Apple AirPods Pro 2 : ఆపిల్ న్యూ జనరేషన్ ఎయిర్‌ప్యాడ్ ప్రో 2 వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్.. ఇండియాలో ధర ఎంతంటే?

Apple AirPods Pro 2 : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఆపిల్ (Apple) కొత్త ఐఫోన్ 14 సిరీస్ (Apple iPhone 14 Series), ఆపిల్ వాచ్ 8 సిరీస్‌ల (Apple Watch Series 8)తో పాటు ఎయిర్‌పాడ్స్ ప్రో (Airpods Pro 2) నెక్స్ట్ జనరేషన్ డివైజ్ ప్రకటించింది.

Apple AirPods Pro 2 : ఆపిల్ న్యూ జనరేషన్ ఎయిర్‌ప్యాడ్ ప్రో 2 వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్.. ఇండియాలో ధర ఎంతంటే?

AirPods Pro 2 launched with new H2 chip and Active Noise Cancellation

Apple AirPods Pro 2 : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఆపిల్ (Apple) కొత్త ఐఫోన్ 14 సిరీస్ (Apple iPhone 14 Series), ఆపిల్ వాచ్ 8 సిరీస్‌ల (Apple Watch Series 8)తో పాటు ఎయిర్‌పాడ్స్ ప్రో (Airpods Pro 2) నెక్స్ట్ జనరేషన్ డివైజ్ ప్రకటించింది. ఆపిల్ కొత్త వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌ల డిజైన్‌ను మార్చలేదని కంపెనీ పేర్కొంది. పాత డిజైన్‌తోనే అందించాలని కంపెనీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సరికొత్త ఛార్జింగ్ కేస్‌తో వచ్చింది. యూజర్లు మెరుగైన ఫిట్ కోసం.. అదనపు ఇయర్ టిప్ సైజును కూడా పొందుతుంది. ఛార్జింగ్ కేస్, water-resistant కలిగి ఉంది. లాన్యార్డ్ లూప్‌ను కూడా ఉంది.

AirPods Pro 2 launched with new H2 chip and Active Noise Cancellation

AirPods Pro 2 launched with new H2 chip and Active Noise Cancellation

ప్రెసిషన్ ఫైండింగ్‌తో U1-ఎనేబుల్డ్ iPhone యూజర్లు గైడెడ్ డైరెక్షన్‌తో ఛార్జింగ్ కేసును గుర్తించవచ్చు. ఛార్జింగ్ కేస్‌లో బిగ్గరగా టోన్‌లను అందించేందుకు built-in speaker కూడా ఉంది. ఇది మీ ఇయర్ ప్యాడ్ కేసును గుర్తించడం సులభం. ఎయిర్‌పాడ్‌లు మీడియా ప్లేబ్యాక్ కోసం టచ్ కంట్రోల్ కలిగి ఉంటాయి. కింది నుంచి నేరుగా వాల్యూమ్ అడ్జెస్ట్ కలిగి ఉంటాయి. ఆపిల్ ఇయర్‌ఫోన్‌లతో ఎక్కువ బ్యాటరీ లైఫ్ అందిస్తోంది. హుడ్ కింద కొత్త H2 చిప్ ఉంది. మోడ్రాన్ కంప్యూటేషన్ ఆడియోతో 2x యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC)కి సపోర్టు ఇస్తుంది.

ఐఫోన్‌లో TrueDepth కెమెరాను ఉపయోగించి.. యూజర్లు స్పేషియల్ ఆడియోకు పర్సనల్ ప్రొఫైల్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. ఒకే ఛార్జ్‌పై యూజర్లు ఆరు గంటల బ్యాటరీ లైఫ్ పొందుతారని Apple పేర్కొంది. అసలు AirPods Pro కన్నా 33 శాతం అందిస్తుంది. ఛార్జింగ్ కేస్‌తో 30 గంటల లిజినింగ్ టైమ్ అందిస్తుందని తెలిపింది. పాత వెర్షన్ కన్నా 6 గంటలు ఎక్కువగా పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది.

AirPods Pro 2 launched with new H2 chip and Active Noise Cancellation

AirPods Pro 2 launched with new H2 chip and Active Noise Cancellation

కొత్త వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లు ఇప్పటికీ ​​ఛార్జ్ అవుతాయి. అయితే ఇప్పుడు కొత్త AirPods ప్రోని ఛార్జ్ చేయడానికి వారి Apple వాచ్ ఛార్జర్ లేదా ఏదైనా Qi-కంప్యాటబుల్ ఛార్జర్‌ని ఉపయోగించాల్సి ఉంటుంది. AirPods Pro 2 భారత మార్కెట్లో రూ. 26,900 ప్రారంభ ధరతో అందుబాటలో ఉండనుంది. సెప్టెంబర్ 9న ప్రీ-ఆర్డర్ అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్ 23 నుంచి ఆఫ్‌లైన్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటుంది.

Read Also : Apple New Watch Series : ఆపిల్ కొత్త స్మార్ట్‌వాచ్‌లుంటే.. డాక్టర్ మీ దగ్గర ఉన్నట్టే.. ఎన్నో హెల్త్ ఫీచర్లు.. ధర ఎంతో తెలుసా?