Flipkart Black Friday Sale
Flipkart Black Friday Sale : ఆపిల్ ఐఫోన్ లవర్స్ మీకోసమే.. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ నడుస్తోంది. అనేక స్మార్ట్‌ఫోన్‌లతో సహా వివిధ గాడ్జెట్లపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. ఈ సేల్ సమయంలో ఆపిల్ ఐఫోన్ 16పై కూడా అద్భుతమైన ఆఫర్ అందిస్తోంది. దేశీయ మార్కెట్లో మొదట రూ. 79,900కు లాంచ్ అయిన గత జనరేషన్ ఫ్లాగ్‌షిప్ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 13,400 కన్నా ఎక్కువ భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది.
ఐఫోన్ 16 ప్రీమియం డిజైన్, అదిరిపోయే (Flipkart Black Friday Sale) పర్ఫార్మెన్స్, డ్యూయల్-కెమెరా సిస్టమ్‌తో వస్తుంది. ఇలాంటి డీల్స్ సాధారణంగా ఎక్కువ రోజులు ఉండవు. ఈ ఐఫోన్ కొనాలని చూస్తుంటే ఇది మీకోసమే… అసలు వదులుకోవద్దు. ఇంతకీ ఈ ఐఫోన్ ఆఫర్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు వివరంగా చూద్దాం..
ఆపిల్ ఐఫోన్ 16 ఫ్లిప్‌కార్ట్ డీల్ :
భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 16 రూ.79,900 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ.69,900కి లిస్ట్ అయింది. రూ.10వేలు ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాదు.. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌తో పేమెంట్ చేసేటప్పుడు మీరు రూ.3,495 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. ఎక్కువ సేవింగ్ కోసం మీ పాత స్మార్ట్‌ఫోన్ కూడా ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు.
ఆపిల్ ఐఫోన్ 16 స్పెసిఫికేషన్లు :
ఆపిల్ ఐఫోన్ 16 మోడల్ A18 బయోనిక్ చిప్‌సెట్‌తో 8GB ర్యామ్ కలిగి ఉంది. ఇంకా, ఈ స్మార్ట్‌ఫోన్ 3,561mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఐఫోన్ 22 గంటల వరకు ప్లేబ్యాక్ టైమ్ అందిస్తుందని చెబుతున్నారు. డిస్‌ప్లే విషయానికి వస్తే.. ఐఫోన్ 16 మోడల్ 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ స్క్రీన్, 60Hz రిఫ్రెష్ రేట్, 2,000 నిట్స్ గరిష్ట ప్రకాశాన్ని కలిగి ఉంది.
డిస్‌ప్లే సిరామిక్ షీల్డ్ గ్లాస్ కోటింగ్‌తో కూడా వస్తుంది. HDR డిస్‌ప్లే ట్రూ టోన్‌కు సపోర్టు ఇస్తుంది. ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఐఫోన్ 16 మోడల్ 48MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రావైడ్ సెన్సార్ కలిగి ఉంది. అలాగే, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఐఫోన్ ఫ్రంట్ సైడ్ 12MP కెమెరా కలిగి ఉంది.