Flipkart July 2026 Deal : అబ్బా.. ఈ AI అల్ట్రా ఫోన్ అదుర్స్.. 50MP కెమెరాతో కిర్రాక్ పుట్టిస్తోంది.. ధర చాలా చీప్ గురూ..!
Flipkart July 2026 Deal : మీరు ఏఐ ప్లస్ కొత్త ఫోన్ నోవా 2 అల్ట్రా 5జీ కొనేందుకు చూస్తుంటే ఈ సేల్ సమయంలో ఫ్లిప్‌కార్ట్‌లో అత్యంత చౌకైన ధరకే సొంతం చేసుకోవచ్చు. అది ఎలాగంటే?
Flipkart July 2026 Deal
- ఏఐ ప్లస్ నోవా 2 అల్ట్రాలో 6.78-అంగుళాల 1.5K అమోల్డ్ డిస్ప్లే
- 6,000mAh బ్యాటరీ, 50MP ప్రైమరీ కెమెరా సెటప్
- ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో రూ. 13,950 వరకు ఆదా చేయొచ్చు
Flipkart July 2026 Deal : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? మీరు ఏఐ ఫ్లస్ కొత్త ఫోన్ నోవా 2 అల్ట్రా 5జీ ఫోన్ కొనేందుకు చూస్తుంటే ఇది మీకోసమే.. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్లతో పొందవచ్చు.
ఏఐ నోవా 2 అల్ట్రా 5జీలో 50MP ప్రైమరీ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఇందులో 6,000mAh బ్యాటరీ (Flipkart July 2026 Deal) ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఏఐ ప్లస్ నోవా 2 అల్ట్రా 5జీ ఆఫర్లు, డిస్కౌంట్లు, ధరలపై ఓసారి లుక్కేయండి..
ఏఐ ప్లస్ నోవా 2 అల్ట్రా 5జీ ధర, ఆఫర్లు :
ఏఐ ప్లస్ నోవా 2 అల్ట్రా 5జీ ఫోన్ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 18,999 ధరకు లిస్ట్ అయింది. బ్యాంక్ ఆఫర్లలో భాగంగా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డులపై రూ. 1,900 తగ్గింపు లభిస్తుంది. అసలు ధర రూ. 17,099 అవుతుంది. అదనంగా, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో రూ. 13,950 వరకు ఆదా చేయొచ్చు. అయితే, ఎక్స్ఛేంజ్ ఆఫర్ టాప్ బెనిఫిట్, ఎక్స్చేంజ్ చేసే ఫోన్ ప్రస్తుత వర్కింగ్ కండిషన్, మోడల్‌పై ఆధారపడి ఉంటుంది.
Read Also : Motorola Edge 70 Max : మోటోరోలా మజాకా.. ఈ నెల 15న కొత్త మోటో 70Max వచ్చేస్తోంది.. కీలక ఫీచర్లు లీక్..
ఏఐ ప్లస్ నోవా 2 అల్ట్రా 5జీ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
ఏఐ ప్లస్ నోవా 2 అల్ట్రా 5జీ ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్, 2,500 నిట్స్ టాప్ బ్రైట్ నెస్‌తో 6.78-అంగుళాల 1.5K అమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది. 4nm ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్సెట్తో రన్ అవుతుంది.
8జీబీ LPDDR4x ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అందిస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత NxtQ OSపై రన్ అవుతుంది. ఈ ఫోన్ 33W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 6,000mAh బ్యాటరీతో రన్ అవుతుంది.
కెమెరా సెటప్ విషయానికి వస్తే..
ఏఐ ఫ్లస్ నోవా 2 అల్ట్రా 5జీ ఫోన్ బ్యాక్ సైడ్ OIS సపోర్ట్‌తో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 8MP ఫ్రంట్ కెమెరా ఉంది.
కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, 4G LTE, Wi-Fi 6, బ్లూటూత్ 5.4, సింగిల్ యూఎస్బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్లో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా ఉంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP64 రేటింగ్‌తో వస్తుంది.
