Flipkart Republic Day Sale : ఈ నెల 14 నుంచే ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్.. ఐఫోన్ 15, పిక్సెల్ 8 ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. మరెన్నో ఆఫర్లు..!
Flipkart Republic Day Sale : ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 14న ప్రారంభం కానుంది. ఐఫోన్ 15 నుంచి పాపులర్ ఆండ్రాయిడ్ ఫోన్‌ల వరకు భారీ డిస్కౌంట్లను అందించనుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
- Sreehari A
- Published On : January 9, 2024 / 04:17 PM IST
Flipkart Republic Day Sale starts on January 14
Flipkart Republic Day Sale : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే మరికొద్ది రోజులు ఆగండి.. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 14న ప్రారంభం కానుంది. కంపెనీ తన ప్లాట్‌ఫారమ్‌లలో రాబోయే సేల్ ఈవెంట్ టీజర్‌ను రివీల్ చేసింది.
తక్కువ ధరకు లభించే ఫోన్‌ల జాబితాను కూడా వెల్లడించింది. ఈ టీజర్ పేజీలో వెల్లడించిన వివరాల ప్రకారం.. రాబోయే ఫ్లిప్‌కార్ట్ సేల్ జనవరి 19 వరకు కొనసాగుతుంది. ఎప్పటిలాగే ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్‌లకు సేల్ ఈవెంట్ ఒక రోజు ముందుగానే అందుబాటులో ఉంటుందని గమనించాలి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఐఫోన్ 15, పిక్సెల్ 8 ఫోన్లపై భారీ డిస్కౌంట్లు :
ప్రస్తుతానికి ఫ్లిప్‌కార్ట్ అన్ని డీల్స్ గురించి కచ్చితమైన ధర వివరాలను వెల్లడించలేదు. అయితే, ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్‌లో పెద్ద డిస్కౌంట్లను పొందే పాపులర్ ఫోన్‌ల పేర్లను ధృవీకరించింది. అందులో ప్రధానంగా ఆపిల్ ఐఫోన్ 15, ఐఫోన్ 14, ఐఫోన్ 13, ఐఫోన్ 12 వంటి ఆపిల్ డివైజ్‌లు ఎక్కువగా డిస్కౌంట్లను అందుకోనున్నాయి.
అంతేకాదు.. ఆండ్రాయిడ్ ఫోన్లలో గూగుల్ పిక్సెల్ 7ఎ, శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీ, మోటోరోలా ఎడ్జ్ 40 నియో, శాంసంగ్ గెలాక్సీ ఎస్22 5జీ, పిక్సెల్ 8, వివో టీ2 ప్రో, ఒప్పో రెనో 10 ప్రో, వివో టీ2ఎక్స్, పోకో ఎక్స్5, రియల్‌మి 11, రెడ్‌మి12, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 34 వంటి మరిన్ని ఫోన్లపై భారీ తగ్గింపు ధరలకు విక్రయించనుంది.
Flipkart Republic Day Sale
రిపబ్లిక్ డే సేల్ ఈవెంట్‌కు ముందు ఐఫోన్ 15 వంటి ఫోన్‌లు ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌లో చాలా తక్కువ ధరకు అమ్ముడవుతున్నాయి. బేస్ 128జీబీ స్టోరేజ్ మోడల్ కోసం రూ.72,999కి లిస్టు అయింది. వాస్తవానికి దేశ మార్కెట్లో ఐఫోన్ 15 రూ. 79,900కి లాంచ్ కాగా.. వినియోగదారులు రూ.6,901 భారీ తగ్గింపును పొందవచ్చు.
అమెజాన్‌లో త్వరలో రిపబ్లిక్ డే సేల్.. :
అంతేకాకుండా, ఫ్లిప్‌కార్ట్ పోటీదారు అమెజాన్ కూడా తన ప్లాట్‌ఫారమ్‌లో ప్రతి ఏడాది మాదిరిగానే రిపబ్లిక్ డే సేల్‌ను నిర్వహిస్తుంది. ఈవెంట్ సేల్ తేదీని కంపెనీ ఇంకా వెల్లడించనప్పటికీ, ధర తగ్గింపు పొందే డివైజ్‌లను రివీల్ చేసింది. ఆసక్తి గల వినియోగదారుల కోసం అమెజాన్ ఇప్పటికీ ఐఫోన్ 13ని తక్కువ ధరకు ఆఫర్ చేస్తోంది. తగ్గిన ధరలకు లభించే ఇతర ఫోన్‌లలో వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్, రెడ్‌మి 12, గెలాక్సీ ఎస్23, వన్‌ప్లస్ 11ఆర్ మరిన్ని ఫోన్లు ఉన్నాయి.
Read Also : Apple iPhone 14 Discount : అత్యంత సరసమైన ధరకే ఆపిల్ ఐఫోన్ 14 సిరీస్.. ఈ ఫోన్ కొనాలా? వద్దా?
