Flipkart Year End Sale _ Get up to 92 percent discount on Apple AirPods Pro, buy them for just Rs 1490 Only
Flipkart Year End Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ఇయర్ ఎండ్ సేల్ 2022 డిసెంబర్ 31 (శనివారం)తో ముగియనుంది. డిసెంబర్ 24న ప్రారంభమైన ఈ సేల్ సందర్భంగా అన్ని రకాల స్మార్ట్‌ఫోన్లపై అదిరిపోయే డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. ఆపిల్ ప్రొడక్టుల్లో ఒకటైన ఎయిర్‌పాడ్స్ (Airpods)పై ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఆపిల్ ఎయిర్‌పోడ్స్ ప్రో (Apple Airpods Pro) అసలు ధర రూ. 20,990గా ఉంది. దీనిపై 92శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది. అంటే.. ఈ ఎయిర్ పాడ్స్ కేవలం రూ. 1490లకు మాత్రమే సొంతం చేసుకోవచ్చు.
Flipkart ఆఫర్లు : బ్యాంక్ డిస్కౌంట్లు :
2022 ఇయర్ ఎండ్ సేల్ సందర్భంగా బ్యాంక్ ఆఫ్ బరోడా, ICICI బ్యాంక్ ద్వారా ఫ్లిప్‌కార్ట్‌తో తమ భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నాయి. ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ 2022 సమయంలో అన్ని బ్యాంక్ ఆఫ్ బరోడా, ICICI బ్యాంక్ కస్టమర్‌లు క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై వెంటనే 10శాతం డిస్కౌంట్ పొందవచ్చు.
Flipkart Year End Sale _ Get up to 92 percent discount on Apple AirPods Pro, buy them for just Rs 1490 Only
తద్వారా వినియోగదారులు కేవలం రూ. 1490కి ఆపిల్ ఎయిర్‌పాడ్‌లను కొనుగోలు చేయవచ్చు. AirPods నాయిస్ క్యాన్సిలేషన్‌తో ఇన్-ఇయర్ TWS ఇయర్‌బడ్‌లను కోరుకునే వినియోగదారుల కోసం Apple ఇటీవల AirPods ప్రో మోడల్ మార్కెట్లో రిలీజ్ చేసింది. Apple AirPods ప్రోలో మెరుగైన ప్రాసెసింగ్, నాయిస్ క్యాన్సిలేషన్, అనేక రకాల అదనపు ఫీచర్లు ఉన్నాయి.
ఆపిల్ AirPods ప్రో ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ (Flipkart Year End Sale) సమయంలో రూ. 20,990కి అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ఉపయోగించి కస్టమర్‌లు వారి కొనుగోలుపై అదనంగా 10 శాతం వరకు ఆదా చేసుకోవచ్చు. అప్పుడు ఆపిల్ AirPods Pro ధర రూ. 2వేలు తగ్గింది. Flipkart సేల్ సమయంలో మీ పాత స్మార్ట్ ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకుంటే.. రూ. 17,500 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. అన్ని బ్యాంక్ డిస్కౌంట్లు, ప్రత్యేక ఆఫర్ల తర్వాత Apple AirPods ప్రో ధర రూ. 1,490లకు తగ్గుతుంది. ఈ ధరకు
మీరు ఆపిల్ ఎయిర్ పాడ్స్ కొనుగోలు చేయాలంటే మీరు ఎక్స్ఛేంజ్ చేసుకునే డివైజ్ పర్ఫార్మెన్స్ ఆధారంగా ఉంటుందని గమనించాలి. ఎయిర్ పాడ్స్ ఫీచర్లలో అడ్వాన్స్‌డ్ నాయిస్ క్యాన్సలైజేషన్ టెక్నాలజీ కలిగి ఉన్నాయి. ఇయర్ ఫోన్స్ టచ్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. ఒకసారి ఛార్జింగ్ పెడితే 30 గంటలు వరకు ఎలాంటి అంతరాయం లేకుండా వినియోగించుకోవచ్చు. IPX3 స్వెట్, వాటర్ రెసిస్టెంట్ కూడా ఉన్నాయి.
Apple AirPods ప్రో : స్పెసిఫికేషన్‌లు ఇవే :
* బ్రాండ్ ఆపిల్
* మోడల్ AirPods ప్రో ట్రూ వైర్‌లెస్ స్టీరియో (TWS) ఇయర్‌ఫోన్‌లు
* భారత్‌లో ధర : రూ. 15,899
* విడుదల తేదీ : 30 అక్టోబర్ 2019
* టైప్ : ఇయర్ ఫోన్స్
* హెడ్‌ఫోన్ టైప్ : ఇన్-ఇయర్
* కనెక్టివిటీ : ట్రూ వైర్‌లెస్ స్టీరియో (TWS)
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..