Flipkart Big Saving Days Sale : కొత్త స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. సేల్ ఎప్పటినుంచో తెలుసా?
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ త్వరలో మొదలు కాబోతోంది. కొత్త స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌ల, వేరబుల్ డివైజ్ లపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది.

Flipkart
Flipkart Big Saving Days Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ జూన్ 13 ఆదివారం నుంచి మొదలు కాబోతోంది. కొత్త స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌ల, వేరబుల్ డివైజ్ లపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలపై పెద్ద ఆఫర్‌లు, డిస్కౌంట్‌లను అందిస్తోంది. జూన్ 13 నుంచి జూన్ 16 వరకు ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్ కొనసాగనుంది. ఎస్‌బిఐ కార్డ్ యూజర్లకు 10 శాతం ఇన్‌స్టాంట్ తగ్గింపును అందిస్తుంది. ఆఫర్ల విషయానికొస్తే.. గూగుల్ పిక్సెల్ 4A, ఐఫోన్ 11 ప్రో, మోటరోలా రజర్ 5G, శామ్‌సంగ్ గెలాక్సీ F12, ఆసుస్ ROG ఫోన్ 3 సహా స్మార్ట్‌ఫోన్ మోడళ్లపై 4 రోజుల పాటు డిస్కౌంట్లను అందిస్తున్నాయి.
ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్‌కు ఒక రోజు ముందుగానే (జూన్ 12) అర్ధరాత్రి నుంచి బిగ్ సేవింగ్ డేస్ అందుబాటులోకి రానుంది. రాబోయే ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ స్మార్ట్‌ఫోన్‌లపై దృష్టి సారించనుంది. కొన్ని స్పెషల్ డీల్ అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ గూగుల్ పిక్సెల్ 4Aను కూడా రూ. 29,999 నుంచి రూ. 26,999 తగ్గించింది. ఇంకా, iQoo 3 ప్రారంభ ధర రూ. 24,990కే అందిస్తోంది. ఈ ఫోన్ ప్రస్తుతం రూ. 34,990లకు అందుబాటులో ఉంది. Motorola RAZR 5G ఫ్లిప్‌కార్ట్ సేల్ లో భాగంగా అసలు ధర రూ. 1,09,999 ఉండగా రూ. 89,999కు అందుబాటులో ఉండనుంది.
ఐఫోన్ ప్రేమికులకు, ఫ్లిప్‌కార్ట్ అమ్మకంలో ఐఫోన్ 11 ప్రో అందుబాటులో ఉంటుంది. రూ. 79,999 నుంచి రూ.74,999కు తగ్గించింది. ఐఫోన్ XR రూ. 41,999 నుంచి రూ. 39,999లకు తగ్గించింది. ఐఫోన్ SE (2020) రూ. 32,999 నుండి రూ. 31,999 తగ్గింది. ఫ్లిప్‌కార్ట్‌లో జియోనీ మాక్స్ ప్రో , ఇన్ఫినిక్స్ స్మార్ట్ 5 వంటి సరసమైన ఫోన్‌లపై డిస్కౌంట్ అందిస్తోంది. రెడ్‌మి నోట్ 9 తో సహా మోడళ్లపై ప్రీపెయిడ్ డిస్కౌంట్ కూడా ఉంటుంది.