Vivo T4 Pro Discount (Image Credit To Original Source)
Vivo T4 Pro Discount : కొత్త వివో ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. మీ బడ్జెట్ ధరలోనే అద్భుతమైన ఫీచర్లతో వివో T4 ప్రో 5జీ కొనేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా అనేక బ్రాండెడ్ ఫోన్‌లు డిస్కౌంట్ ధరకే లభ్యమవుతున్నాయి. మరో రెండు రోజుల్లో ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా మరిన్ని డీల్స్ అందుబాటులో ఉన్నాయి. వివో T4 ప్రో 5జీ ఫోన్‌పై కస్టమర్లు అదిరిపోయే ఆఫర్లను పొందవచ్చు.
మీరు ఈ వివో ఫోన్ కొనాలని చూస్తుంటే ఇప్పుడే కొనేసుకోవడం బెటర్. ఆకర్షణీయమైన ఆఫర్లు, డిస్కౌంట్‌లతో చౌకైన ధరకే లభిస్తోంది. అద్భుతమైన కెమెరా, బ్యాటరీతో సహా ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి. ఇంతకీ వివో T4 ప్రో 5జీ ఫోన్ ధర ఎంత తగ్గింది? ఏయే ఆఫర్లు, డిస్కౌంట్లు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
వివో T4 ప్రో 5జీ ధర, తగ్గింపు ఆఫర్లు :
వివో T4 ప్రో 5జీ (8GB+128GB)వేరియంట్ ధర రూ. 32,999గా ఉంది. ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ సమయంలో 15శాతం తగ్గింపుతో కొనేసుకోవచ్చు. అయితే, డిస్కౌంట్ తర్వాత ధర రూ. 27,999కు తగ్గుతుంది. మొత్తంగా రూ. 5వేల వరకు సేవ్ చేసుకోవచ్చు.
మీ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే.. ఫోన్ వర్కింగ్ మోడల్, కండిషన్ బట్టి రూ.19,050 వరకు తగ్గింపు పొందవచ్చు. బ్యాంక్ ఆఫర్లతో హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సస్, ఎస్బీఐ బ్యాంక్ కార్డులపై యూజర్లు రూ.3వేల తగ్గింపు పొందవచ్చు. మీరు రూ.4167 నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌తో కూడా సొంతం చేసుకోవచ్చు.
Vivo T4 Pro Discount
వివో T4 ప్రో డిస్‌ప్లే స్క్రీన్ :
ఈ వివో 5G ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.77-అంగుళాల ఫుల్ HD+ క్వాడ్ కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ 5000 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ అందిస్తుంది.
ర్యామ్, పర్ఫార్మెన్స్ :
12GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్‌లో లభిస్తుంది. మల్టీ టాస్కింగ్ కోసం ఈ వివో ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది.
కెమెరా, వీడియో క్వాలిటీ :
ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ కోసం ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. OIS సపోర్టుతో 50MP మెయిన్ కెమెరా, సెకండరీ కెమెరా కూడా 50MP, మూడో కెమెరా 2MP ఉంది. సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరా అందిస్తుంది.
బ్యాటరీ బ్యాకప్ :
పవర్ విషయానికొస్తే.. ఈ వివో ఫోన్ 6500mAh బ్యాటరీతో వస్తుంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. IP69 వాటర్ డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్ కూడా ఉంది. ఇతర ఫీచర్లలో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, Wi-Fi, బ్లూటూత్ జీపీఎస్ ఉన్నాయి.