Flipkart Republic Day Sale
Flipkart Republic Day Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫారమ్‌లో రిపబ్లిక్ డే సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్‌ను మాన్యుమెంటల్ సేల్ అని పిలుస్తారు. ఇప్పటికే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. జనవరి 19 వరకు ఈ సేల్ కొనసాగుతుంది.
ఈ సేల్ వ్యవధిలో ఫ్లిప్‌కార్ట్ , ఐఫోన్ 16 సిరీస్, ఇతర పాపులర్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ-కామర్స్ దిగ్గజం పండుగ సేల్ కాలంలో డీల్ ధరలు, ఫ్లిప్‌కార్ట్‌లో రిపబ్లిక్ డే సేల్ చివరి రోజు వరకు ధరలు ఒకే విధంగా ఉంటాయని గ్యారెంటీ లేదు.
Read Also : Apple iPhone 17 Launch : భారీ అప్‌గ్రేడ్‌లతో ఆపిల్ ఐఫోన్ 17 వచ్చేస్తోంది.. మునుపెన్నడూ చూడని ఫీచర్లు..!
లేటెస్ట్ మాన్యుమెంటల్ సేల్ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ కొత్త ఐఫోన్ 16 సిరీస్‌పై రూ. 12వేల వరకు తగ్గింపు ఆఫర్‌లను అందిస్తోంది. ప్రామాణిక మోడల్ డీల్ ధరతో ఇతర ఐఫోన్ డీల్స్ కూడా పొందవచ్చు. ఐఫోన్ 16 ఎలాంటి నిబంధనలు, షరతులు లేకుండా రూ. 67,999కి కొనుగోలు చేయొచ్చు. రూ. 12వేల ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ అందిస్తోంది.
ఎందుకంటే.. ఈ ఫోన్ భారత మార్కెట్లో ధర రూ. 79,999కి లాంచ్ అయింది. అయితే, ఈ ధర ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ మొబైల్ యాప్‌లో మాత్రమే కనిపిస్తుంది. ఈ ఫోన్ వెబ్ వెర్షన్ రూ. 69,999 ధర ట్యాగ్ అందిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ల వంటి బ్యాంక్ కార్డ్‌లపై రూ. 3వేల వరకు తగ్గింపును పొందవచ్చు.
అదేవిధంగా, ఐఫోన్ 16 ప్లస్ ఫ్లిప్‌కార్ట్ మాన్యుమెంటల్ సేల్ సమయంలో రూ. 79,999 వద్ద జాబితా అయింది. ఈ ప్లస్ మోడల్‌ను రూ. 89,900గా ప్రకటించారు. ఫ్లిప్‌కార్ట్ మొత్తం రూ.9,901 తగ్గింపును అందిస్తోంది.
మీరు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వంటి బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి చెల్లించాలని ఎంచుకుంటే.. రూ. 4వేల వరకు తగ్గింపు ఆఫర్ అందిస్తుంది. ఈ ఆఫర్ మొబైల్ యాప్, ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్ రెండింటిలోనూ అందుబాటులో ఉంది. ఐఫోన్ 16ప్రోను కూడా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.
ఈ ఐఫోన్ ప్రో వెర్షన్ ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా బిగ్ డిస్కౌంట్ అందిస్తోంది. ఐఫోన్ 16 ప్రో ధరను రూ. 1,12,900కి తగ్గించింది. ఐఫోన్ ప్రో వెర్షన్ భారత మార్కెట్లో ధర రూ. 1,19,900కి అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ రూ.7వేల ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. కానీ, డీల్ ధర కేవలం వైట్ కలర్ మోడల్‌కు మాత్రమే వర్తిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ వివిధ కలర్ మోడల్‌లకు ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తోంది.
మీరు బ్యాంక్ కార్డ్‌లపై రూ. 5వేల వరకు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. తద్వారా ఫోన్ ధరను మరింత తగ్గుతుంది. చివరగా, ఐఫోన్ 16 ప్రో మాక్స్ కూడా రూ. 1,44,900 నుంచి రూ. 1,37,900 వద్ద విక్రయిస్తోంది. ఈ ధరలన్నీ బేస్ స్టోరేజ్ వేరియంట్‌లకే అని గుర్తుంచుకోవాలి. మీరు ఫ్లిప్‌కార్ట్‌లో ఇతర స్టోరేజ్ వేరియంట్‌ల డీల్‌లను కూడా చెక్ చేయవచ్చు.