Apple iPhones : భారతీయుల ఐఫోన్లు 80శాతం ఛార్జింగ్‌తోనే ఆగిపోతున్నాయి.. అసలు కారణం ఇదే!

సాధారణంగా ఏ ఫోన్ అయినా ఛార్జింగ్ 100 శాతం వరకు ఛార్జ్ అయ్యేలా ఉంటుంది. కానీ, కొన్ని ఆపిల్ ఐఫోన్లలో మాత్రం 80శాతం మాత్రమే ఛార్జింగ్ లిమిట్ ఉంది.

Apple iPhones : సాధారణంగా ఏ ఫోన్ అయినా ఛార్జింగ్ 100 శాతం వరకు ఛార్జ్ అయ్యేలా ఉంటుంది. కానీ, కొన్ని ఆపిల్ ఐఫోన్లలో మాత్రం 80శాతం మాత్రమే ఛార్జింగ్ లిమిట్ ఉంది. అది ఎక్కడో కాదు.. మన ఇండియాలోనే.. దేశ రాజధాని ఢిల్లీ లేదా ఉత్తర భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో మీరు ఐఫోన్ వాడినట్టయితే.. 2022 ఏడాదిలో మీ ఐఫోన్ హీటింగ్ వార్నింగ్ వచ్చి ఉండే ఉంటుంది. ఎందుకంటే.. బయట ఉష్ణోగ్రత 40 డిగ్రీల కంటే ఎక్కువగా ఉన్న రోజుల్లో మీ ఐఫోన్ 100 శాతం కెపాసిటీకి ఛార్జింగ్ ఆగిపోయే ఛాన్స్ ఉంది. అలాంటి సమయాల్లో ఈ ఐఫోన్ బ్యాటరీ సమస్య ఎదురవుతుంది.

ఫలితంగా Apple సాఫ్ట్‌వేర్ ట్వీక్‌లు బ్యాటరీ ఛార్జింగ్ యూనిట్‌ను ప్రొటెక్ట్ చేసేందుకు ఛార్జింగ్ ప్రక్రియను ఆపివేస్తాయట.. ‘మీ ఐఫోన్, ఐప్యాడ్ లేదా ఐపాడ్ టచ్ చాలా వేడిగా లేదా చల్లగా ఉండే ప్రదేశాల్లో ఐఫోన్ బ్యాటరీ లైఫ్ పొడిగించడానికి ఏం చేయాలి? ఏం చేయకూడదో కంపెనీ వివరించింది. పరిసర ఉష్ణోగ్రత 0, 35 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండే ఐఫోన్‌లు, ఎలాంటి ఛార్జింగ్ సమస్యలు లేకుండా పనిచేస్తాయని ఆపిల్ తెలిపింది. తక్కువ లేదా అధిక-ఉష్ణోగ్రత పరిస్థితుల్లో మీ డివైజ్ ఉష్ణోగ్రతను నియంత్రించడమే అందుకు కారణం కావచ్చు.

For Lot Of Indians, Iphone Stops Charging At 80 Per Cent, And Here Is The Reason

చాలా వేడి పరిస్థితుల్లో iOS లేదా iPadOS డివైజ్ వినియోగిస్తే.. బ్యాటరీ లైఫ్ శాశ్వతంగా తగ్గిపోతుందని నివేదిక తెలిపింది. మీ ఐఫోన్ పూర్తిగా ఛార్జ్ కావడం లేదంటే.. 80 శాతం కన్నా ఎక్కువ ఛార్జింగ్‌ను లిమిట్ చేయవచ్చని Apple చెబుతోంది. ఎందుకంటే బ్యాటరీ ఛార్జ్ అవుతున్నప్పుడు కొంచెం వెచ్చగా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఉష్ణోగ్రత తగ్గినప్పుడు మీ ఐఫోన్ మళ్లీ ఛార్జ్ అవుతుంది. మీ ఐఫోన్ ఛార్జర్‌ను చల్లని ప్రదేశానికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించండి. iPhone, iPod యూజర్లు తమ బ్యాటరీ యూనిట్ గురించి మరింత తెలుసుకోవడానికి సెట్టింగ్‌లలో బ్యాటరీ హెల్త్ కూడా చెక్ చేసుకుంటుండాలి.

మీరు ‘ఆప్టిమైజ్డ్ బ్యాటరీ ఛార్జింగ్’ ఫీచర్‌ని ఎనేబుల్ చేస్తే.. బ్యాటరీ లైఫ్ ప్రొటెక్ట్ చేసేందుకు 80 శాతం ఛార్జింగ్ మాత్రమే నిండుతుంది. ఆ తర్వాత iPhone నెమ్మదిగా ఛార్జింగ్ అవుతుంది. యూజర్ల ఛార్జింగ్ అలవాట్లను కూడా iOS గమనిస్తుంటుందని కంపెనీ తెలిపింది. మీ ఐఫోన్ ఎక్కువ సమయం పాటు ఛార్జర్‌కి కనెక్ట్ అయినప్పుడు మాత్రమే ఆప్టిమైజ్ బ్యాటరీ ఛార్జింగ్ యాక్టివ్‌గా ఉంటుందని వివరిస్తుంది. ముఖ్యంగా, యూజర్ల ఛార్జింగ్ రొటీన్‌లకు సంబంధించిన డేటా మీ iPhoneలో మాత్రమే స్టోర్ అవుతుంది. డేటా బ్యాకప్‌లలో చేరదు. అంతేకాదు.. ఆ బ్యాటరీ బ్యాకప్ డేటా కంపెనీతో కూడా షేర్ కాదని నివేదిక పేర్కొంది.

Read Also : iPhone 13 Offer : తక్కువ ధరకే ఆపిల్ ఐఫోన్ 13 ఆఫర్.. వారికి మాత్రమేనట..! 

ట్రెండింగ్ వార్తలు