Samsung Galaxy A35 price
Flipkart Year End Sale : కొత్త శాంసంగ్ ఫోన్ కోసం చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ నడుస్తోంది. అనేక స్మార్ట్‌ఫోన్లపై భారీ డీల్స్ ప్రస్తుతం ఆన్‌లైన్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్ సందర్భంగా శాంసంగ్ గెలాక్సీ A35 5G ఫోన్ అతి తక్కువ ధరకు లభిస్తోంది. మీరు తక్కువ ధరలో కొత్త ఫోన్ కోసం చూస్తుంటే ఈ ఆఫర్ అసలు వదులుకోవద్దు.. ఈ డీల్ ఎలా పొందాలంటే?
ఈ శాంసంగ్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో (Flipkart Year End Sale) భారీ డిస్‌ప్లేను అందిస్తుంది. ఫొటోగ్రఫీ ఔత్సాహికుల కోసం బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం గెలాక్సీ A35 5Gని రూ. 20వేల లోపు ధరకే అందిస్తోంది. సాధారణ ధర కన్నా భారీ తగ్గింపు అందిస్తోంది. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
భారత మార్కెట్లో రూ.30,999కి లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ A35 5G ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.12,500 ఫ్లాట్ డిస్కౌంట్‌తో లభిస్తోంది. తద్వారా ధర రూ.18,499కి తగ్గింది. ఇంకా, కొనుగోలుదారులు పేమెంట్ కోసం ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ లేదా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లతో 5శాతం క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు.
ఫలితంగా రూ.4వేల వరకు తగ్గింపు పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ పాత ఫోన్లు అప్‌గ్రేడ్ చేసుకునే కొనుగోలుదారులకు అద్భుతమైన ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా అందిస్తోంది. డివైజ్ బ్రాండ్, మోడల్ కండిషన్ బట్టి రూ. 15,050 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ పొందవచ్చు.
Samsung Galaxy A35 price (Image Credit to Original Source)
శాంసంగ్ గెలాక్సీ A35 5G ఫోన్ 6.6-అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేతో ఫుల్ HD+ రిజల్యూషన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ శాంసంగ్ ఫోన్ ఎక్సినోస్ 1380 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. 8GB LPDDR4X ర్యామ్, 256GB వరకు UFS 2.2 స్టోరేజ్‌తో వస్తుంది.
ఆప్టిక్స్ విషయానికి వస్తే.. శాంసంగ్ గెలాక్సీ A25 బ్యాక్ సైడ్ ట్రిపుల్-కెమెరా సెటప్ కలిగి ఉంది. ఇందులో 50MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రావైడ్ లెన్స్, 5MP మాక్రో లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13MP కెమెరా కలిగి ఉంది. ఇంకా, శాంసంగ్ ఫోన్ 25W వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5000mAh బ్యాటరీని అందిస్తుంది.