాస్ వ్యాలిడిటీ ఉంటుంది. 200 ట్రిప్పుల ప్రకారం టోల్ క్రాసింగ్ సగటు ఖర్చు రూ. 15 మాత్రమే. ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్ సౌకర్యం ప్రయోజనం ఎక్కడ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఈ వార్షిక పాస్ NHAI హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలలో ఉపయోగించుకోవచ్చు. ఈ వార్షిక పాస్‌ను నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) జారీ చేస్తుంది. NHAI పరిధిలోని జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలలో వర్తిస్తుంది. జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలలో వెళ్లేవారికి వార్షిక ఫాస్ట్‌ట్యాగ్ ప్రయోజనకరంగా ఉంటుంది. తద్వారా చాలా డబ్బు ఆదా చేసుకోవచ్చు. టోల్ పేమెంట్ ప్రక్రియ కూడా చాలా ఈజీగా ఉంటుంది.

ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్ ఏ వాహనాలకు వర్తిస్తుంది :
జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలలో తరచుగా ప్రయాణించేవారికి టోల్ టాక్స్ సేవ్ చేసుకోవచ్చు. ప్రైవేట్ వాహనాల కోసమే ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్ అందుబాటులోకి వస్తుంది. ఈ పాస్ వాణిజ్యేతర వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. ఈ సౌకర్యం ప్రస్తుతం వాణిజ్య వాహనాలకు అందుబాటులో లేదు.

Read Also : Minimum Balance Rule : కస్టమర్లకు బిగ్ అప్‌డేట్.. HDFC, SBI ఇతర బ్యాంకు సేవింగ్స్ అకౌంట్లలో కనీస బ్యాలెన్స్ ఎంత ఉండాలంటే?

మీరు ఇప్పటికే ఫాస్ట్ ట్యాగ్ కలిగి ఉంటే.. వార్షిక పాస్ కోసం కొత్త ఫాస్ట్ ట్యాగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ ప్రస్తుత ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్ యాక్టివేట్ అవుతుంది. ఫాస్ట్ ట్యాగ్ వాహనం విండ్‌షీల్డ్‌పై సరిగ్గా ఇన్‌స్టాల్ చేసి ఉండాలి. వాహనం వ్యాలిడిటీ అయ్యే రిజిస్ట్రేషన్ నంబర్‌కు లింక్ చేసి ఉండాలి. బ్లాక్‌లిస్ట్ అయి ఉండకూడదు.

ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్‌ను ఎలా యాక్టివేట్ చేయాలి? :

  • ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్‌ను యాక్టివేట్ చేసేందుకు ఈజీ స్టెప్స్ ఫాలో అవ్వండి.
  • రాజమార్గ యాత్ర మొబైల్ యాప్ లేదా NHAI అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
  • రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, వాహన నంబర్, ఫాస్ట్ ట్యాగ్ లాగిన్ వివరాలతో లాగిన్ అవ్వండి.
  • మీ వెహికల్, ఫాస్ట్ ట్యాగ్ అర్హతను ఆటోమాటిక్‌గా సిస్టమ్ ధృవీకరిస్తుంది.
  • UPI, నెట్ బ్యాంకింగ్, కార్డ్ ద్వారా రూ. 3వేలు డిజిటల్ పేమెంట్ చేయండి.
  • పేమెంట్, వెరిఫికేషన్ తర్వాత 2 గంటల్లోపు మీ ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్ యాక్టివేట్ అవుతుంది.
  • SMS లేదా ఇమెయిల్ ద్వారా కూడా కన్ఫర్మేషన్ పొందవచ్చు.
  • ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్ ఇతరులకు ట్రాన్స్‌ఫర్ చేయలేరని గుర్తుంచుకోండి.
  • ఫాస్ట్ ట్యాగ్ రిజిస్టర్ చేసిన వాహనానికి మాత్రమే చెల్లుతుంది.

ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్ పనిచేయని చోట వర్తిస్తుంది. ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్ ఏ రాష్ట్ర రహదారి, రాష్ట్రాల పరిధిలోని ఎక్స్‌ప్రెస్‌వే, లోకల్ రోడ్లపై చెల్లదు. ఈ రోడ్లపై టోల్ సాధారణ ఫాస్ట్ ట్యాగ్ సిస్టమ్ ద్వారా మాత్రమే చెల్లించాలి.

వార్షిక పాస్ వ్యాలిడీటీ గడువు దాటితే ఏంటి?:
వార్షిక పాస్ 200 ట్రిప్పుల పరిమితి తర్వాత లేదా ఏడాది పూర్తయిన తర్వాత మీ వార్షిక పాస్ సాధారణ FASTagగా మారుతుంది. వార్షిక పాస్ బెనిఫిట్స్ పొందాలంటే వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా మళ్ళీ రెన్యువల్ చేసుకోవచ్చు.