Flipkart Big Billion Days Sale : ఈ నెల 27నే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. రూ. 40వేల లోపు ధరలో స్మార్ట్‌ఫోన్లపై బెస్ట్ డీల్స్..!

Flipkart Big Billion Days Sale : ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లు కలిగిన యూజర్లు సెప్టెంబర్ 26న జరిగే సేల్ ఈవెంట్‌ను ఒక రోజు ముందుగానే యాక్సెస్ చేయగలరు. శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా ఫోన్ రూ. 1 లక్షలోపు అందుబాటులో ఉంటుంది.

Flipkart Big Billion Days Sale : ఈ నెల 27నే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. రూ. 40వేల లోపు ధరలో స్మార్ట్‌ఫోన్లపై బెస్ట్ డీల్స్..!

Flipkart Big Billion Days Sale starts soon, Pixel 8 to be available under Rs 40k only

Updated On : September 18, 2024 / 3:23 PM IST

Flipkart Big Billion Days Sale : ప్రముఖ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ మెగా ఈవెంట్‌కు ముందు, ప్లాట్‌ఫారమ్ కొన్ని స్మార్ట్‌ఫోన్ డీల్స్ రిలీజ్ చేసింది. మోటోరోలా ఫోన్ డీల్స్ కొన్ని ముగిశాయి. ఇప్పుడు పిక్సెల్ 8 కూడా సేల్ సమయంలో భారీ తగ్గింపును పొందుతుందని కంపెనీ వెల్లడించింది. పూర్తివివరాలు ఇలా ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సెప్టెంబర్ 27న ప్రారంభమవుతుంది.

Read Also : iPhone 17 Leaks : ఐఫోన్ 17 సిరీస్ వచ్చేస్తోంది.. కెమెరా, డిస్‌ప్లే, చిప్‌సెట్ వివరాలు లీక్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లు కలిగిన యూజర్లు సెప్టెంబర్ 26న జరిగే సేల్ ఈవెంట్‌ను ఒక రోజు ముందుగానే యాక్సెస్ చేయగలరు. శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా ఫోన్ రూ. 1 లక్షలోపు అందుబాటులో ఉంటుంది. సేల్ టీజర్‌ల ప్రకారం.. పిక్సెల్ 8 రూ. 40వేల లోపు అమ్మకానికి ఉంటుంది. పిక్సెల్ 8 ఫోన్ భారత మార్కెట్లో 8జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ రూ.75,999 ప్రారంభ ధరతో పొందవచ్చు. ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం వినియోగదారులకు భారీ తగ్గింపును అందించనుంది. అయితే, ఈ డీల్ ఎన్ని షరతులతో అందిస్తుందో చూడాలి.

మెటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ధర రూ. 19,999కు అందిస్తోంది. అయితే, మోటో ఎడ్జ్ 50 ధర రూ. 24,999కి అందుబాటులో ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ టీజర్‌ల ప్రకారం.. మోటో ఎడ్జ్ 50 నియో ధర రూ.22,999గా ఉంది. ఈ ప్లాట్‌ఫారమ్ డీల్ ధరలను తక్కువ ధరకే అందిస్తోంది. కోరుకున్న ఫోన్‌పై బెస్ట్ డిస్కౌంట్ ఆఫర్‌ను పొందడానికి వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో డీల్ ధరలను పొందవచ్చు.

సెప్టెంబర్ 18న పోకో ఫోన్‌లు, సెప్టెంబర్ 19న వివో, సెప్టెంబర్ 20న శాంసంగ్, సెప్టెంబర్ 22న నథింగ్, సెప్టెంబర్ 23న ఐఫోన్ డీల్స్‌ను ప్రకటిస్తామని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. ఒప్పో, షావోమీ, ఇన్ఫినిక్స్, గూగుల్ పిక్సెల్ ఫోన్‌ల కోసం చూస్తున్న వ్యక్తులు సెప్టెంబర్ 21న ఫ్లిప్‌కార్ట్ డీల్స్ ద్వారా పొందవచ్చు. ఐఫోన్ 13, ఐఫోన్ 15ప్రో మోడళ్లపై “అతిపెద్ద డీల్” అందజేస్తుందని చేస్తోంది, అంటే.. పాత ఐఫోన్లపై భారీ తగ్గింపు ఆఫర్లను పొందవచ్చు.

అయినప్పటికీ, రిలయన్స్ డిజిటల్ స్టోర్ ఇప్పటికే ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్ స్మార్ట్‌ఫోన్‌లను చాలా తక్కువ ధరకు విక్రయిస్తోంది. ఐఫోన్ 15 ప్రో రిలయన్స్ డిజిటల్ స్టోర్‌లో రూ. 1,09,900కి జాబితా అయింది. అసలు ప్రారంభ ధర రూ. 1,34,900 కన్నా తక్కువగా ఉంది. అంటే.. ఈ ప్లాట్‌ఫారమ్ వినియోగదారులకు రూ.25వేల ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. అయితే, ఈ డీల్ ఐఫోన్ 15ప్రో బ్లూ టైటానియం మోడల్‌లో మాత్రమే కనిపిస్తుంది.

Read Also : iPhone 16 Launch Offers : ఆపిల్ ఐఫోన్ 16 లాంచ్ ఆఫర్లు.. ఈ కొత్త ఐఫోన్ మోడల్స్‌ తక్కువ ధరకే ఎలా కొనుగోలు చేయాలంటే?