Flipkart Big Billion Days Sale 2026 : వారెవ్వా.. ఒప్పో ఫోన్లపై కిర్రాక్ డిస్కౌంట్లు.. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ డీల్స్ అసలు వదులుకోవద్దు..!
Flipkart Big Billion Days Sale 2026 : ఒప్పో ఫైండ్ ఎక్స్9ఎస్, ఒప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా ఫోన్లు భారీ డిస్కౌంట్ ధరకే లభించనున్నాయి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో ఈ అద్భుతమైన డీల్స్ లభించనున్నాయి.. పూర్తి ఆఫర్ల వివరాలివే..
Oppo Find X9s and Find X9 Ultra
- ఫ్లిప్‌కార్ట్ బీబీడీ సేల్ 2026 అక్టోబర్ 9న ప్రారంభం కానుంది
- ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా ఫైండ్ X9s ధరలు వరుసగా తగ్గింపు
- ఫ్లిప్‌కార్ట్ గూగుల్, ఆపిల్, శాంసంగ్, ఇతర బ్రాండ్లపై భారీ డీల్స్
Flipkart Big Billion Days Sale 2026 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? మీకోసం అద్భుతమైన సేల్ ఆఫర్లు.. అక్టోబర్ 9న ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2026 ప్రారంభం కానుంది. ఈ సేల్ సమయంలో అనేక స్మార్ట్ ఫోన్లపై అద్భుతమైన డీల్స్ సొంతం చేసుకోవచ్చు.
ముఖ్యంగా గూగుల్ పిక్సెల్స్, ఆపిల్ ఐఫోన్లు, మోటోరోలా వంటి ఇతర ఫోన్లపై కూడా భారీ డీల్స్ పొందవచ్చు. ప్రస్తుతం ఒప్పో స్మార్ట్ఫోన్లపై మరెన్నో ఆకర్షణీయమైన డీల్స్ పొందవచ్చు. ఒప్పో ఫోన్లపై అదిరే డీల్స్ ఎలా సొంతం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
ఫ్లిప్‌కార్ట్ బీబీడీ సేల్ ఒప్పో డీల్స్ :
ఒప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా రూ. 1,69,999 ధరకు లాంచ్ కాగా ఒప్పో అల్ట్రా ఫ్లాగ్షిప్, డిస్కౌంట్లు క్యాష్‌బ్యాక్ తర్వాత రూ. 1,53,000కే లభించనుంది. ఈ ఒప్పో ఫోన్లలో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్, బ్యాక్ సైడ్ క్వాడ్-కెమెరా సెటప్ (200MP + 50MP + 200MP + 50MP)తో పాటు 8K 30ఎఫ్‌పీఎస్ వీడియో రికార్డింగ్ సపోర్ట్ కూడా ఉంది.
మీడియాటెక్ డైమెన్సిటీ 9500s ప్రాసెసర్‌తో ఈ ఫ్లాగ్షిప్ ఫోన్ రన్ అవుతుంది. సేల్ ఆఫర్ల తర్వాత ఈ ఒప్పో ఫోన్ రూ. 72వేలకే లభించనుంది. మరోవైపు, ఒప్పో ఫైండ్ X9s ప్రస్తుత ఆఫర్ ధర రూ. 80,999గా ఉంది. ఇందులో ట్రిపుల్ 50MP రియర్ కెమెరా సెటప్ 7,025mAh బ్యాటరీ ఉన్నాయి.
ఈ డీల్స్‌లో ఆఫర్లు, క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు. కొత్తగా లాంచ్ అయిన ఒప్పో K14 ప్లస్ 5జీ ఫోన్ రూ. 26వేల లోపు ధరకే లభిస్తుంది. అంతేకాదు.. ఫ్లిప్‌కార్ట్ ఒప్పో K14 లైట్, ఒప్పో K14ఎక్స్ 5జీ, ఒప్పో K14 5G వంటి ఇతర ఒప్పో ఫోన్లపై కూడా భారీ ఆఫర్లను పొందవచ్చు. అలాగే, లావా ఫోన్లపై కూడా భారీ డీల్స్ లభించనున్నాయి. కొత్త లావా విరాట్ కర్వ్ 5జీ ఫోన్ క్యాష్‌బ్యాక్ తర్వాత రూ. 19,999కే లభించనుంది.
బడ్జెట్ ఫోన్ల విషయానికి వస్తే..
లావా విరాట్ వి1 5జీ, విరాట్ వి1 ప్రో 5జీ డిస్కౌంట్ల తర్వాత వరుసగా రూ. 11,999, రూ. 14,749 ధరలకు లభించనున్నాయి. ఐఫోన్ 17 మోడల్ రూ. 80వేల లోపు ధరకే లభిస్తుందని ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే ప్రకటించింది.
ఇతర డీల్స్ విషయానికి వస్తే.. డిస్కౌంట్ల తర్వాత గూగుల్ పిక్సెల్ 11 ధర రూ. 70వేల లోపు ధరకు తగ్గుతుంది. శాంసంగ్ గెలాక్సీ S25, శాంసంగ్ గెలాక్సీ S25 ఎఫ్ఈ ధరలు వరుసగా రూ. 60వేలు, రూ. 50వేల కన్నా తక్కువకు లభించనున్నాయి.
